Thursday, December 4, 2014

విభజన వలన వస్తున్న రాజధాని వలన పోయే ఆయకట్టు ఎంత, వచ్చే ఆయకట్టు ఎంత?

 ముచ్చటగా మూడు పంటలు పండే కమ్మని మాగాణి భూమి ఆ 30 వేల ఎకరాలు, 10 అడుగులలో నీళ్లు పడి, ఎకరాకు లచ్చలు లచ్చలు ఆదాయం వచ్చే భూములు అవి అంటూ బ్లాగులలో, బయట cry babies, నా భాషలో తెలబానులు అలవాటయిన వాళ్ల ఏడుపు రాగాలు వినిపిస్తుంటే, ఇక తప్పక ఈ టపా.

మొదటగా అయ్యలూ, అమ్మలూ మీలో ఎందరు ఆ ప్రాంతాన్ని తాడికొండ, తుళ్ళూరు, క్రిష్ణాపురం గట్రా జీవితం లో ఒక్కసారి అయినా వెళ్లారు? మీలో ఎవరికయినా ఆ ప్రాంతం లో ఒక్కసెంటు భూమి అయినా ఉందా? పోనీ మీకు,  బంధువులు కాని, మితృలు కాని ఆ ప్రాంతానికి చెందిన వాళ్లు ఉన్నారా? ఉంటే, గింటే వాళ్ళను ఒక్కసారి అయినా నిజ పరిస్థితి అడిగారా? మఱి పైవి ఏమీ లేకుండా ఎందుకు ఈ పనికిమాలిన ఏడుపులు చెప్పండి, మీకు!!!

నిజానికి ఆ ప్రాంతం లో అత్యధిక భాగం కేవలం ఒక్క పంటే, అదీ (కొండవీటి వాగు పొంగక పోతే, వర్షాలు బాగా పడితే) కచ్చితం గా గ్యారంటీ లేని పంట పండే పొలం. ఆ ప్రాంత మొగ పిల్లలకు (కొద్దో గొప్పో పొలం ఉన్నా) పిల్లలు దొరకని పరిస్థితి మొన్న మొన్నటి వరకు. ఇప్పుడు కూడా మహా అయితే 5 వేల ఎకరాల నుండి 10 వేల ఎకరాల వరకూ గ్యారంటీ గా కాస్త ఆదాయం వచ్చే పళ్ల తోటలు, కూరగాయ సాగు జరుగుతుంది. అది కూడా క్రిష్ణా నది మీద ఈ మధ్య కాలం లో ఎదో చెక్ డ్యాం లాంటిది కట్టటం వలన అని అన్నారు. ఆ పండే పొలాలు కూడా ఎంతో కొంత flod zone ప్రాంతం లో ఉన్నవి, assigned lands లో ఉన్నవి కూడాను.
మిగతా పొలం కౌలుకు,  బ్రతిమాలి ఇవ్వాల్సిన పరిస్థితి.
అది నిజ పరిస్థితి.

ఇక సరె, ఆ 5, పది వేల ఎకరాలు అయినా ఆయకట్టు ఉన్న ప్రాంతం ఎందుకు పోవాలి అన్న ప్రశ్న రావటం సహజం. ఆయకట్టు అంటే సాగర్ పడిన తరువాత 2,3 పంటలు నికరం గా పండే ఎంత ఆయకట్టు క్రిష్ణా, పాత గుంటూరు జిల్లాలు కోల్పోయాయో ఎవరికయినా తెలుసా?

అది తెలియకపోతే, అటు ఉయ్యూరు క్రింద నుండి గొల్లలమోద (క్రొత్త పేరు దీనదయాళపురం అనుకుంటా) వరకు, ఇటు తెనాలి క్రింద నుండి రేపల్లె తుమ్మల వరకు, ఇంకో  ప్రక్కన పొన్నూరు దిగువనుండి చినగంజాం వరకు ఎంత ప్రాంతం చక్కని ఆయకట్టు కోల్పోయిందో, ఆ విస్తీర్ణం ఎంతో తెలియకపోతే లెక్కలు వేసుకోండి.

సాగర్ వలన ఉపయోగం లేదన్నది నా అభిప్రాయం కాదు, ఒక లాభానికి ఇంకో నష్టం ఏర్పడుతుంది అన్నట్లు, ఒండ్రు మట్టితో చక్కగా కళ కళ లాడే ఆ దిగువ తీర ప్రాంతం అంతా ఒక్క పంట కు కనా కష్టం గా దిక్కులేనిది అయ్యింది అన్నది వాస్తవం. ఒకప్పుడు దివి సీమ ప్రాంతం వాళ్లు ఉత్తరాది క్రిష్ణ జిల్లా వాళ్లకు పోరంకి, పెనమలూరు లాంటి వాళ్లకు వాళ్లకు పంటలు పండవు, మెట్ట రైతులు అంటూ పిల్లలను కూడా ఇవ్వని పరిస్థితి నుండి, ఇవ్వాళ మొత్తం ఆ ప్రాంతం అంతా రైతు కుటుంబాలు వలస పోయిన పరిస్థితి నిజం. ఒక్క సారి అమెరికా నుండి, దిల్షుక్నగర్ వరకూ చూస్తే ఈ ఆయకట్టు కోల్పోయిన రైతు కుటుంబాల వారసులే కనిపిస్తారు ఎక్కువుగా!! అంతే కాదు తీపి నీరు పైనుండి రాక, క్రిష్ణా ప్రక్కన ఉన్న ఊళ్లళ్ళొ భూగర్భ జలాలు ఉప్పులు వేసి  వేసవి వచ్చిందంటే, తాగునీరు కూడా ఇబ్బంది అవుతున్న దిగువ తీర ప్రాంత ఊళ్ళు ఎన్నో!

 సరే, పైన చెప్పింది నిజమే, కనీసం ఓ లక్ష ఎకరాలు పైనే రెండో, మూడో పంట ఆయకట్టు సాగర్ వలన మంచి గడ్డ ఉన్న్ల క్రిష్ణ, పాత గుంటూర్ జిల్లాలు కోల్పోతే, వాటికి ప్రస్తుత విభజన వలన వచ్చిన రాజధానికి సంబంధం ఏమిటి అంటారా? అక్కడకే వస్తున్నా.

విభజన వలన జరిగిన మంచి ఏమిటి అంటే, పోలవరం నిజం అయ్యే అవకాశం వచ్చింది, విభజన అంటూ జరగకపోతే ఎవరికి వాళ్లు నాటకాలు వేసారు కాని, పోలవరమ్  పై  చిత్త శుద్ది చూపలేదు, చూపేవాళ్లు కూడా కాదు అన్నది వాస్తవం, ఎప్పుడో మొదలయిన పులిచింతల ప్రాజెక్ట్ ఇంతవరకూ పూర్తి కాలేకపోవటమే దానికి నిదర్శనం.

ఇక పోలవరం కాలువ వచ్చి ఎగువ ప్రకాశం బ్యారేజ్ లో కలుస్తుంది కాబట్టి, అది పులిచింతల కాంబినేషన్ల వలన అటు బందరు కాలువ, ఇటు కొమ్మమూరు కాలువ, బంకింగ్ హాం కాలువ ల వలన రెండో పంటకు వరకయినా గ్యారెంటీ గా నీళ్లు వచ్చే అవకాశాలు వచ్చాయి, దాని వలన కనీసం ఇప్పుడు రెండో పంట కోల్పోయిన ఆయకట్టు అంతా సాగు లోకి రాబోతుంది, అందు వలనే, రాజధానికి దూర ప్రాంతం అయినా పొలాల రేట్లు ఈ ఆయకట్టు ప్రాంతం లో ఈ మధ్య పెరగటానికి ఇది ఓ కారణం.

ఇప్పుడు విభజన వలన ఏర్పడుతున్న రాజధాని నగరం వలన కృష్ణా, గుంటూర్ జిల్లా ఆంధ్రులు కోల్పోతుంది సుమారు ఓ 10 వేల ఎకరాల నికర మాగాణి, పండ్ల తోటల ప్రాంతం అయితే, క్రొత్తగా, ఒకప్పుడు ఉండి  కోల్పోయిన ఆయకట్టు,  అంతకంటే ఎన్నో రెట్లు సాగులోకి  రాబోతుంది. కాబట్టి ఎదో కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్లు, తినడానికి తిండే దొరకదు అన్నట్లు ఎదవ ఏడ్పులు తెలబానులు ఏడవాల్సిన పనిలేదు .

పై లెక్కలు ఆ ప్రాంతాలలో పరిచయం ఉన్నందున, నే చెప్పింది, లెక్కలలో తేడాలు ఉంటె, ఆ ప్రాంతం వారయితే , లేక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుభవం ఆ ప్రాంతం లో ఉండి ఉంటే, చెప్పండి, టపా కరెక్ట్ చెస్తాను.

( నే చెప్పిన విషయం, సాగర్ వలన దిగువ తీరప్రాంత రైతాంగం ఎంత కోల్పోయిందో నమ్మకపోతే, మీ ఆ ప్రాంత మితృలను అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. వాళ్లు కాని, వారి కుటుంబాలు కాని 1960, 70 లలో ఆ ప్రాంతం లో వ్యవసాయం చేసి ఉండి ఉంటేనో, చూసి ఉండి ఉంటేనో బెట్టర్. ఈ మద్దెన పుట్టిన (1980 ల తరువాత తరానికి) వాళ్లకు అయితే తెలిసే అవకాశమ్  తక్కువ, వారి వారి పెద్ద వాళ్లు చెప్పి ఉండకపోతే. )

No comments:

Post a Comment