మా బోడి గుండు కు ఫ్యాన్స్ లేరనుకున్నారా? లేక బోడి గుండు కు ట్యాలెంట్ లేదనుకున్నారా? హమ్మా జిలెబీలు, జాంగ్రీలను అడ్డుపెట్టుకొని ఎగతాళి చేస్తున్నారా? మీకు తెలియకపోతే, బోడి గుండు ఫంకా గా, మా ఫేవరేట్ బ్లాగరు ట్యాలెంట్లు చెబుతాను వినుకోండి.
విధ్వేషపు రాతల మెగుళ్ళకు మొగుడు మా బోడి గుండు!
ఆంధ్రోళ్ళ కుట్ర, ఆంధ్రోళ్ళ కుట్ర అంటూ నిద్దరలో కూడా కలవరించే అంత గొప్ప అంధ్ర ఫంకా మా బోడి గుండు!
మార్కెట్లో వంకాయల రేట్లు పెరిగినా, ప్రక్కింటోళ్ల తో గొడవలు పెరిగినా, అంతెందుకు మొన్న వరంగల్ లో కళాకారులు నిరసన తెలీచేసినా, ఇందు కలదు అందు లేదు అన్నట్లు అన్నిట్లో ఆంధ్రోళ్ళ కుట్ర కోణం చూడగలిగిన మహా ఙ్ఞాని మా బోడి గుండు!
మా బోడి గుండు క.చ.రా. రామోజీని తిడితే రామోజిని తిడతాడు, క.చ.రా. రామోజిని పొగిడితే, రామోజి ఇంటిలో జీతగాడు అవగలిగినట్టి , క.చ.రా. భక్తాగ్రేసరుడు మా బోడిగుండు!
నమస్తే అన్న మాట వినిపిస్తే చాలు, ఉలిక్కిపడి లేచి తన నమస్తే ఎత్తిపోతల దీక్షకు ఆటకం కలుగుతుందో అని చింతించే, లక్ష విద్వేషపు ఎత్తిపోతల నోము పట్టిన వీరుడు మా బోడిగుండు!
పుట్టినప్పుడు ప్రతి ఒక్కడు ఏడుస్తూ పుడతాడు, కాని జీవితం జీవించేటప్పుడు మిగతా అనుభూతులు నవ్వటం, బాధపడటం గట్రా లు అందరూ చేస్తే, తాను మాత్రం పుట్టినప్పుడినుండి , గిట్టే వరకు ఏడుపులు మాత్రమే ఏడవాలని కంకణం గట్టుకున్న వేదాంతి మా బోడి గుండు!
అలాంటి బోడిగుండు ను పట్టుకొని, కోటి ఏడుపుల నోము ఆకుంటిత దీక్ష తో చేస్తున్న ఆ దీక్షాపరుడి తపస్సు భంగం చేయ తలపెడతారా?
ఇదేమయినా మీకు భావ్యమా అని మా బోడి గుండు ఫ్యాన్స్ అస్సొసియెషన్ తరుపున అడుగుతున్నాను జిలేబి ఫంకాలను :))
గుండు ఙ్ఞాని, మీ కోటి ఏడుపుల వ్రతాన్ని ఎటువంటి చీకు చింతా లేకుండా చేసుకోండి,
మీ దొర ఆంధ్రోళ్ల కాళ్లలో ముళ్ళు గుచ్చుకొంటే తన పంటితో పీకటానికి ఎంత నిబద్దతతో ఉన్నాడో, అలానే మీ ఫ్యాన్స్ అందరమూ మీకు సప్పోర్ట్ చేయటానికి అంతే నిబద్దతతో ఉన్నాం అని బ్లాగ్ ముఖం గా బోడి గుండు గారికి తెలియచేస్తున్నాము.
చివరాఖరుగా, యమ అర్జెంట్ గా, మా బోడి గుండు తరుపున "గుండు", "బోడిగుండు", "నమస్తే", "కోటి ఏడుపులు", "మందు" "మందు సూదనం" గట్రా పదాలను బ్లాగులలొ బోడి గుండు ఫ్యాన్స్ గా మేము ట్రేడ్ మార్క్ చేయుటకు నిర్ణయించాం అని తెలియ పరుస్తున్నాం. ఎవరికేని అభ్యంతరం ఉన్న తెలియపరచగలరు :)
ఈ తెలంగాణ వాళ్ళు రాసినట్టు , డప్పు వేసి చెప్పినట్టు ఈ విద్వేషా రాతలు ఆంధ్ర వాళ్ళు ఒక్కరు కూడా రాయరెంటి ???
ReplyDeleteనమస్తే తెలంగాణా ఏకైక లక్ష్యం మరియు పని ద్వేషం పెంచడమే , ఇలాంటి ఒక్క పత్రిక కూడా ఆంధ్ర లో లేకపోవడం మన దురదృష్టమో, వీళ్ళ అదృష్టమో .
:venkat
"గుండు"కోటి ఏడుపుల నోము :)
Deleteఆంధ్రోళ్ళ కుట్ర, ఆంధ్రోళ్ళ కుట్ర
ReplyDeleteఇటువంటి ధోరణిలో టపాలు అవసరమా?
ReplyDeleteదయచేసి విషయం ప్రథానంగా వ్రాయండి.
హాస్యానికి కూడా ఒక హద్దు ఉండాలి కదా.
మరీ సాగదీయటం బాగోదు.
అలాగే హాస్యం పేర వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడితే అది అపహాస్యమే అవుతుంది.
ఎందుకు విరోధాలకు కాలుదువ్వే వ్రాతలు?
దయచేసి ఆలోచించండి.
ఈ మాట ఈ సందర్భంగా అందరికీ విన్నవిస్తున్నాను. కేవలం మీకే అనుకోవద్దు దయచేసి.
ఆచార్య వర్యా, ఏమంటిరి, ఏమంటిరి? ఇది హాస్య టపా నే కాని, విషయ ప్రాధాన్యత లేని టపా అంటిరా?
Deleteఎంత మాట, ఎంత మాట!! ఇది బోడి గుండు అభిమాన సంఘం యొక్క బాధ వ్యక్త పరిచే టపానే కాని, హాస్య టపా కాదే!!
కాదూ, కాకూడదూ, ఇది హాస్య టపా నే అందురా.., విద్వేషపు టపాలు, అతి తెలివి కామెంట్లు సంగతి ఏమిటి?
అతి జుగుప్సాకరమయిన ఏడుపు ల సంగతి ఏమిటి? ఏడ్పుల కోసమే పుట్టిన బ్లాగుల సంగతి ఏమిటి?
అంత ఏల, విధ్వేష పితామహులు, ఈ బోడి గుండు ది ఏ జాతి? ఆంధ్ర జాతి కాదా?
మాతో చెప్పింతువు ఏమయ్యా.? నేడు, వీరి తెలంగానా వచ్చిన తరువాత కూడా, ఆంధ్రోళ్ల కుట్ర, కుట్ర, కుట్ర అంటూ స్వజాతీయిల పై ఏడుపులు ఎందుకు?
అవి విషయ ప్రాధాన్య ఉన్న టపాలు అందురా?
అయినను, ఏరుల పారుల, బోడి గుండుల బ్లాగులు మనం విచారించదగినవి కావు అని అందురా!! వ్రాయగలగటమే అర్హతను నిర్ణయించునది అని అందురా!! అటులయిన టైపు కొట్టుటకు మాకును కీబోర్డ్ లేదందురా?
ఇది జిలేబి ఫంకాలకు, బోడి గుండు ఫంకాల పరీక్షే కాని, విరోధాల కు కాలు దువ్వే పరీక్ష కాదే :)
If somebody can continue, feel free....
శ్యామలీయం గారూ, మీకో సంగతి గుర్తు చెయ్యాలనిపించి ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను. ఆ మధ్య ఓ బ్లాగులో (బ్లాగు పేరు గుర్తులేదు) ఓ వ్యాఖ్యాత మిమ్మల్నుద్దేశించి "మీకీ అతిమంచితనం ఏవిటో అర్ధమవటల్లేదు" అని వ్యాఖ్యానించారు. కానీ మీది అదే ధోరణిలా కనిపిస్తుండటం వల్ల ఆ వ్యాఖ్య మళ్ళా గుర్తొస్తోంది. రెండో చెంప చూపించేటంత సహనం ప్రతివారికీ ఉంటుందని అనుకోలేం కదా.
Delete> ......... మన దురదృష్టమో, వీళ్ళ అదృష్టమో ?
ReplyDeleteమన సంస్కారం.
ReplyDeleteజిలేబి కి మొట్టికాయలు పడిందేమో అని వస్తి :)
జిలేబి
Copy Paste Cheyyatame pani ga pettukunna vari gurinchi inta sambhashanalela..
ReplyDeleteలక్ష విద్వేషపు ఎత్తిపోతల నోము పట్టిన వీరుడు మా బోడిగుండు!
ReplyDeleteగుండుకి, బోడి గుండుకి కల తేడా ఏమి?
ReplyDeleteగుండంటేనే బోడి గదా!
ఇంకా ఏడుపులు ఆపండ్ర బాబులు ..
ReplyDeleteవిడిపోయి సంవత్సరం అయినా ఇంకా ఆ ఏడుపులు ఏంటో ..
మీ పనులు , పాలనలు సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి .. ఇంతకు ముందు లా ప్రతీ దానికి ఆంధ్రోల్ల కుట్ర అంటే జనం ఉమ్మేస్తారు .
నేను వీటినన్నింటినీ ఖండిస్తున్నాను. మధుసూదనుడంటే హరి. నాకెలా తెలుసంటే నేనో కవిని. అందులోనూ తెలంగాణా కవిని. మమ్మల్ని "ఆంధ్రోళ్ళు" గత మూడు వందల సంవత్సరాలుగా నేలమిద తొక్కేసి పరిపాలించారు. (అనగానేమి?). అసలు పోతన రాసిన ఆంధ్ర మహాభాగవతము తప్పుగా రాసాడు. దాన్ని తెలంగాణా మహాభాగవతము గా మార్చడానికి ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికోసం మొత్తం హైద్రాబాద్ అంతా ఉన్న ఆంధ్రోళ్ళ విగ్రహాలు పగలగొడతాం. అసలు నన్నయ, తిక్కనా, ఎర్రప్రగ్గెడా కూడా అంధ్రోళ్ళు కాదు. నేను చేసిన పరిశోధన్లో తేలింది (తొందర్లో ప్రచురణకి సిద్ధం) ఏమిటంటే ఈ కవి త్రయం మహబూబ్ నగర్ నుంచి వాళ్ళ దూరపు చుట్టాల్ని చూడ్డానికి రాజమహేంద్రి వచ్చేరు. అక్కడున్న రాజు వీళ్ళకి భూములిచ్చేసి అక్కడే ఉంచేసుకున్నాడు మహాభారతం రాయడానికి. "పోనీలే పాపం" అని మా తెలంగాణీయులు "ఆంధ్ర మహా భారతం" అని పెట్టారు పేరు. దీన్ని కూడా ఇప్పుడు "తెలంగాణా మహాభరతం" అని మార్చడానికి హైద్రాబాద్లో ఉన్న తెలుగు పండితులందర్నీ సమాయత్తపరుస్తున్నాం. (మీకు తెలీందేవుంది? హైద్రాబాద్లో ఉన్నంతమంది తెలుగు పండితులు ఇంకెక్కడా లేరనేది జగమెరిగిన సత్యం). ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఆంధ్రోళ్ళకి సొంతంగా ఏమీ లేదు అంతా తెలంగాణేయే. తెలంగాణమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ (తెలంగాణోపనిషత్)
ReplyDeleteవదిలేన్డన్నా పాపం .. ఇలాంటి వాళ్ళు ప్రతీ రాజకీయనాయకుడికి , ప్రతీ దేశం లో , ప్రతీ ప్రాంతం లో ఉంటారు .
ReplyDeleteకొంతమంది గుడ్డి గా ఫాలో అయిపోతారు , తెలిసి మీరు కూడా ఇలా విమర్శిస్తూ రాయడం ఏమి బాగాలేదు.
అందరు జస్ట్ చూసి వదిలేస్తున్నారు , మీరు కొంచెం హర్ట్ అయినట్టున్నారు .
మా తాతయ్య , రామారావు కి వీరాభిమాని . నేను ఎన్నో సార్లు వాదిన్చేవాన్ని ( కొంత సరదాగా ), మీ రామారావు అది చేసాడు ఇది చేసాడు అంత మంచివాడు కాదు అని.. మేము ఎన్ని చెప్పినా ఆయన ఆలోచన ని కొంచెం కూడా మర్చలేకపోయం , ఎంత చెప్పినా రామారావు మంచోడు , చుట్టూ ఉన్నవాళ్ళు ఏవో చేసి ఉంటారు అని అనేవాడు లాస్ట్ కి . మాకు నవ్వొచ్చేది .
మా ఊళ్ళో నా ఫ్రెండ్ ఒకడికి ఇల్లు మంజూరు అయింది , అంతే వీడు ఆ నాయకుడు కి, వాడి కొడుక్కి , వాడి మనవాడి కి కూడా సపోర్ట్ చేయడానికి రెడీ అయిపోయాడు . ఈ నాయకుడు మంచోడు అవ్వొచ్చు, కొడుకు ,మనవడు మంచోళ్ళు అవ్వరు కదా . అంతే కొంతమంది ని మర్చలెము.
వాళ్ళని అలా ప్రశాంతంగా ఉంచడమే మంచిది .
వదిలేయండి పాపం అతన్ని .