అసలే కరోనా బాధలతో చస్తుంటే అమెరికా లో ఈ క్రొత్త గొడవ ఒకటి. ఆ తెల్ల ఇంట్లో కూర్చున్న ఉన్న ఆరెంజ్ కలర్ మనిషి ని నోరు కట్టుకోమని ఎవరైనా చెబితే బాగుండు.
జనాలు ప్రక్కన కనిపించే ఈ నాలుగు ముక్కలు ప్రస్తుతం అందరూ గుర్తెరుగుతే బాగుండు. ఎవడి వాదన వాడిది. కామ్ గా ప్రొటెస్ట్ చేస్తుంటే ఎవడు పట్టించుకొంటున్నాడు అనేది ఒకడి బాధ, జీవితాంతం కష్టపడి నిర్మించుకున్న నా వ్యాపారాలని ధ్వసం చేసే హక్కు మీకెవరు ఇచ్చారు అనేది ఇంకొకడి వ్యధ.
ఏది ఏమయినా, Rodney King incident తరువాత అంత ఇంటెన్సిటీ చూస్తున్నది ఇప్పుడే. జరిగింది తప్పే, తప్పు చేసినవాళ్లుకు శిక్ష పడుతుంది అన్న నమ్మకం వ్యవస్థలు ఇవ్వలేకపోవటం దురదృష్టం. దాని ఫలితం ఇది. హింసాత్మకం గా మారటానికి, సరైన లీడర్షిప్ లేకపోవటం ఇంకోకారణం. వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు తగలెట్టుకోవటం ఏమంత తెలివిగలపనో వాళ్ళకే తెలియాలి.
pc: KTSM ఈ టైం లో అదృష్టం కొద్దీ ఈ ఊరు Hispanic town
PS: ఈ గొడవలతో బాగుపడుతున్న వ్యాపారాలు ఏవయ్యా అంటే, తుపాకులు అమ్మే షాపులు. ఆ పైన ప్రైవేట్ సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళు.
PS: ఈ గొడవలతో బాగుపడుతున్న వ్యాపారాలు ఏవయ్యా అంటే, తుపాకులు అమ్మే షాపులు. ఆ పైన ప్రైవేట్ సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళు.
ఇక ఇక్కడఉంటున్న ఇండియన్స్ పరిస్థితి: దురదృష్టవశాత్తు, మనం నల్లోళ్ళకు తెల్లోళ్ళము, తెల్లోళ్ళకు నల్లోళ్ళము కాబట్టి కాస్త బయటకు వెళ్ళినప్పుడూ, వ్యాపారాల లో ఉన్నవారు రాబోయే కొద్ది రోజులు జాగ్రత్త గా ఉండటం బెట్టర్.
Tampa లో ఓ ఇండియన్ బంగారుషాపు ఉన్న కాంప్లెక్స్ దృశ్యం:
మొదటి బొమ్మలో చివరి వాక్యంలో చెప్పినట్లు వివక్షకు రంగు, తేడా లేదు.
ReplyDeleteలింకన్ గారు పోయిన 90 యేళ్ళ తరువాత కూడా Rosa Parks (Montgomery, Alabama) గారి ధిక్కార స్వరం వినిపించింది. 125 యేళ్లయినా కూడా Rodney King సంఘటన, 150 యేళ్ళయినా కూడా ఇప్పుడు George Floyd ఉదంతం .... అమెరికాలో శ్వేతజాత్యహంకారంలో గర్వపడాల్సిన మార్పేమీ రాలేదనిపిస్తోంది. పైగా చిన్న కారణానికే హద్దులేని దాడి.
ఇక విధ్వంసక అల్లర్లు అంటారా? మాకు అలవాటేనండీ, మా సంస్కృతిలో భాగం, కాబట్టి అటువంటి వార్తలు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించవు మాకు. అయితే వాటికీ రంగు, ప్రాంతం, దేశం తేడా లేదని, తెలుస్తోంది. మనుష్యుల నైజం లోకంలో ఎక్కడైనా ఒకటే.
మీరన్నట్లు అమెరికాలోని మనవాళ్లు కొంతకాలం జాగ్రత్తగా ఉండడమే మంచిది.
అవునండి, ఈ గొడవల వలన polarization మరింత పెరిగింది. Asians/ Asian బిజినెస్ లు మధ్యలో నలుగుతున్నారు. అదృష్టం కొద్దీ మన తెలుగు వారు ఎక్కువమంది సబర్బ్ లలో ఉంటారు , ప్రస్తుతానికి ఎక్కువమంది working from home కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ కాలేదు.
Deleteవిభజించి, పాలించాలనుకుంటే ఇలాంటి దుష్పరిణామాలే వస్తాయి.
ReplyDeleteదుష్పరిణామాలు అని మనం అనుకొంటున్నాము కానీ, తెల్ల ఇంట్లో కూర్చున్న ఆయన, ఆయన పార్టీ లో మెజారిటీ వర్గీయులు ప్రస్తుతానికి అనుకొంటున్నట్లు ఏమీ లేదు లెండి. వాళ్ళ పార్టీ లో ఒకళ్ళిద్దరు ఏమయినా అందామన్నా అనలేని పరిస్థితి. ఓవరాల్ గా ఇది వాళ్లకి రేపు రాబోయే నవంబర్ ఎన్నికలలో కలసి వస్తుందనే ఫీలింగ్ లో ఉన్నారు. వాళ్ళ వోట్ బేస్ రీఛార్జి అవుతారు దానిమీద ఏ పార్టీ కి చెందని వాళ్ళు ఎక్కువమంది ఈ లూటింగ్ వలన వీళ్ళ వేపు స్వింగ్ రాష్ట్రాలలో మొగ్గు చూపుతారు అని. పేరుకే 50 రాష్ట్రాలు కానీ, ప్రెసిడెంట్ ఎన్నికలలో ఫలితాలు నిర్దేసించేది ఈ కొద్దీ స్వింగ్ రాష్ట్రాలే. మిగతా మెజారిటీ రాష్ట్రాలు ఎటూ ఆటో ఇటో తేలిపోయి ఉంటాయి కాబట్టి.
Deleteతెల్ల ఇంటికి దిష్టి గుమ్మడికాయ కట్టకపోవడం వలన విపరీతాలు జరుగుతున్నాయని ప్రజలకు అనిపించి "ఇవాళ ఏమైనా సరే గుమ్మడికాయ కట్టి తీరుతాం" అని ఇంటిమీదకి చొచ్చుకు వచ్చారంట. కన్ఫ్యూషన్ లో తన తలకాయ ఎక్కడ వేలాడదీస్తారో అని ఇంట్లో ఫ్రీగా అద్దెకుంటున్నాయన బంకర్లో దాక్కున్నాడట!☺️
ReplyDelete