Tuesday, June 2, 2020

మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు - This Too Shall Pass



అసలే కరోనా బాధలతో చస్తుంటే అమెరికా లో ఈ క్రొత్త గొడవ ఒకటి. ఆ తెల్ల ఇంట్లో కూర్చున్న ఉన్న ఆరెంజ్ కలర్ మనిషి ని నోరు కట్టుకోమని ఎవరైనా చెబితే బాగుండు.  

జనాలు ప్రక్కన కనిపించే ఈ  నాలుగు  ముక్కలు ప్రస్తుతం అందరూ గుర్తెరుగుతే బాగుండు. ఎవడి వాదన  వాడిది. కామ్ గా ప్రొటెస్ట్ చేస్తుంటే ఎవడు పట్టించుకొంటున్నాడు అనేది ఒకడి బాధ,  జీవితాంతం కష్టపడి నిర్మించుకున్న నా వ్యాపారాలని ధ్వసం చేసే హక్కు మీకెవరు ఇచ్చారు అనేది ఇంకొకడి వ్యధ. 

ఏది ఏమయినా, Rodney King incident  తరువాత అంత ఇంటెన్సిటీ చూస్తున్నది ఇప్పుడే.  జరిగింది తప్పే, తప్పు చేసినవాళ్లుకు శిక్ష పడుతుంది అన్న నమ్మకం వ్యవస్థలు ఇవ్వలేకపోవటం దురదృష్టం.  దాని ఫలితం ఇది.  హింసాత్మకం గా మారటానికి, సరైన లీడర్షిప్ లేకపోవటం ఇంకోకారణం. వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు తగలెట్టుకోవటం  ఏమంత తెలివిగలపనో వాళ్ళకే తెలియాలి. 




pc: KTSM  ఈ టైం లో అదృష్టం కొద్దీ ఈ ఊరు Hispanic town


PS: ఈ గొడవలతో బాగుపడుతున్న వ్యాపారాలు ఏవయ్యా అంటే, తుపాకులు అమ్మే షాపులు.  ఆ పైన ప్రైవేట్ సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళు.








ఇక ఇక్కడఉంటున్న ఇండియన్స్ పరిస్థితి: దురదృష్టవశాత్తు, మనం నల్లోళ్ళకు తెల్లోళ్ళము, తెల్లోళ్ళకు నల్లోళ్ళము  కాబట్టి కాస్త బయటకు వెళ్ళినప్పుడూ,  వ్యాపారాల లో  ఉన్నవారు రాబోయే కొద్ది  రోజులు  జాగ్రత్త గా ఉండటం బెట్టర్.  

Tampa లో ఓ ఇండియన్ బంగారుషాపు ఉన్న కాంప్లెక్స్ దృశ్యం: