Thursday, August 20, 2020

ఎవడిది కులగజ్జి..!?

ఎవడిది కులగజ్జి..!? అంటూ మిత్రుడు నవీన్ ముఖపుస్తకం గోడ మీద ఇవ్వాళ అడిగిన ప్రశ్నలు. 

ఇటీవలే వరసగా జరిగిన కొన్ని సంఘటనల్ని పరిశీలిస్తే...

మే 7, 2020: ఈ దశాబ్దానికే డెడ్లిఎస్ట్ పేలుడు అనదగిన LG Polymers కేసులో "సురుకంటి రవీందర్ రెడ్డి"ని అరెస్టు చేసారా ఇంతవరకు!?

జూన్ 27, 2020: SPY Agro Industries ఆమోనియా గాస్ లీక్ కేసులో "సజ్జల శ్రీధర్ రెడ్డి"ని అరెస్ట్ చేశారా!?

జూన్ 29, 2020: Sainor Life Sciences బెంజీన్ గాస్ లీక్ కేసులో "కోటి రెడ్డి, బ్రహ్మా రెడ్డి"ని!?

జులై 13, 2020: రాంకీ సాల్వెంట్స్ పేలుడు కేసులో "అయోధ్య రామి రెడ్డి"ని!?

చరిత్ర కూడా కొంచెం తరచి చూస్తే...

ఏప్రిల్ 22, 2014: సరైన ఆధారాలు లేవు అనే కారణంగా జస్టిస్ L. నరసింహా రెడ్డి, ఆగస్ట్ 6 1991 నాటి చుండూరు దళితుల ఊచకోత కేసులో "మల్లిఖార్జున రెడ్డి" సహా 21 మంది లైఫ్ సెంటెన్సీలు, మరో 35 ఖైదీలని విడిచి పెట్టారు. ఈరోజుకీ ఒక్కళ్ళు జైల్లో లేరు, దళితులు నోరు విప్పటానికి వెనకాడతారు!

ఆగస్టు 15, 2008: "గౌరు వెంకట్ రెడ్డి" అనే, సెప్టెంబర్ 19, 1995 నాటి తెలుగుదేశం లీడర్ల జంట హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీని "కనికరించి క్షమాభిక్ష" పెట్టి రిలీజ్ చేసింది వైయెస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం!

పై సంఘటనల్లో ఎక్కడా వీళ్ళకి కులరంగు కనపడదు గానీ... కులమత ప్రాంతీయ భావాలకి అతీతంగా పనిచేసి, దాదాపు 10,00,000 గుండె జబ్బు కేసుల్లో, 99% మించి సక్సెస్ రేట్ తో, ట్రీట్మెంట్స్ నిర్వహించిన ప్రముఖ కోస్తాంధ్ర డాక్టర్ గారి పేరుకి లేని "చౌదరి తోక" తగిలించి, ఒక ప్రమాద ఘటనకి బాద్యుడ్ని చేసి, సంబంధం లేని ఇంకొందరు డాక్టర్లని మీడియా రొచ్చులోకి లాగి పరువు తీసి, మొత్తంగా ఒక కులానికి అపకీర్తి ఆపాదించాలని చూస్తున్నారే ఈ పేటీఎం కులవర్కర్లు.. జనాలు ఎర్రి గొఱ్ఱెల్లా చూస్తూ కూర్చుంటారు అని భ్రమపడుతున్నారేమో!


#WeSupportDoctorRamesh