బ్లాగులు ఈ మద్దెన చూస్తూ ఉంటె, కాస్త జఫ్ఫాల (జగన్ ఫంకాల) గోల ఎక్కువ అయ్యినట్లు అనిపిస్తుంది, దొంగ పెపంచం ఆయన ఓ పోస్ట్ పెట్టటం, ఏడుపుముక్కల వచ్చేసి, ఓ ఓండ్ర పెట్టెయటం, అంతలోకి హైలీ రెస్పెక్టెడ్ చిన్న కలల ఆయన వచ్చేసి హైలీ రెస్పెక్టెడ్ తీర్పులు ఈయటం కామన్ అయిపోయినట్లు అనిపిస్తుంది.
సరే ఎటూ హైలీ ఏడుపులు ప్రతి దానిమీద రోజూ ఏడుస్తున్నారు కాబట్టి,
ఈ క్రింద పోస్ట్ కు మీ హైలీ సమర్ధన ఏమిటో చెబుతారా? ఇది నా మిత్రుడు ఒకాయన ముఖపుస్తకం లో వ్రాసింది.
సరే ఎటూ హైలీ ఏడుపులు ప్రతి దానిమీద రోజూ ఏడుస్తున్నారు కాబట్టి,
ఈ క్రింద పోస్ట్ కు మీ హైలీ సమర్ధన ఏమిటో చెబుతారా? ఇది నా మిత్రుడు ఒకాయన ముఖపుస్తకం లో వ్రాసింది.
జెరూసలేం యాత్ర !
**********************
ఎవరి కోసం, ఏ వర్గాల మేలు కోసం నడుపుతున్నారు ప్రభుత్వాన్ని ?
జెరూసలేం యాత్రకి క్రైస్తవులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్ మొత్తాన్ని నలభయివేల నుండి అరవైవేల రూపాయలకు పెంచుతూ జగన్ రెడ్డిగారి ప్రభుత్వం నిన్న జారీ చేసిన జీవో ఇది. 2013 లో కిరణ్‌కుమార్ రెడ్డి మొదలు పెట్టిన పథకం . అప్పుడు ఇచ్చింది 20,000. మూడేళ్ళు తిరిగేసరికి 2016 లో ఈ గ్రాంట్ వందశాతం పెంచి ఇరవైవేల నుండి నలభయివేలు చేశారు. ఇప్పుడు మళ్ళీ మూడేళ్ళు తిరిగేసరికి యాభయి శాతం పెంచి అరవైవేలు చేశారు. బహుశా దేశంలో ఏ గ్రాంట్/సబ్సిడీ కూడా మూడేళ్ళకొకసారి ఇంత వేగంగా పెరిగి ఉండదు ! పైగా రాష్ట్రంలో తక్షణ సమస్యలేవీ లేనట్లు, జగన్ రెడ్డిగారు ప్రమాణస్వీకారం చేసిన నలభై రోజులకే (జూలై 10) సిఎం కార్యాలయంనుండి లేఖ వెళ్ళిందట (జీవోలో మెన్షన్ చేశారు చూడండి). వీటన్నిటి ప్రకారం గ్రాంట్ పెంచాలని ఆగస్టులోనే మైనారిటీశాఖ నిర్ణయించిందట. ఇప్పుడు జీవో వదిలారట !
రేపో మాపో పోయే ముసలోళ్ళకి పెన్షన్ మాత్రం విడతలవారీగా ఏడాదికి 250 రూపాయలు పెంచుతారా ? అంటే ముష్టి పదిశాతం. మీరు హామీ ఇచ్చినట్లు వెయ్యిరూపాయలు పెంచడానికి మీకు నాలుగేళ్ళు కావాలా ? నాలుగు అన్నం ముద్దలు అందించే రైతుకి ఏడాదికి 12,500 ఇస్తామని హామీ ఇచ్చిన "రైతుభరోసా" పథకంలో కేంద్రంవాటా కలుపుకుని మీరిచ్చేది 6500 రూపాయలా ? ఏం మీ తరపున 12500 + కేంద్రమిచ్చే 6000 కలిపి 18,500 ఇవ్వలేరా ? క్రైస్తవులకి మాత్రం 60,000 ఇచ్చేస్తారా ? ఆర్భాటంగా ప్రతి బిడ్డకీ ఏడాదికి 12,500 చొప్పున తల్లులకు ఇస్తామని హామీ ఇచ్చిన "అమ్మవొడి" పథకానికి వచ్చే ఏడాది జనవరిదాకా దిక్కు లేదా ? క్రైస్తవులకి తీర్థయాత్రలకి మాత్రం అరవైవేల పెంపుదల ఆఘమేఘాలమీద జరిగిపోద్దా ? క్రైస్తవ పాస్టర్లకి నెలకి 5000 ఇచ్చే పథకం ఉరుకులు పరుగుల మీద అమలు చేస్తారా ? జనం పస్తులుండి చస్తుంటే ఇసుక వదలడానికి మాత్రం ఐదునెలలు పడుతుందా ?
హైదరాబాదు నుండి జెరూసలేంకి విమానం ఛార్జీలు రానూపోనూ కలిపి సుమారు 50,000. సగటున మనిషికి జెరూసలేంలో రోజుకి 5,000 ($75) ఖర్చవుతుంది. రెండు-మూడు రోజులు తిరిగి వస్తే మహా అంటే ఇరవయివేలు ఖర్చవుద్ది మనిషికి. అంటే ఒక్కో వ్యక్తికి మొత్తం జెరూసలేం యాత్ర ఖర్చు 60,000-70,000. దీన్నిబట్టి జెరూసలేం వెళ్ళాలనుకున్నా, అనుకోపోయినా మీరే ప్రోత్సహించి, ప్రతి క్రైస్తవుడ్నీ ఉచితంగా లేదా పదివేల రూపాయల జేబు ఖర్చుతో , ప్రజల సొమ్ము పందేరం చేసి క్రైస్తవ తీర్థయాత్రకి పంపుతారా ? ఎందుకింత చెలియలికట్ట దాటిన వల్లమాలిన ప్రేమ ?
ఇదే సమయంలో తిరుమలలో గది అద్దె 500 రూపాయలనుండి 1000 రూపాయలకు పెంచేస్తారా ? వి.ఐ.పి దర్శనం చేసుకోవడానికి శ్రీవాణి ట్రస్టుకి పదివేలు కట్టాలా ? ఇంతకీ శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటి ? ఆ ట్రస్టుకి వచ్చే ఈ డబ్బులతో, విరాళాలతో దళితవాడలు, బలహీనవర్గాలు నివసించే ప్రాంతాల్లో వెంకటేశ్వరస్వామి గుళ్ళు కట్టి, మతమార్పిడికి అడ్డుకట్ట వేస్తామని ఒకపక్క మీ బాబాయి సుబ్బారెడ్డిగారు చెబుతున్నారు. ఇంకో పక్క మీ ప్రభుత్వమే దాదాపు ఉచితంగా జెరూసలేం చూసిరమ్మని క్రైస్తవుల్ని పంపిస్తోంది. మీ ఇద్దరిలో మేము ఎవరిని నమ్మాలి ? ఇంకోవేపు వెంకన్న స్వామి దర్శనానికి వచ్చేవాళ్ళు స్వామి సన్నిధిలో రాత్రి బస చేయడానికి 1000 రూపాయలు కట్టాలా ? ఒక స్వామి (యేసయ్య) సన్నిధికి దాదాపు ఉచితంగా వెళ్ళగలిగితే, ఇంకో స్వామి (వెంకన్న) సన్నిధికి అమాంతం 100 శాతం అద్దె పెంచుతారా ? ఇదెక్కడి న్యాయం ? ఇదేం సెక్యులరిజం ? అసలు ఏ మతస్తులైనా సరే, ప్రజలని గుళ్ళూగోపురాలకీ, తీర్థయాత్రలకీ తోలాల్సిన పని మీకెందుకు ? అసలు మీ ప్రయారిటీలేంటి ? కులమతాలకి అతీతంగా ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే మీ విధి, బాధ్యత. అది గుర్తెరిగి ప్రవర్తించండి.
From Facebook post of KC Chekuri
They don’t come to answer your questions. In fact they don’t have answers either. They only know is crying on CBN and supporting Jagan. And they feel like who ever support CBN are fools and they themselves feel like super intellectual. They don’t need facts and they even bother about it. Only thing they need is Andhra should turn as Bihar or more worse than that. If ask things like this they hide. If you post some thing like idiot Nani they come and comment and enjoy .
ReplyDeleteసీ:
ReplyDeleteఅమరులు నడయాడు నగరము నేడిట
అసురుల పదములు తగిలి మలిన
మాయెను గదటరా!మాయావినోదపు
తెలగాణ కద్రువ తెలుగు తల్లి
నోటను మన్ను కొట్టెను గదరా!రాస
భముల ఓండ్రలు భీషణమయి
చెవులందు నెత్తురు చారికలవి కాల్వ
లుగ పారుచుండె!వలవల యేడ్చు
తే:
జనులు వేలు లక్షలై చచ్చుచుండ
ముండమోపి దొరలు తిట్టి నోళ్ళు
పాపులని వదరుట తప్ప పని చేసి
బాగు చేయుటయె లేదు - భవవినాశ!
(23/11/2019)