Friday, February 16, 2018

అ! అనబడే చిత్రరాజం - నా రివ్యు


ముక్కలు ముక్కలు గా, గట్టిగా చెప్పాలంటే పీలికలు పీలికలుగా, కలగా పులగం గా, ఓ (multiple personal disorder)   మనిషిలో ఉన్న రక రకాల కోణాలు చూపించే సినెమా !

అవీ సమాజంలో అతి తక్కువ మంది కి అనుభవం అయ్యె,
స్వలింగ సంపర్కం,
చిన్న తనంలోనే లైంగిక వేధిపులు కు బలి అయ్యె బాలిక,
 డ్రగ్స్ కు విపరీతం గా బానిస అయ్యిన ఓ కుర్ర పిల్ల,
లింగమార్పిడి చెయించుకోబోతున్న ఓ సైంటిస్ట్, లింగమార్పిడి తరువాత ఎలా ఉన్నాడో(దో) చూపించే ఓ వీలుచైర్ లొ కూర్చిని ఉన్న చెక్కమొఖం,
జీడిపాకం లాగే ఓ ఇంద్రజాలికుడి ప్రవర్తన,
ఓ వంట రాని వంటోడు గట్రా సీనులను మిక్సి లో వేసి రుబ్బి,
చూస్తున్నంత సేపు, అసలు దర్శకుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్ధం అవ్వక,
చివరకు చెక్క మొఖం వెసుకొని (ఉన్న కూసింత సేపు), తుపాకితో కాల్చుకొన్న కాజల్ ను చూపించి శుభం కార్డ్ వేసి,
 జండూబాం సేల్స్ పెరగటానికి, స్వలింగ సంపర్కాలు, లింగమార్పిడులు, డ్రగ్స్ వాడటం పెంచటం కోసమే తీసిన సినెమా అనే  ఫీలింగ్స్ తో ప్రెక్షకులను బయటకు వచ్చేటట్లు తీసింది ఈ సినెమా! 

ఇది చెత్త సినెమా అంటేనో, బోరె కొట్టింది అంటేనో, వీళ్ళకు సినెమా చూడటం రాదు అనుకొంటారు ఎమో అనుకొని, సినెమా బాగుంది భయ్యా, సినెమాకు కథే హీరో భయ్యా,

 చివరి  5 నిమిషాలు మాత్రం (అప్పటికి ఇంకా బుఱ్ఱ లో గుజ్జు ఎమయినా మిగిలి ఉంటే) 100 మైళ్లతో బౌన్సర్లు వేసాడు భయ్యా, (వీళ్ల బొంద,  మేకప్ లేకండా, ఏటువంటి భావాలు లేకునుడా, తుపాకి పట్టుకొని కూర్చున్న కాజల్ multiple personality disorder లో భాగంగా అక్కడే ఉన్న కేరక్టర్సే అవి అని చెప్పటం) అని,
సుగర్ కోటింగ్స్ తో, రివ్యులు వ్రాసే వాళ్లు,
బాలేదు అంటే క్లాస్ కారు అనుకొంటారు అనుకొని, ఈ సినెమా పెద్ద క్లాస్ భయ్యా అని గొట్టాలముందు చెప్పే మహా ఊర మాస్ ప్రేక్షకులను,
 TV లలో చూడలేక చస్తున్నాం. 

అయితే, ఇందులో బాగున్నాయి ఏమీ లేవా అంటే, ఉన్న ఒకటి రెండు పాటలు బాగున్నాయి, కెమెర పనితనం బాగుంది, సంగీతం అక్కాడక్కడ బాగుంటూ, మొత్తానికి పర్వాలేదనిపించింది (నాకయితీ భాగమతి ని అక్కడక్కడ అనుకరించాడేమో, దెయ్యాల సీనులలో అనిపించింది), నాని, రవితేజ voice over లు బాగున్నాయి, వాళ్లిద్దరూ దబ్బింగ్ ఆర్టిస్ట్లు గా బాగా రాణించగలరు అని ప్రూవ్ చేసుకొన్నారు.
(పొరపాటున ఈ సినెమాలో పెట్టిన ఒకే ఒక పాసిటివి సీను చెట్ల వలన మనుషులు అనుభవిస్తున్న లాభాలు చెప్పించే క్రమం లో, మేము వదిలిన గాలి పీలుస్తూ మీరు బ్రతికేస్తున్నారు అని చెప్పటానికి బదులు, మేము "పిత్తిన" గాలి వదుల్తూ అని అనిపించటం మాత్రం దారుణం.)

చూడబోతే, సమాజం లో అతి తక్కువ అవలక్షణాలను, నెగెటివిటీ ని చూపించి, glorify చేస్తూ, దానిని variety సినెమా అని చెప్పటం అనే trend తెలుగు సినెమా లోకం లోకి బాగానే చొచ్చుకొని వస్తుంది అని ఈ సినెమా మరో సారి నిరూపించింది. 

ఈ సినెమా చూసిన తరువాత, ఓ డాక్టర్ మితృడు ఫోన్ చేసి, ఇప్పుడు ఆడపిల్లల breast exam చెయ్యాలంటే మగ డాక్టర్స్ భయపడేల తీసాడు వెధవ అని తిట్టాడంటే, negativity ని ఎంత project చేసాడో అర్ధం చేసుకోవచ్చు.

మళ్ళీ దానికి నాని, సమాజం లో ఉన్న కేరేక్టర్ నే చూపించాం అని గొప్పగా చెప్పుకోవటం చూస్తే, తన మీద నాకున్న గౌరవం (తెలిసిన కుటుంబం లో వాడిగా, కష్టపడి పైకి వచ్చిన వాడిగా) కాస్త పోయింది. నాని ఏ మాత్రం social responsibility తో ఆలోచించినా, వచ్చే రోగులను లైంగిక వేధిపులు గురి చేసే డాక్టర్స్, శిష్యురాళ్లను exploit చేసే గురువులు గట్రా ఈ సమాజం లో మెజారిటీ ఏ మాత్రం కాదు, దానికి మించి కొన్ని లక్షల రెట్లు సమాజం లో బాధ్యతతో వ్యవహరించే వారు ఉన్నారు అని గమనించి ఉండే వాడు.


ఇక నావరకు ఈ సినెమాను ప్రోత్సహించకపోవటమే మంచిది అని నా ఉచిత సలహా!! ఆపైన మీ ధైర్యం, మీ అమృతాంజనం :)

3 comments:

  1. అపార్ధం చేసుకున్నారేమో? చీకటి కోణం ఉందని గుర్తు చెయ్య బొయ్యా డని అనుమానం

    ReplyDelete
  2. "అవీ సమాజంలో అతి తక్కువ మంది కి అనుభవం అయ్యె,
    స్వలింగ సంపర్కం,
    చిన్న తనంలోనే లైంగిక వేధిపులు కు బలి అయ్యె బాలిక,
    డ్రగ్స్ కు విపరీతం గా బానిస అయ్యిన ఓ కుర్ర పిల్ల,"


    ఇవి చాలా ఎక్కువండీ.. కానీ బయటపడవు... అందరూ పరువు కోసమో లేకపోతే ఎలా బయట పెట్టాలో తెలీకో అలా మూసి ఉంచుతున్నారు....

    ReplyDelete
  3. నేను సినిమా చూడలేదు, నా కామెంట్ మీ అభిప్రాయం మీద మాత్రమే.

    ReplyDelete