Monday, December 8, 2014

అయ్యో జాన్ గారు ఎందుకు ఇలా ..

విధి విచిత్రమైనది, అయిదేళ్ల క్రితం, జాన్ గారు తన చేయి రేఖలు బ్లాగు లో పెట్టి, analyze చేయమన్నారు. ఎవరికయినా గుర్తు ఉందో లేదో? ఇది లింక్

http://johnhaidekanumuri.blogspot.in/search/label/%E0%B0%B8%E0%B0%B0%E0%B0%A6%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE

http://johnhaidekanumuri.blogspot.in/search/label/%E0%B0%B8%E0%B0%B0%E0%B0%A6%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE

అందులో ఓ కామెంట్ చేసినాయన ఎవరన్నది ప్రస్తుతం అప్రస్తుతం.


1. మీకు ఆరొగ్యసమస్యలు మాత్రం తప్పకుండా ఉంటాయి. (కొందరు నాకే సమస్యలు లేవు, దాక్టర్ దగ్గరకు వెళ్లింది లేదు అంటారు, మీరు మాత్రం కాదు) అని అంటే, జాన్ గారు ఇచ్చిన సమాధానం.
42వ సంవస్తరంవరకు డాక్టరు దగ్గరకు వెళ్ళలేదు అన్నది నిజం. తర్వాత బి.పి. బటపడటం తప్ప పెద్దగా ఆరోగ్యసమస్యలు లేవు.

దానికి అతను ఇచ్చిన సమాధానం

1. మీరు కొద్ది b.p బయటపడింది అని మాత్రమే అనుకోకుండా, దయచేసి సంవస్తరానికి ఒక్కసారి అన్నా complete blood test, including lipids, a1c and creatin గట్రా) చేయించుకోండి. అది మిమ్మలను ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. మిమ్ములను భయపెట్టే ఉద్దేశ్యం తో కాకుండా, మీ శ్రెయోభిలాషి గా అంటున్నాను

అతనికి ఎందుకు అలా చెప్పాలని అనిపించిందో, అయిదు ఏళ్ల క్రితం నాకు ఒక్క బి.పి. తప్ప వేరే ప్రాబ్లంస్ లేవు అన్న జాన్ గారు ఆ తరువాత బైపాస్ అవ్వటం ఏమిటి, హార్ట్ ఏటాక్ తో పోవటం ఏమిటి?

సెప్పినాయన మాత్రం ఎందుకు ఆనాడు అలా అన్నానా అని బాధ పడుతున్నాడు.
కొన్నిటికి లాజిక్ లు మన చేతి లో ఉండవేమో,
anyway R.I.P. John గారు.

2 comments:

  1. నాకు ఈ పోస్ట్ బాగా గుర్తుంది . కానీ అయన చనిపోయారని తెలియదు . చాలా చాలా లేట్ గ తెలుసుకున్నా . బహుశా బ్లాగ్ లకి దూరంగా ఉండటం వల్ల అనుకుంట. కానీ ఇది చెప్పింది ఎవరు ? ఆయన ప్రిడిక్షన్ లో ఖచ్చితత్వం ఉండటం ఆశ్చర్యం .

    ReplyDelete
    Replies
    1. ఇన్ని సంవత్సరాల తరువాత ఈ పోస్ట్ కి కామెంట్ రావటం ఆశ్చర్యం, predict చేసిన వారు, అనామకం గా ఉంటానికే ఇష్టపడ్డారు కాబట్టి, మీకు గుర్తు ఉంటే original పోస్ట్ లో కూడా, తానెవరనేది అనుమతి లేకుండా బయటపెట్టలేను.
      కాకపొతే ఇది చెప్పగలను, వారు వైద్య వృత్తి లో ఉన్నారు, తన patients ఎన్నో health problems ఉన్నవారు ఎక్కువ రోజులు ఉండరేమో అనుకొన్న వారు చాలా ఏళ్ళు బ్రతికి ఉండటం, అలాగే ఎటువంటి ఆరోగ్యసమస్యలు లేని వారు, తక్కువ వయసు వారు సడెన్ గా పెద్ద ఆరోగ్యసమస్యలతో కొద్దీ ఏళ్లలో , తాము డాక్టర్ లుగా ఎంత ప్రయతించినా చనిపోవటం చూసి, తన తో క్లోస్ గా ఉండే patients/friends చేతి రేఖలు క్యూరియాసిటీ తో స్టడీ చేయటం చేస్తూ ఉంటారు.
      ఇక జాన్ గారి రేఖలు, organ ఫెయిల్యూర్ తో చిన్న వయసులోనే చనిపోయిన తన patients కొద్ది మంది చేతిరేఖలు పోలి ఉండటం తో తాను ఆ ప్రిడిక్షన్ చేశాను అని అన్నారు. కాకపొతే తానూ అలా చెప్పి ఉండాల్సింది కాదు అని ఫీల్ అయ్యారు, ఎందుకంటే నెగిటివిటీ ఉన్న మాటలు చెప్తే, ఒక్కో సారి అవి నిజం అవుతాయి అన్నది కూడా తానూ నమ్ముతారు కాబట్టి.

      Delete