ప్రజారాజ్యం ఓడిపోవటానికి కారణమయిన వాళ్లను వదిలిపెట్టను - ఓ పార్ట్ టైం రాజకీయ తమ్ముడు
ఒరె సామి, ఇంట్లొ ముఖ్యం గా మీ అన్నాయ్ బామ్మర్ది అరవింద్ మీద కోపమేదన్నా ఉంటే, ఇంట్లొ తేల్చుకోవాలిగాని, ఇలా వీధిలో బయటపెట్టటం ఏం బాలేదు !!
పనిలేనమ్మ ఉలిపికట్టమీద పడ్డట్టు, పాతవిషయాలు తవ్వుకుంటూ, ప్రభాకర్ మీదో, ఇంకొకరి మీదో పడి ఏడవటం, ప్రోడుసర్స్ మాత్రం బాగుపడి, మిగతావోళ్లందరిని నట్టేట ముంచిన ప్రజా రాజ్యం అనే ఓ అట్టర్ ప్లాప్ సినెమా గురించి పాత విషయాలు ఎత్తటం మొదలేడి తే, పడే బురద మీ మీదే అని ఎలా మర్చి పోయావు?
లేక ప్యాకేజి లో భాగం గా, స్పీచ్ వ్రాసినోడిని కూడా #పీవీపీ# లాంటి 420 గాడు ఎవడయినా పంపాడా :))
అయినా తమ్ముడన్నాయ్, మనలో మన మాట, పోలవరం లో అవనీతి జరుగుతుందా, లేదా? ముందు దానిమీద క్లారిటీ నీకు ఉందా, లేదా? మీ ఇంటి కుక్క ఘంటా, వాని వియ్యంకుడు ఇద్దరూ చంద్రబాబుకు లెఫ్ట్, రైట్ ..... లాగా 24 గంటలూ పనిచేస్తూ ఉంటే, అంత చిన్న విషయం మీదే క్లారిటీ గా మాట్లాడలేని వానివి, రాజకీయ పార్టీ పెట్టటం ఏమిటి? దానికి జనాలు గుడ్డలు చించుకోవటం ఏమిటి?
తన మీద ఉన్న వ్యతిరేక వోటు ను చీల్చటానికి ఆ రోజున మహామేత కోవర్ట్ గా, మీ అన్నాయ్ పార్టీ పెట్టి, అమ్ముడుపోయినట్టు, ప్రస్తుతం తమరు కూడా, చంద్రబాబు కోవర్ట్ గా పార్టీ పెట్టి హడావుడి చేయబోతునట్టు అగ్రహారం లో టాక్, ముందు దానిమీద కొంచం క్లారిటీ నీ ఫంకా లకు ఇస్తే బెట్టరేమో ఆలోచించు చె గు వేరా!
లేకపోతే, నీ అన్నాయ్ ని నమ్ముకొని, నట్టేట మునిగిన బ్యాచ్ లాగా, ఇంకో బ్యాచ్ బలి అవుతారు.
ఇట్టాగే, వారానికో పాట, నెలకో మీటింగ్ ఎలెక్షన్స్ వరకు కంటిన్యు చేయబ్బా, కాస్త మంచి ప్యాకేజి దక్కే అవకాశాలు మెండు గా ఉంటాయి.
చివరాఖరికి, ట్విట్టర్ లో కాకుండా జనాలలో కి వచ్చి నాలుగు ముక్కలు (కారణాలు ఏమయినా) మాట్టాడటం మెచ్చుకో తగ్గ విషయమే!! ,
కాకపొతే, తండ్రి ముఖ్యమంత్రి అయితే జగన్ కావాలా అని అనటం బానే ఉన్నా, అది నువ్వు అడగటం చాలా చాలా అసహ్యం గా ఉంది, మీ అన్న ఒకడు సినెమా హీరో అయినందుకు, రక రకాల ప్లాస్టిక్ సర్గరీలు చేయించుకున్న చెక్కమొఖాలు అందరూ నీ కుటుంబం నుండి హీరో లు కావాలా అని జనాలు కూడా అడుగుతారు అని మర్చిపోవద్దు చే గు వె రా!!
పవన్ కల్యాణ్ + అతని అభిమానులు అనేది ఒక పిచ్చి సమాజం. ఆ సమాజంలో తెలివైనవాడు పవన్ కల్యాణ్.
ReplyDeleteఆయన వాళ్ళకి రాజ్యాంగం గురించీ, పధ్ధతుల గురించీ, పటేల్, శాశ్త్రిల గురించీ చెప్పటమూనూ, వాళ్ళు నోట్లో వేళ్ళేసుకొని వినడమూ. వాళ్ళ దృష్టిలో ఈయన పెద్ద వక్త కం మేధావి. వాళ్ళను చంద్రబాబు రక్షించుగాక.