Wednesday, June 25, 2014

కవితక్కా ఏందిది?


అక్కోయ్,

మరిసే పోయావేమో ఇదిగొ నీకు ఓ లింక్ ముందు, గప్పుడు నువ్వు చేసిన సందడి.

https://www.youtube.com/watch?v=LPLLgeBQAIc

మరిప్ప్పుడేమయినాది అక్కో?

గప్పుడు గదె బిల్డింగ్స్, గిప్పుడు గయే బిల్డింగ్స్,
గప్పుడు గయే బుల్డోజెర్స్, గిప్పుడు గయే బుల్డోజెర్స్,
గప్పుడు గదే కూలకొట్టుడు, గిపుడు గదే కూలకొట్టుడు,
కానీ గప్పుడొచ్చినోళ్ళు, గిపుడు రాకపోయనే.
(from Krishna P FB)

Should I expect any real explanation from TRS representatives and KCR family చెంచాలు (in blogs)?


Saturday, June 14, 2014

దెయ్యాలు వేదాలు వల్లించటం !!

క.చ.రా. దొరా, నీకొక్కటి చెప్పనా, మీడియా అతే చేస్తుంది, దరిద్రం గానే చాలా ప్రోగ్రాములు ఉంటున్నాయి, అందులో అనుమానం లేదు, కాకపోతే రోత గురించి, నోటి దూల గురించి నువ్వు, నీ కుటుంబం మాట్లాడటమే అన్నిటికంటే అత్యంత దరిద్రం!!

 తమరు ప్రధాన మంత్రిని ని 'చప్రాసీ' అనొచ్చు, 
కాంగీ మంత్రులను 'బూట్ పాలిష్ గాళ్లూ' అని అనవచ్చు, TDP, MLA లను 'చవటలు, సన్నాసులు, దద్దమలు, లంగాలు, లుచ్హాలూ లాంటి హుందా పదాలతో సంబోధించి, మళ్ళీ వాటికి నానార్ధాలు తాత్పర్యాలు చెప్పి సమర్ధించుకోవచ్చు, 

మిమ్ములను మించిన మీ కొడుకు, అల్లుడు పొలీసు  లను, వాళ్ల మొకాన  'లం... కొడాక, మా కి ల...' లాంటి గౌరువ  పదజాలం ఉచ్చరిచవచ్చు!!

 కానీ మీడియా మాత్రం బుద్ది గా ఉండాలా!! లేకపోతే supress చేస్తావా?

నోటి దూల నీ కుటుంబం ఒక్కరి హక్కే అని మరి ఓ #G.O.#  కూడా పాస్ చేసేయ్ దొరా!! 

పనిలో పని ఎటూ మీడియా నియంత్రణ అంటున్నావు కాబట్ట, ఈ బ్లాగులు, ముఖ పుస్తకాలు లాంటి వాటి నియంత్రణ మీద కూడా ఓ పాలి కన్నేసెయ్ దొరా!! ఓ పని అయిపోతుంది :-)

సివరాఖరుగా, ఎంతయినా, నీ పంఖా గా నీకో ముక్క దొర, ఆంధ్రోళ్లను "ఆంధ్రా అహంకారం ,ఆంధ్రా పార్టీలు ,ఆంధ్రా కతలు ఆంధ్ర వాళ్ళు " అంటూ తిట్లు, ఏడుపులు   నువ్వో, నీ కుటుంబం మో ఏడవాలి దొరా, నీకంటే ఎక్కువ తిట్టేసి నీ image కి దెబ్బకొట్టేస్తున్న నిత్య దుఖిత బ్లాగులను  బ్యాన్ చెసే పని కాస్త చూడు దొర,

అలాగే ఈనాడు నో, ఆంధ్రజ్యోతి నో తిడితే నువ్వే తిట్టాలి గాని, అక్కడ కూడా నీకు పెద్ద కాంపిటీసన్ అయిపోతున్న ఈనాడు, జ్యోతి మాజీ మీడియా గాళ్ల ఏడుపు బ్లాగులను కూడా బ్యాన్ చేసేయ్ దొరా, ఓ పని అయిపోద్ది  :-)

Friday, June 6, 2014

క.చ.రా గారి దిష్టి బొమ్మలు రైతులు దహనం- ఇది కూడా ఆంద్రోళ్ళ కుట్రే!!


తెలంగాణా రాష్ట్రం లో రుణ మాఫీకి కాలపరిమితి విధించటం తో, క. చ. రా. గారి దిష్టి బొమ్మలు తగలెట్టటం తో పాటు, దిష్టి బొమ్మల ముందు మందు సీసాలు కూడా పెట్టి మరీ నిరసన తెలిపిన రైతులు.

http://www.andhrajyothy.com/node/101939

ఇది కూడా ఆంధ్రోళ్ల "కుట్రే" అంటూ బోడిగుండు మందుసూదనుడు ఇంకా టపా పెట్టక ఇలా "మోసం" చేయటం ఏమీ బా లేదు, ఆయన రోజూ పెట్టే నిరంతర ఘోష "కుట్ర, దోపిడీ" టపాల  తో పాటు, ఇదీ కుట్రే అంటూ ఓ టపా పెట్టి నాలాంటి ఆయన వీర ఫంఖాలను కోరిక నెరవేర్చగలరని ఆశిస్తూ :)


గుడ్డిలో మెల్ల, మందు సూదనం గారి అన్నలుంగారయిన ఈటెల గారు మాత్రం ఆయన పంఖాలను తృప్తి పరుస్తూ నిఖార్సయిన స్టెట్మెంట్స్ ఇచ్చారు :)


దీనిపై ఓ ముఖ పుస్తక మితృడు గోపిరెడ్డి గారి post.

"--------
ఆంధ్రా పార్టీలు కుట్రలు మానలేదు: ఈటెల
రాష్టం విడిపోయినా ఆంధ్రా పార్టీల కుట్రలు మానలేదని ఆరోపించారు. తెలంగాణలో ప్రశాంతత వారికిష్టం లేదని దుయ్యబట్టారు. రుణమాఫీని అడ్డం పెట్టుకుని తెలంగాణ రైతుల్లో ఆందోళనకు తెరదీస్తున్నారని మండిపడ్డారు. వారి కుట్రలకు మోసపోవద్దని, తాము చెప్పిందే నమ్మాలని సూచించారు. 

-------------------------ఫైనాన్సు మినిస్టర్ అయిన కూడా బుద్ది మారలేదు రాజేందర్ గారు !


రుణమాఫీ పై గొడవ చేసింది రైతులు ,స్టేట్ మెంట్లు ఇచ్చింది కాంగ్రెస్ ,BJP 


చేసిన హామీలు తీర్చలేక ఇది ఆంధ్ర పార్టీ ల కుట్రలు లంటూ మాటలా !
---------"


చివరగా కొందరు బ్రతుకులంతే మారవని మనం మాత్రం సరిపెట్టుకోవాలంటారా? లేక 1970 లలో ప్రతి దానికి ఇందిరమ్మ విదేశీశక్తుల కుట్ర అంటూ ఎలా బండి నడిపేదో, అలాగే రాబోయే అయిదేళ్లలో
తెలంగాణా లో వర్షాలు పడ్డా, పడకఫొయినా,
దొర గారు మందు తాగినా, పొరబాటున మానేసినా,
దొరగారి మేనకోడలి మరిది తోడల్లుడు కి జలుబు చేసినా .....

ఇది ఆంద్ర పార్టీల కుట్ర" అనెది official statement అవుతుందేమో తె.రా.సా. కు.