Sunday, October 5, 2014

పెద్ద కొడుకు సొద


చంద్రబాబు వృద్థాప్యపు పెన్షన్ పెంచటం (ఎన్నికలలో హామీ ఇచ్చినట్లు గానే) ఆహ్వానించదగినదే!
కాకపోతే మన పెద్దకొడుకు ఇచ్చాడు అంటూ ఓ వెయ్యిరూపాయల నోటు పట్టుకొని ఓ పెద్దాయన చెప్పటం, ముసలి దంపతులు ఆయన ఫోటో గోడకు తలించుకొన్నట్లు గా పదే పదే ఆ TV యాడ్స్ మాత్రం భరించటం కష్టం గానూ, చాలా చిరాకుగా ఉంది. 

దానికి నా కారణాలు.
1. pension పెంచటం అనేది ఒక్క చంద్రబాబు నిర్ణయం అనే కంటే, చంద్రబాబు నేతృత్వము లోని ప్రభుత్వ నిర్ణయం అనటం సంప్రదాయం,
 ఆ సంప్రదాయాన్ని తుంగలోకి తొక్కిన చచ్చిన దేముడు ఇలానే మొత్తం తానే తన సొంత జేబులోనుండి ఇస్తున్నట్లు బిల్డప్పు ఇచ్చి, ఇలానే ప్రభుత్వ డబ్బుతో యాడ్స్ మీద యాడ్స్ ఇచ్చేవాడు, తాను తిన్న విషయాలు కోర్టు అడిగితే మాత్రం అది మంత్రివర్గ సమిష్టి నిర్ణయం మా నాయన ఒక్కడికే సంబంధం ఏమిటి అని ఇప్పుడాయన కొడుకు అంటున్నాడు,
వీళ్లు చేసే తప్పుడు నిర్ణయాలకు మాత్రం మంత్రివర్గం అంతా సమిష్టి గా భాద్యత వహించటం, చేసే ఉపాధి పథకాలు, పేరు వస్తాయనుకొంటున్న పథకాలకు మాత్రం కేవలం ఒక్కళ్లే చేస్తున్నట్లు ఈ బిల్డప్పులు అవసరమా!
2. ఆ యాడ్స్ అసలే డబ్బులు లేని పరిస్తితులలో అవసరమా? ఓ ప్రక్క రాజధానికి చందాలు అడుగుతూ ప్రభుత్వ పరంగా మరో ప్రక్క ఇలాంటి దుబారా ఖర్చులు చేస్తుంటే జనాలకు ఎలాంటి మెసేజి వెల్తుంది?
TV9 పెట్టాలంటే ఈ యాడ్స్ తో బహు చిరాకు గా ఉంది. 

2 comments:

  1. నిజమే, ఫొటో గోడకి తగిలించడం, దణ్ణాలు పెట్టడం టూమచ్.

    ReplyDelete
  2. > ఆ TV యాడ్స్ మాత్రం భరించటం కష్టం గానూ, చాలా చిరాకుగా ఉంది.
    అక్షరాలా ఛండాలంగా ఉంది.

    ReplyDelete