Showing posts with label సెంద్రబాబు. Show all posts
Showing posts with label సెంద్రబాబు. Show all posts

Tuesday, March 18, 2025

పచ్చ తమ్ముళ్లు ఇప్పుడేమంటారు?

షిర్డీ సాయి ఎలెక్ట్రికల్స్ మీద  ప్రతిపక్షం లో ఉండగా తెదేపా పార్టీ సంధించిన ప్రశ్నలు, లేవనెత్తిన అనుమానాలు ఇవి. సహేతుకమైనవే. 










ఇప్పుడు అదే కంపెనీకి వేల ఎకరాలు కేటాయించారు, ఎలా? అంటే అప్పుడు చేసిన ఆరోపణలు తప్పా? లేక మూటలు అందాల్సినవారికి అందినాయా? 

మా సెంద్రబాబు కడిగిన ముత్యం అని చెప్పుకొని తిరిగే పచ్చ తమ్ముళ్లు దీనిని ఎలా సమర్థిస్తారు? బాబూ, కొడుకులు మూటలు సంపాదించటం లో బిజీగా ఉంటున్నారు, కార్యకర్తలను పట్టించుకోకుండా అనే  జనాభిప్రాయానికి ఇది ప్రూఫ్ కాదా?
 ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అంటూ చొక్కా బటన్స్ విప్పుకొని తిరిగే పవన్ బాబా/ సకలశాఖామంత్రి గా ఫీల్ అయ్యే ఉపముఖ్యమంత్రి , ఆయనను వెన్కవేసుకొచ్చే  కల్ట్ సైనికులు ఇప్పుడేమంటారు? ఇందులో ఆయన వాటా ఎంత?



Wednesday, April 26, 2023

పచ్చ NRI తమ్ముళ్లకో ఉచిత సలహా!

ఒకరు  నరసారావుపేటో/గుంటూరో MP సీట్ కోసం ఆశావహులు, మరొకరు బెజవాడ MP సీట్ కోసం ఆశావహులు.  

వీళ్లకు టికెట్ కావాలంటే ఏమి చేయాలి? వెళ్లి పార్టీ కి వాళ్ళ స్తోమతను బట్టి చదివించుకొని అక్కడ జనాలలో తిరగాలి.  డబ్బులు ఖర్చు పెట్టుకొని  తిరగాలి అంటే టికెట్ అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అందుకని టికెట్ ఖచ్చితం గా వస్తుంది అంటేనే  వెళ్ళాలన్న ఆలోచన. 

మనకు ఎన్ని డబ్బులు ఉన్నా జేబులోనుండి పైసా తీయని కక్కుర్తి, దానిపైన వీళ్లు  ఓ పైసా ఇచ్చి, ఊళ్ళో (పసుపు)పిచ్చిజనాల దగ్గర 99 పైసలు వసూలు చేసి, మొత్తం ఆ రూపాయి మేమె వసూలు చేసాము అని చెప్పుకొని టికెట్ సంపాదించాలి అన్న ఆర్ధికం గా ఎదిగినా, స్వతహాగా ఉన్న దరిద్రం  తాలూకా ఆలోచనలు!

వీళ్లకు తోడుగా  ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ లో ఊళ్ళో వాళ్ళ డబ్బులతో సంపాదించిన నాలుగు డాలర్లు కనిపించటం తో, వీళ్ళ ప్రక్కన తిరిగితే పెద్దమనుషులం అయిపోతాం, ఇంకొందమంది బకరాలు దొరుకుతారు అన్న ఆలోచనలతో ఉన్న కొంత మంది ముదిరిన బ్యాచ్!

పైన ఇద్దరు, ఈ బ్యాచి కలసి, పాపం ఎలాగయినా 2024 లో తె. దే. పా. ని గెలిపించాలి అన్న ఆశతో ఉన్న ఆ పార్టీ  కార్యకర్తలు, సానుభూతిపరులు దగ్గర ఇప్పటినుండే ఫండ్ రైసింగ్ అంటూ $500 నుండి  ఎంతైనా పర్లేదు అని వసూళ్లు మొదలెట్టారు. 

ఇక ఇప్పుడు నా ప్రశ్న, డాలర్ డాలర్ కూడబెట్టుకొంటూ, నచ్చిన కంప్యూటరో, సెల్ ఫోనో కొనుకోవటం కూడా వాయిదా వేసుకొంటూ ఉండే  మధ్యతరగతి  NRI లు ఇచ్చే $500 నుండి $5000 వరకు డాలర్లు అన్నీ మూటకట్టి వీరికి ఇస్తే, వీరు (కొంత కొట్టేసి)  వెళ్లి అక్కడి  వాళ్లకు అంటూ ఇస్తే అందులో మీ ఊరు పేరు ఏమైనా ఉంటుందా? రేపు నిజం గా మీకు ఏమైనా పనులు కావాలంటే ఆ పార్టీ లో మీ మొఖం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటారా?  2014-19 లో ఆ పార్టీ కార్యకర్తలు కు  జరిగింది మరిచే పోయారా?  

దాని బదులు మీకు అంత పిచ్చి ఉంటె, సుబ్బరమ్ గా ఆ డబ్బులు ఏవో మీ మీ నియోజకవర్గాలలో ఆ డబ్బు అవసరమయ్యే స్థానిక లీడర్స్ కు వ్యక్తిగతం గా ఇవ్వండి, వాళ్ళు సర్పంచులు కావచ్చు, కౌన్సెలర్స్ కావచ్చు, లేక స్థానిక MLA కాండిడేట్ కావచ్చు. ముఖ్యం గా డబ్బు విపరీతం గా లేని  కాండిడేట్ లకు ఇవ్వండి, వాళ్ళు ఏ కులం వారయినా, గెలిచినా గెలవకపోయినా వాళ్ళు మిమ్మలను గుర్తు పెట్టుకోవటానికి, రేపు మీకు ఏమైనా అవసరమయితే మీ తరుపున మాట సాయం చేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

అంతే గాని,  ఈ బలిసిన ముదిరిన బ్యాచ్ కి అందరితో పాటు మీరు  false prestige కి పోయి  ఇస్తే అవి ఏ సోది లోకి రావు, రేపు మిమ్మల్ని పట్టించుకొనేవారు ఎవరూ ఉండరు. 

ఇది ఎంతో మంది NRI మిత్రులకు అటు పచ్చ పార్టీ, బులుగు పార్టీ  లలో గతం లో జరిగిన అనుభవాల రీత్యా చెబుతున్నది, ఆ పైన మీ డబ్బులు మీ ఇష్టం. 

కొసమెరుపు: ఇదంతా మేము మాట్లాడుకొంటూ ఉంటె,  నచ్చితే  మీకే టికెట్ వచ్చి ప్రచారం చేసుకోండి అని చెప్పాలి, లేకపోతె కష్టం అని చెప్పాలి,  రాయినయినా నానబెట్టాలి అనే తత్త్వం వలన  కాదురా మావాడు  మీమీద సూపర్ మెజారిటీ తో గెలుస్తుంది అని ఓ బులుగు ఫ్రెండ్ అనటం.  2024 లో అదీ చూద్దాం లే అని తిరిగి ఓ పచ్చ ఫ్రెండ్ అనటం!

  

Friday, May 8, 2015

యువరాజు గారి అమెరికా పర్యటన!!

యువరాజు గారు అంటే KTR గారు అని భ్రమ పడకండి, మన లోకేష్ బాబు .
ఆయన అమెరికా పర్యటనకు ఎందుకొచ్చినట్టు, ఏ హోదాలో వచ్చినట్టు, అందులో smart villages అంటూ తెగ ప్రచారం ఎందుకు ఏ హోదా లో చెస్తున్నట్లో, కాస్త తెలిస్తే చెప్పండి తెలుగుదేశం తమ్ముళ్ళూ, feeling irrititated!!

ఆ smart village దత్తత అంటూ తెగ హడావుడి చేస్తున్నాడు ఈయన, ఏ గ్రామాన్ని అయినా ఎవరైనా దత్తత తీసుకోవచ్చు పైసా ఖర్చు లేకుందా, కేవలం బళ్ళొ హాజరు వేసుకొన్నట్లు, ఆన్లైన్ లో పేరు పెట్టుకోవటం, దానికి ఈ హడావుడి ఎందుకు? ఆయన మెహర్భాని కోసం తె.దేశం తమ్ముళ్ళు అందరూ అమెరికాలో ప్రతి ఊళ్ళొ పోటీలుపడి నానా హంగామా చేయటం ఏమిటి?  మా ఊళ్లొ వంద ఊళ్లు దత్తత చేసుకొన్నాం అని ఒక తమ్ముడు అంటే, మా ఊళ్లొ రెండొందలు అంటూ ఇంకో తమ్ముడు హడావుడి చేయటం ఎందుకు? వాటికి టివి లలో, సోసల్ మీడియా సైటు లలో అంతులేని హంగామా ఏమిటి?

అక్కడ కార్పోరేషన్ పదవులకు కర్చీఫులు, మున్ముందు MLA టికెట్స్ కో, వాళ్ల వాళ్ళ పనులు అవటం కోసమో యువరాజా వారిని ప్రసన్నం చేసుకోవటానికి కొద్ది మంది రాజకీయ ఆశావాహులు, వ్యాపారులు వాళ్ల వాళ్ల స్వార్ధం కోసం యువరాజా వారి కోసం ఈ మీటింగ్స్ పెడుతుంటే, వాటికోసం పచ్చ తమ్ముళ్ళు చొక్కాలు, జీన్స్ పేంట్లు  చించుకొని పనిచేయటం ఏమిటి? వీళ్లకు కాని, తె.దే.పా. పార్టీ కి గాని ఈ హడావుడి వలన ఒరిగేది, ఉపయోగపడేది ఏమయినా ఉందా? దీని బదులు యువ రాజా ఈ పనికిమాలిన కర్చులు జనాల చేత పెట్టించే బదులు, కేపిటల్ నగరానికి కాస్తో కూస్తో నిధుల సేకరణ చేసి ఉంటే బాగుండెది కదా?

చదివేస్తే ఉన్నమతి పోవటం అంటే ఇదేనేమో! దేవుడా......

p.s. మందు సూదనా,  రాజులయినా, యువ రాజులయినా మా పెద్ద దొర, చిన్న దొరలే ఇందులో కూడా ఆంధ్రోళ్ల కుట్ర అంటూ ఫీల్ అవ్వబాకు :)


Sunday, October 5, 2014

పెద్ద కొడుకు సొద


చంద్రబాబు వృద్థాప్యపు పెన్షన్ పెంచటం (ఎన్నికలలో హామీ ఇచ్చినట్లు గానే) ఆహ్వానించదగినదే!
కాకపోతే మన పెద్దకొడుకు ఇచ్చాడు అంటూ ఓ వెయ్యిరూపాయల నోటు పట్టుకొని ఓ పెద్దాయన చెప్పటం, ముసలి దంపతులు ఆయన ఫోటో గోడకు తలించుకొన్నట్లు గా పదే పదే ఆ TV యాడ్స్ మాత్రం భరించటం కష్టం గానూ, చాలా చిరాకుగా ఉంది. 

దానికి నా కారణాలు.
1. pension పెంచటం అనేది ఒక్క చంద్రబాబు నిర్ణయం అనే కంటే, చంద్రబాబు నేతృత్వము లోని ప్రభుత్వ నిర్ణయం అనటం సంప్రదాయం,
 ఆ సంప్రదాయాన్ని తుంగలోకి తొక్కిన చచ్చిన దేముడు ఇలానే మొత్తం తానే తన సొంత జేబులోనుండి ఇస్తున్నట్లు బిల్డప్పు ఇచ్చి, ఇలానే ప్రభుత్వ డబ్బుతో యాడ్స్ మీద యాడ్స్ ఇచ్చేవాడు, తాను తిన్న విషయాలు కోర్టు అడిగితే మాత్రం అది మంత్రివర్గ సమిష్టి నిర్ణయం మా నాయన ఒక్కడికే సంబంధం ఏమిటి అని ఇప్పుడాయన కొడుకు అంటున్నాడు,
వీళ్లు చేసే తప్పుడు నిర్ణయాలకు మాత్రం మంత్రివర్గం అంతా సమిష్టి గా భాద్యత వహించటం, చేసే ఉపాధి పథకాలు, పేరు వస్తాయనుకొంటున్న పథకాలకు మాత్రం కేవలం ఒక్కళ్లే చేస్తున్నట్లు ఈ బిల్డప్పులు అవసరమా!
2. ఆ యాడ్స్ అసలే డబ్బులు లేని పరిస్తితులలో అవసరమా? ఓ ప్రక్క రాజధానికి చందాలు అడుగుతూ ప్రభుత్వ పరంగా మరో ప్రక్క ఇలాంటి దుబారా ఖర్చులు చేస్తుంటే జనాలకు ఎలాంటి మెసేజి వెల్తుంది?
TV9 పెట్టాలంటే ఈ యాడ్స్ తో బహు చిరాకు గా ఉంది.