Wednesday, April 26, 2023

పచ్చ NRI తమ్ముళ్లకో ఉచిత సలహా!

ఒకరు  నరసారావుపేటో/గుంటూరో MP సీట్ కోసం ఆశావహులు, మరొకరు బెజవాడ MP సీట్ కోసం ఆశావహులు.  

వీళ్లకు టికెట్ కావాలంటే ఏమి చేయాలి? వెళ్లి పార్టీ కి వాళ్ళ స్తోమతను బట్టి చదివించుకొని అక్కడ జనాలలో తిరగాలి.  డబ్బులు ఖర్చు పెట్టుకొని  తిరగాలి అంటే టికెట్ అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అందుకని టికెట్ ఖచ్చితం గా వస్తుంది అంటేనే  వెళ్ళాలన్న ఆలోచన. 

మనకు ఎన్ని డబ్బులు ఉన్నా జేబులోనుండి పైసా తీయని కక్కుర్తి, దానిపైన వీళ్లు  ఓ పైసా ఇచ్చి, ఊళ్ళో (పసుపు)పిచ్చిజనాల దగ్గర 99 పైసలు వసూలు చేసి, మొత్తం ఆ రూపాయి మేమె వసూలు చేసాము అని చెప్పుకొని టికెట్ సంపాదించాలి అన్న ఆర్ధికం గా ఎదిగినా, స్వతహాగా ఉన్న దరిద్రం  తాలూకా ఆలోచనలు!

వీళ్లకు తోడుగా  ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ లో ఊళ్ళో వాళ్ళ డబ్బులతో సంపాదించిన నాలుగు డాలర్లు కనిపించటం తో, వీళ్ళ ప్రక్కన తిరిగితే పెద్దమనుషులం అయిపోతాం, ఇంకొందమంది బకరాలు దొరుకుతారు అన్న ఆలోచనలతో ఉన్న కొంత మంది ముదిరిన బ్యాచ్!

పైన ఇద్దరు, ఈ బ్యాచి కలసి, పాపం ఎలాగయినా 2024 లో తె. దే. పా. ని గెలిపించాలి అన్న ఆశతో ఉన్న ఆ పార్టీ  కార్యకర్తలు, సానుభూతిపరులు దగ్గర ఇప్పటినుండే ఫండ్ రైసింగ్ అంటూ $500 నుండి  ఎంతైనా పర్లేదు అని వసూళ్లు మొదలెట్టారు. 

ఇక ఇప్పుడు నా ప్రశ్న, డాలర్ డాలర్ కూడబెట్టుకొంటూ, నచ్చిన కంప్యూటరో, సెల్ ఫోనో కొనుకోవటం కూడా వాయిదా వేసుకొంటూ ఉండే  మధ్యతరగతి  NRI లు ఇచ్చే $500 నుండి $5000 వరకు డాలర్లు అన్నీ మూటకట్టి వీరికి ఇస్తే, వీరు (కొంత కొట్టేసి)  వెళ్లి అక్కడి  వాళ్లకు అంటూ ఇస్తే అందులో మీ ఊరు పేరు ఏమైనా ఉంటుందా? రేపు నిజం గా మీకు ఏమైనా పనులు కావాలంటే ఆ పార్టీ లో మీ మొఖం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటారా?  2014-19 లో ఆ పార్టీ కార్యకర్తలు కు  జరిగింది మరిచే పోయారా?  

దాని బదులు మీకు అంత పిచ్చి ఉంటె, సుబ్బరమ్ గా ఆ డబ్బులు ఏవో మీ మీ నియోజకవర్గాలలో ఆ డబ్బు అవసరమయ్యే స్థానిక లీడర్స్ కు వ్యక్తిగతం గా ఇవ్వండి, వాళ్ళు సర్పంచులు కావచ్చు, కౌన్సెలర్స్ కావచ్చు, లేక స్థానిక MLA కాండిడేట్ కావచ్చు. ముఖ్యం గా డబ్బు విపరీతం గా లేని  కాండిడేట్ లకు ఇవ్వండి, వాళ్ళు ఏ కులం వారయినా, గెలిచినా గెలవకపోయినా వాళ్ళు మిమ్మలను గుర్తు పెట్టుకోవటానికి, రేపు మీకు ఏమైనా అవసరమయితే మీ తరుపున మాట సాయం చేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

అంతే గాని,  ఈ బలిసిన ముదిరిన బ్యాచ్ కి అందరితో పాటు మీరు  false prestige కి పోయి  ఇస్తే అవి ఏ సోది లోకి రావు, రేపు మిమ్మల్ని పట్టించుకొనేవారు ఎవరూ ఉండరు. 

ఇది ఎంతో మంది NRI మిత్రులకు అటు పచ్చ పార్టీ, బులుగు పార్టీ  లలో గతం లో జరిగిన అనుభవాల రీత్యా చెబుతున్నది, ఆ పైన మీ డబ్బులు మీ ఇష్టం. 

కొసమెరుపు: ఇదంతా మేము మాట్లాడుకొంటూ ఉంటె,  నచ్చితే  మీకే టికెట్ వచ్చి ప్రచారం చేసుకోండి అని చెప్పాలి, లేకపోతె కష్టం అని చెప్పాలి,  రాయినయినా నానబెట్టాలి అనే తత్త్వం వలన  కాదురా మావాడు  మీమీద సూపర్ మెజారిటీ తో గెలుస్తుంది అని ఓ బులుగు ఫ్రెండ్ అనటం.  2024 లో అదీ చూద్దాం లే అని తిరిగి ఓ పచ్చ ఫ్రెండ్ అనటం!