Friday, November 21, 2014

తె. వాదులకు మఱియు దొర భక్తులకు సూటి ప్రశ్నలు!!!



మీరు మాటి మాటికి వెనుకేసుకోసుకొచ్చే మీ దొర నిన్న అసెంబ్లీ లో మాట్లాడిన లాజిక్కు ను ఎలా సమర్ధిస్తారు?



ఇది నా ఫేస్బుక్కు మిత్రుడు కిరణ్ అడిగిన ప్రశ్నలు. తెలంగాణా వాడే, మీలో ఎవరివద్దయినా  సమాధానాలు ఉన్నాయా?
ఉంటే ఇక్కడయినా, అలవాటు ప్రకారం పెసన బ్లాగులో అయినా  కాస్త సమాధానాలు ఇవ్వండి......

ఆయన తప్పించుకోటానికి పాత ప్రభుత్వాలను అడ్డం పెట్టుకోవటం ఎంత వరకు సబబు?

ఆలోచించాల్సిన విషయం ఒక్కటే, పాత ప్రభుత్వాలు సక్రమంగా చేస్తే కొత్త ప్రభుత్వాల అవసరం ఉండదు. వాళ్ళ పని తిరు నచ్చక, చేసిన నిర్ణయాలు నచ్చక, కొత్తగా వచ్చే వాళ్ళు ఏదో పొడిచేస్తారు, దానివల్ల మన జీవితాలు బాగుపడతాయి అనే కొత్త వాళ్ళను ఎన్నుకుంటారు.


ఇవ్వాళ మా దొరగారు MYHOME GROUP భూముల బాగోతం అంత GO కాపీలు ఇస్తాను అని చెప్తూ చదివారు. సంతోషం. నాకు అర్ధం కానిది ఒక్కటే,
పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరి అయిన నిర్ణయమేనా, ఒక వేల సరి అయిన నిర్ణయం అయితే పాత ప్రభుత్వం మిధ నెపం నేట్టాల్సిన అవసరం ఏంటి?
 ప్రభుత్వం ఇలా చెయ్యటం సబబు అనుకుంది కాబట్టి చేస్తున్నాము అని జవాబు చెప్పొచ్చు, ఒక వేల ఈ నిర్ణయం వల్ల ప్రజాధనం దోపిడీ అవుతుంది అనుకుంటే, పాత ప్రభుత్వ నిర్ణయం తప్పు అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, ప్రజల చేత, ప్రజల కొరకు, ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఈ నిర్ణయం పాత ప్రభుత్వం తీసుకుంది, దాని వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు నష్టం అని ప్రకటన చేసి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవచ్చు. అది ఎందుకు చేయటం లేదు?

ఇంతకి దొర గారు ఇవ్వాళ సభలో MYHOME GROUP వాళ్ళకు కట్టబెట్టిన భూముల నిర్ణయాలు సబబు అనుకుంటున్నారా, లేక పోయిన ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల్లో ఇది కుడా ఒక భాగం అనుకుంటున్నారా?

ఒక వేల బహిరంగవేలంలో పాడుకుని MYHOME GROUP తెచ్చుకుంది అనే భావం తెరాస ప్రభుత్వానికి ఉంటె, లగడపాటి రాజగోపాల్ కొనుక్కున్న లాంకో హిల్స్ భూమి కుడా అలాటి ప్రాపర్టీ కాదా? రామేశ్వర్ రావు గారు వేలంలో కొనుక్కుంటే కొనుక్కున్నట్టు, లాంకో వాళ్ళో, వేరే వాళ్ళో  కొనుక్కుంటే కొనుక్కున్నట్టు కాదా? 

అది తెలంగాణా ప్రాంతానికి నష్టం అయినా, పోయిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయినా, దానిని ఆపే శక్తీ ఉన్న ప్రభుత్వం ఆ భూములను కేటాయించటం ఎలా సబబు అవుతుంది?

ఉద్యమ సమయములో వక్ఫ్ భూములు అంటూ గోల చేసి సీమంధ్ర ప్రాంతం వాళ్ళు అంతా దోపిడిదారులు అని చెప్పటానికి, ధర్నాలు చేసి, నానా రభస చేసి, ప్రభుత్వంలోకి వచ్చాక కుడా, సాక్షాత్తు రాష్ట్ర హోం మినిస్టర్ నాయని నరసింహ రెడ్డి గారు, "ప్రభుత్వం లాంకో హిల్స్ మిధ చెర్యలు తీసుకుంటుంది, వాటిని పేదలకు పంచి పెడుతుంది" అని ప్రకటించాక, ఇప్పటి వరుకు నిర్ణయం ఎందుకు తీసుకోవటం లేదు?

మన రాష్ట్రములోనే కాదా దేశంలో ముస్లిం సోదరులు, దేవుని మిధ బక్తితో, ముస్లిం సోదరుల్లో పేద వాళ్ళకు ఉపయోగపడాలి అని తమ ఆస్తుల్లో విరాళాలుగా ఇచ్చే భూమి, నగదు లాంటివి పరిరక్షించటానికి, వక్ఫ్ చట్టం తెచ్చింది. ఈ చట్టం మీద  సుప్రీమ్ కోర్ట్ లో పలు కేసులు నమోదు అయినప్పుడు సుప్రీమ్ కోర్ట్ స్పష్టముగా తీర్పు చెప్పింది, ఒక సారి వక్ఫ్ ఆస్తులు అయితే అవి ఎప్పటికి వక్ఫ్ ఆస్తులే అని. ఆ చట్టాలకు లోబడి, మన ఉమ్మడి రాష్ట్రంలో 1960 కి ముందే చేసిన సర్వే వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి.
లాంకో ఆస్తులు వక్ఫ్ ఆస్తులు అయితే, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా లాంకో సంస్థకు కట్టబెడితే, లేదా తెరాస వాళ్ళు ఇప్పటి వరుకు చెప్తున్నదే నిజం అయితే 6 నెలలుగా ప్రభుత్వంలో ఉంటూ ఇంకా నిర్ణయం ఎందుకు తీసుకోలేదు?

ఒక వేల లాంకో ఆస్తులు, నిన్నటి సభలో కెసిఆర్ గారు చెప్పినట్టు న్యాయంగా చట్టపరంగా, ప్రభుత్వ వేలంలో పాల్గొని, ఎక్కువ మొత్తం చెల్లించి తీసుకున్నవే అయితే ఉద్యమ సమయములో చేసిన ఆరోపణలు అన్ని రాజకీయ ఆరోపణలు గానే చూడాలా?

 ఒక వేల రాజకీయంగా నిరూపించలేని ఆరోపణలు చేస్తే, మన దొర గారు నిన్న అసెంబ్లీలో చెప్పినట్టు రాజకీయ బహిష్కరణ, లేదా సస్పెండ్ లాంటివి చెయ్యల్సిందేనా.

ప్పుడు మన దొరగారు ప్రభుత్వంలో ఉంటూ చేసిన ఆరోపణలు నిరుపించలేకపోతే ఏమి శిక్ష వెయ్యాలి?



సివరాఖరగా, ఇంతకీ మీ దొర  పాలన మొదెలెట్టాడా? మొన్న దసరా కి అయితే మొదెలెట్టలా అన్నాడు, దానికి ఇంకో రెండున్నరేళ్ళు ఆగాలి అని ఎప్పటిలాగా మీ standard సమర్ధన ఉంటే అదీ సెప్పేయండి!!


No comments:

Post a Comment