Sunday, May 24, 2020

టీటీడీ భూముల అమ్మకం!!


టీటీడీ భూముల అమ్మకం గురించి ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అప్పట్లో




ఈ మాటలు విన్న తరువాత కూడా, ఇదే పెద్దమనిషి అవే టీటీడీ భూముల అమ్మకానికి  పెట్టేయటాన్ని జఫ్ఫాలు  లు, సాక్షి మాత్రమే చదివే అఖిలాండ జగన్ భక్తులు 🙏ఎలా సమర్థిస్తారో మరి 🤭🤭🤭



ఇక దీనిమీద Bharat Today  లో పరిపూర్ణానంద గారి అద్భుతమయిన స్పీచ్.   ఇందులో కవర్ చేసినవి భూముల గురించి, కనకదుర్గ అమ్మవారి గుడిలో క్షుద్ర పూజలు జరిగాయని చేసిన గొడవ గురించి, ఏడాది గా దానిగురించి కనీసం విచారణ చేపట్టలేకపోవటం గురించి, పింక్ డైమండ్ అని నానా యాగీ చేసి, ఇప్పుడు గమ్మున ఉండటం గురించి,  రమణ దీక్షితుల అభ్యంతరం  లడ్డులు అమ్ముకోవటం గురించి, గత ప్రభుత్వం చేసిందే మేము చేస్తున్నామనే పనికిమాలిన ఆర్గుమెంట్ గురించి.

శేఖర్ రెడ్డి  అప్పోయింట్మెంట్ గురించి అప్పుడు ఆయన CBN  బినామీ అని చేసిన యాగీ, మళ్ళి  అతన్నే అప్పోయింట్ చేసుకొన్న వైనం గురించి కూడా కవర్ చేసుంటే పోయేది స్వామి.



చివరాఖరుగా, వీర జగన్ భక్తుడే అయినప్పటికీ,  నా మిత్రుడు Gopi  Ch  అన్న మాట ముఖ పుస్తకం లో:

"చిన్న చిన్న ఆస్తులే కదా అమ్మితే పోలా అనుకొంటే రాజకీయ నాయకులు మొత్తం వెంకన్న ఆస్తిని కూడా నాకేస్తారు రా అయ్యా ...! కొంచెం మేల్కోండి ... తీవ్రంగా .. ఖండించండి ..!!!" 

ఆ ముక్కే నేను కూడా చెప్పేది. 

అయ్య పెట్టుకొని పావురాళ్ళ గుట్ట కు అంకితం అయ్యాడు, అయినా కొడుకు ఎందుకు పెట్టుకొంటున్నాడో  ఆ పై వాడికే తెలియాలి. 

No comments:

Post a Comment