Friday, May 29, 2020

అయ్యయ్యొ ఇంత అన్యాయమా బ్లు జఫ్ఫా లకు!

ఏమిటి, హైకోర్ట్ ఎలెక్షన్ కమీష్నర్ పదవీకాలాన్ని తన ఇష్టమొచ్చినట్లు మార్చుకొనే వెసులుబాటు లేదందా? ఇలా అయితే ఎట్లా ఏడుపుముక్కలా? అర్జెంట్ గా నువ్వు శతకోటి సలహాదారులలో ఒకడిగా చేరిపోవాల్సిందే, లాభం లేదు.

ఇక పచ్చ తమ్ముళ్ళు ఇదేదో తమ గొప్ప విజయమని కాలర్లు ఎగరేయక్కర్లలేదు. ఎందుకంటే ముందుగా దానిమీద కోర్ట్ కు వెళ్ళింది బి.జె.పి. నాయకులు. తె.దె. వాళ్ళు కాదు. 
ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎప్పుడూ తె.దె. కు సప్పోర్టర్ ఏమీ కాదు. తాను గవర్నర్ సిఫారుసు తో నియమితుడు అయ్యి వచ్చి రాగానే "ఛీప్ సెక్రటరీ" ని అలాగే "ఇంటిలిజెన్స్ DIG" ని మార్చినది మర్చిపోకండి, అంతే కాదు మొన్నటికి మొన్న నామినేషన్లు వేయనీయకుండా కేండిడేట్ లను అడ్డుకొని, కొన్ని చోట్ల రక్తం వచ్చే లాగా కొట్టి మరీ, ఏకగ్రీవాలు చేసుకొంటే, వాటి క్లిప్పింగ్స్ కొన్ని విడియో లలో వచ్చినప్పటికి, ఆ ఏకగ్రీవాలను కేన్సెల్ చేయాలని ప్రతిపక్షాలు మొత్తుకొన్నా, అవి అలానే ఉంటాయి అన్న మాట మర్చిపోకండి. ఇప్పుడు ఉంచుతాడో లేదో తెలియదు.  

రాజకీయాలలో పేరడీ ఏమిటి అంటే, తాము ఎంతో సప్పోర్ట్ చేసిన రాజకీయ పక్షం చేతిలో, LV సుబ్రహ్మణ్యం గారు, నిమ్మగడ్డ రమేష్ లు అవమానింపబడితే, వారిని తీవ్రం గా విమర్శించిన తె.దె. పార్టీ వారికి సానుభూతి తెలపాల్సి రావటం. 

చూద్దాం మన జలగన్నాయ్ దీనిమీద కూడా సుప్రీం కోర్ట్ కు వెళ్తాడేమో!  వెళ్ళాలనే ఆశిస్తున్నా? ఇంతకీ ఎన్నికలు పెడతానికి రేడీ గా ఉండండి అని లాక్డౌన్ లో కూడా ఆఘమేఘాల మెద క్వారెంటీన్ లాంటివి పాటించకుండా వచ్చిన  మాజీ న్యాయమూర్తి  కనగరాజ్ గారు ఎక్కడ?  అంత పెద్ద న్యాయమూర్తి ఆయనకు తెలియదా, ఈ నిర్ణయం కోర్ట్ లలో నిలబడుతుందో లేదో అని? ఇంతకీ ఆయన ఆ రోజు నుండి ఎందుకు కనబడకుండా పోయాడు? ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా సుప్రీం కోర్ట్ కు వెళ్ళొచ్చా? 

చివరాఖరు గా, Dr.సుధాకర్ తరుపున వాదించినందుకు లాయర్,  మాజీ న్యాయమూర్తి కూడా అయిన శ్రావణ కుమార్ మీద పెట్టినట్లు ఇప్పుడు జంధ్యాల శంకర్ మీద కూడా కేసులు కట్టిస్తాడా లేదా మా జలగన్న?  ఇంతకీ బ్లాగులలో వై.చి. పి.  రెసిడెంట్ లాయర్ శ్రీ ఏడుపుముక్కల గారి కామెంట్ ఏమిటో దీనిమీద? ఏమిటో జలగన్న దెబ్బకు బోలెడు క్వొచ్చన్లు బుర్రకు 🤣🤣

3 comments:

  1. 😀😀😀. You have too many expectations. Yedupumukkala will never respond. He only responds in Jaffa blogs since both are belongs to same Jaffa batch.

    ReplyDelete
  2. ఎంతైనా మనిషి ఆశా జీవి కదండి😀. ఎక్కడో చోట ఈ తీర్పు మీద విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించకుండా, సెంద్రబాబు మీద పడి ఏడవకుండా, పచ్చ ఫోబియాతో నో కాకుండా, కామెంట్ పెడితేనొ, తాను ఓ పోస్ట్ పెడితేనో చూడాలని ఉంది.
    మళ్ళీ మీకు ఆశలు ఎక్కువ సుమీ అని నన్ను కిండల్ చేయకండి 🤣🤣

    ReplyDelete
    Replies
    1. అలా చెసై తల పగులని ఏడుపుముఖల వారికి శపమెమొ అండి😀😀

      Delete