Friday, September 24, 2021

జలగ నుండి సెంద్రబాబు నేర్చుకోవాలని చెప్పే భక్తులకోసం!

సాయంత్రం అవగానే సాక్షి పేపర్ కోసం ఎదురు చూసే నా NRI మిత్రులు కు నచ్చే వార్త. 

బ్రాహ్మణ కార్పొరేషన్ తీసికెళ్ళి బీసీ కార్పొరేషన్ లో కలపటం.  ఇప్పుడే కంటపడింది. 

 గుంటూరు, సెప్టెంబరు 24: బ్రాహ్మణ కార్పొరేషన్‌ను సైద్ధాంతిక విరుద్ధ భావాలు గల బీసీ కార్పొరేషన్‌లో కలపటాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్‌ తీవ్రంగా ఖండిచారు. ఈ మేరకు శుక్రవారం గుంటూరులోని బ్రాడీపేటలో గల కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ను బీసీ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ జారీ చేసిన జీవోను తక్షణం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. దీని కారణంగా రాష్ట్రంలోని 75 లక్షల బ్రాహ్మణ జనాభా ఆందోళన చెందుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు తన పాదయాత్రలో బ్రాహ్మణ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు 2016లో బ్రాహ్మణ వేల్ఫేర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దాని ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గల పేద, మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలకు ఆరు పథకాల ద్వారా రూ.310 కోట్లు ఖర్చు చేశారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని కొనసాగించకుండా, నిధులు కేటాయించకుండా బ్రహ్మాణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్‌లో కలిపి యావత్‌ బ్రాహ్మణ సమాజాన్ని అన్యాయం, మోసం చేయటమేకాక అవమానానికి గురి చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇటీవల కొత్తగా కమ్మ, రెడ్డి, వెలమ, రాజు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని, మరి వాటిని బీసీ కార్పొరేషన్‌లో ఎందుకు విలీనం చేయలేదని ప్రశ్నించారు. అగ్రవర్ణాలంటే కేవలం బ్రాహ్మణ జాతికి మాత్రమే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. అగ్రవర్ణాలైన కాపు, కమ్మ, రెడ్డి, వెలమ, రాజు, ఆర్యవైశ్య కార్పొరేషన్‌లను కూడా బీసీ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌లో తక్షణం విలీనం చేస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో దేవదాయ శాఖ పరిధిలో గత ప్రభుత్వం ఎంచుకున్న బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. గత టీడీపీ ప్రభుత్వం దూరదృష్టితో బ్రాహ్మణులకు, దేవలయాలకు అవినావభావ సంబంధం ఉందనే ఉద్దేశంతో రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయవాడలోని దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయ ప్రాంగణంలో కొంతస్థలాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్‌కు కేటాయించి భవనాన్ని నిర్మించిందన్నారు. సొంత భవనం ఉంటే అందులో కార్యకలాపాలు చేయకుండా కొంతమంది అధికారులు సీఎం జగన్‌ను తప్పుదోవ పట్టించే విధంగా జీవో ఇచ్చినట్లయితే వెంటనే వైసీపీ నాయకులు, మత పెద్దలు దీనిపై పునరాలోచన చేయాలన్నారు. లేని పక్షంలో ప్రబుత్వం బ్రాహ్మణ జాతి తిరుగుబాటు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మల్లాది విష్ణు, కోనా రఘుపతి వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారని, వీరుకాక మరో పది, 15 మంది బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారని, ఈ క మ్రంలో వారంతా ఈ జీవో రద్దు చేయించకుంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చట్టబద్దత కల్పిస్తామని జగన్‌ ఊరూరు తిరిగి డాంబికాలు పలికారన్నారు. అయితే ఇప్పుడు 103 జీవోపై ఆయన ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. తక్షణం ఆ జీవోను ఉపసంహరించుకోకుంటే 13 జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో బ్రాహ్మణులు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఇప్పుడు పాడండి రా. జ. , కా. జ. అని. ఎలా పాడాలో , ఏ రాగం లో పాడాలో తెలియకపోతే  ఊసరవెల్లి ఉండవల్లి నో, లేకపోతె గుంట నక్క IVR దగ్గరో  కోచింగ్ తీసుకొని మరీ పాడవచ్చు. 

నాకయితే  మనందరికీ తెలిసిన అత్యంత న్యూట్రల్ జర్నలిస్ట్ భండారు గారు దీనిమీద ఓ టపా ఎలా ఎండాకాలం చలివేంద్రాలలో పోసే మజ్జిగ అంత పలచగా అంటిముట్టనట్టుగా వ్రాస్తారో చూడాలని మహా ముచ్చట గా ఉంది 😉

Karma is Beech అని పెద్దలు ఊరకనే అన్నారా? ఎరుకులసందు శామ్యూల్ రెడ్డి కనీసం ఇంకో రెండు terms గెలవాలనే కోరుకొంటున్నా, అందరి దురద బాగా తీర్చటానికి 🤣🤣

2 comments:

  1. ఆర్యా, మీరు అవేశంలో కొంచెం పొరబడుతున్నారు. మీరు చెప్పినట్లుగానే గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చట్టబద్దత కల్పిస్తామని జగన్‌ గారు వాగ్దానం చేసి ఉండవచ్చు. ఎన్నికల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆంచనాలూ ఇలా ఉండాలీ అన్న ఆశలూ ఉంటాయు కాని ఎలా ఉండబోతోందో తెలియదు కదా. అది ఎన్నికల అనంతరం తెలుస్తుంది. తెలిసింది. అఖండమైన మెజారిటీ, అదికూడ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎఱుగనిది లభించింది. ఇప్పుడు ఆయన ఆలోచన కొంచెం మారి ఉండవచ్చును. మీరన్నట్లే ఆ జీవోను ఉపసంహరించుకోకుంటే 13 జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో బ్రాహ్మణులు తిరుగుబాటుకు సిద్ధంగా ఉండవచ్చును. దానికేమి. అందువలన జగన్ గారి ఓటు బ్యాంకుకు వచ్చే నష్టం ఎంత? ఈ నిర్ణయం కారణంగా పెరిగే అవకాశం ఉన్న ఓటు బ్యాంకుకు పరిమాణం ఎంత? అన్నీ బేరీజు వేసుకొనే యిప్పుడు 103 జీవోపై ఆయన వెలువరించి ఉంటారు కదా. ఆవిషయం కూడా మీరు పరిగణనలోనికి తీసుకోవాలి మీరు ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించే ముందుగా. ఆయన సమాధానం మీరు చేసే నష్టం కన్నా నాకు వచ్హ్చే లాభం ఎక్కువ అని అర్ధం వచ్చేలా ఉండదా?

    రాజకీయనాయకులను తప్పుబట్టే ముందు ప్రజలు తమ తప్పొప్పులను తాము తెలుసుకోవాలి. మబ్బుల్లో నీళ్ళను చూసి కుండలు ఒలకబోసుకున్నట్లు అవుతుందని ఓట్లు వేసే ముందు మాకు తెలియలేదని వగచీ లాభం ఉండదు. ఐనా ఇప్పుడే సువృష్టిగా సుభిక్షంగా ఉందని ఎక్కువ మంది అనుకుంటున్నారేమో కూడా మీరు గమనించాలి.

    వ్యవస్థ అనేది అందరి చేతికో ఓటు అనే ఆయుధాన్ని ఇవ్వగలదు కాని సరిగా వాడే విచక్షణను కూడా ఇవ్వలేదు కదా. అందుచే ప్రజల్లో ప్రభుత్వనిర్ణయాలను వ్యతిరేకించే‌ప్రతి వర్గమూ మా తడాఖా చూపిస్తాం అనటం వలల పెద్దగా లాభం ఉండదు - ఎన్నికల సందర్భంలో ప్రజల ఎలా ఓటు వేస్తారో వారూ చెప్పలేరు కదా.

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్ తో ఏకీభవించక తప్పటం లేదండి. కాకపొతే కమ్మ, రెడ్డి, కాపు,ఆర్యవైశ్య లాంటి కార్పొరేషన్ లు కూడా ఉండగా ఒక్క బ్రాహ్మణ కార్పొరేషన్ ను మాత్రమే బీసీ కార్పొరేషన్ లో కలపటం వెనక మతలబు మాత్రం నాకు అర్ధం కావటం లేదు. ఎందుకో తెలియదు, ఈ వార్త చూడగానే ఒక్కసారి మనసు చివుక్కు మంది.

      ఆ కోపం లోనే ఏసు రెడ్డి అనగానే లేత తమలపాకులు తో కొట్టే భండారు గారు గుర్తుకు వచ్చారు. సాయంత్రం అవగానే సాక్షి వార్తల గురించి ఎదురుచూసే ఇంకో మంచి మిత్రుడు గుర్తుకు వచ్చి ఈ టపా వ్రాయాల్సి వచ్చింది.

      Delete