Monday, March 23, 2020

పచ్చ ఫోబియా ఉన్న ఏడుపుముక్కల లాంటి మిత్రుల కోసం!

బ్లాగులలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసే నచ్చని పనులను పాయంట్ చేసినా, లేక దగ్గినా తుమ్మినా, వాళ్లకు నచ్చని మాట ఎవరైనా చెప్పినా ఏడుపుముక్కల లాంటి అతి తెలివి జఫ్ఫాలు వాదన లేక, ఆవు వ్యాసం లగా చేసే కామెంట్లు,

"ఇది పచ్చ బ్యాచ్ పైచాచికత్వం"
"ఇది కమ్మ వాళ్ల కుట్ర"
"ఇది పచ్చ మీడియా"

వాళ్లది పచ్చ పైచాచికత్వం అయితే, మీది నీలి పైచాచికత్వం అవ్వదా? కనీసం ఆ సృహ అయినా మీకు ఉండదా?

మీరు ప్రతిపక్షం లో ఉన్నప్పుడు గెలవటం కోసం ఓ కులాన్నో, ఓ ప్రాంతాన్నో టార్గెట్ చేస్తే వర్కౌట్ అవుతుంది అని పార్టీ చెప్పి ఉండవచ్చు, మీరు ఆ పని మీదనే ఉండి ఉండవచ్చు కూడా,  గెలిసి, అధికార పక్షం అయిన తరువాత కూడా, ఈ ఏడుపులు, ఈ సెలెక్టివ్ టార్గెట్ లు, ఆవు వ్యాసాలు వర్కౌట్ అవ్వవు అన్న కనీస జ్ఞానం లేకపోతే ఎలా?

ఇక మాట్లాడితే పచ్చ పచ్చ మీడియా అని, నిజానికి ఇవ్వాళ పచ్చ మీడియా కంటే ఎక్కువ నీలి మీడియా హౌజ్ లు ఉన్నాయి అన్న సంగతి తెలియనంత అమాయకులా మీరు? లేక తెలిసీ తెలియనట్లు నటించే అతి తెలివితేటలా?
ETV, ABN, TV5 లు ఓ ప్రక్క అనుకొంటె, Sakshi, TV9, NTV, 10TV లు గట్రా ఇంకో ప్రక్క లేవా? మరి ఎందుకు ఈ పాడిందే పాట పాచిపళ్ల ... అన్నట్లు, ఈ ఏడ్చిందే ఏడుపులు?

పైన నేను చెప్పినట్లు పచ్చ పచ్చ అంటూ ఓ కులం మీదో, ఓ ప్రాంతం మీదో పడి ఏడ్చే ఏడుపుగాళ్ల కోసం ఎవరో అద్భుతం గా వేసిన కామెంట్.

ఓ కులాన్నో/ప్రాంతాన్నో టార్గెట్ చేస్తూ, సమస్యను ప్రక్క దారి పట్టించే కామెంట్ కో ఉదాహరణ:

"ఎందుకో గానీ కమ్మ వారు ఎంతో entrepreneurship leadership లక్షణాలు ఉండి ఇలా కులాధిపత్య చట్రం లో ఇరుక్కుపోయారు అర్థం కాదు.

The sad fact is that they aren't realising that they are alienating themselves with their exclusivity and one-upmanship.

కమ్మ రెడ్డి కులాధిపత్య పోరు ఆంధ్ర ప్రజలకు మంచిది కాదు. నేను ఒకప్పుడు సమైక్య వాదిని కానీ తెలంగాణా ఈ కులపిచ్చి నుంచి విడిపోయి బాగుపడి మంచి పని చేసింది.

Just thinking aloud and not intended to hurt anyone."దానికి ఎవరో పెట్టిన సమాధానం, మొట్టికాయలు 😉😉 లేకుండా, సుతిమెత్తంగా :

మీరు రాసిన ఈ కామెంట్లో మీరు కమ్మవారిని అసమంజసమైన కారణాలతో ఏలియనేట్ చేస్తున్నట్టుంది కాని, వాళ్ళని సమంజసమైన కారణాలతో కలుపుకునే ప్రయత్నం కనబడలేదు.

హిందువులైన చంద్రబాబు కానీ, లోకేష్ గానీ బ్రాహ్మణులని ఎలా అగౌరవ పరచారో చెప్తారా? మొదటిసారి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి ప్రభుత్వం ద్వారా ఎంతో మంది పేద బ్రాహ్మణులకి సాయం అందించారు కదా? 
ఎలెక్షన్లప్పుడు పండితుల చుట్టూ తిరిగి నదుల్లో మునిగి, అధికారంలోకి వచ్చాక ఏంచేసాడు జగన్? గౌరవంగా కార్పోరేషన్ని పక్కన పెట్టేసాడు అంతే కదా? అదే సమయంలో చర్చిల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాకపోయనా పాస్టర్లకి జీతాలిచ్చి మొత్తం సమాజాన్నే పీడిస్తున్నవాడు బ్రాహ్మణులని ఎలా గౌరవిస్తున్నట్టు? ఇంటిలో ఎవాంజెలిస్ట్ని పెట్టుకుని క్రిస్టియన్ల జనాభా గత దశబ్ధంలో విపరీతంగా పెరగడానికి కారణమయి అర్చకుల కి హిందూ సమాజంలో కొంత భాగాన్ని శాశ్వతంగా దూరం చేస్తున్న కుటుంబం. ఇప్పుడు బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా ఏమీ చేయకపోయినా వారి పట్ల గౌరవాన్ని ప్రకటించడం, నాలాంటి వాళ్ళకి తలగోక్కున్నా అర్ధం కాదు. కొన్ని ప్రభుత్వ బడుల్లో చంద్రబాబు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినప్పుడు గోల చేసిన సమాజం, ఇప్పుడు జగన్ అన్ని బడుల్లో సదుపాయాలు లేకుండా ప్రవేశపెడుతుంటే ఆ స్థాయిలో విమర్శేది? అసలు తెలుగు మీడియమే లేకపోతే మొదట నష్టపోయేది ఎవరు?


సినెమాల్లో కామెడీని టోకుగా కులానికి పూసుకోవడం, దాన్ని ఆధారంగా ఇంకో కులాన్ని ద్వేషించడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. తెలుగు సినెమా పుట్టినప్పటి నుండి రచయితలు, కవుల్లో 80 శాతం బ్రాహ్మణులే కదా? 50 శాతం సినెమాలు కమ్మవాళ్ళు నిర్మించి ఉంటారేమో. పనిగట్టుకుని బ్రాహ్మణుల మీద కామెడీ రాయమని ఆ నిర్మాతలు, హీరోలు కంకణంకట్టుకున్నట్టు చెప్తారేమి? మీఉద్దేశంలో ఆ రచయితలు నరం లేని, స్వాభిమానంలేని స్వామి భక్తి పరాయణులనా? ఈ తరంలో కోన వెంకట్, హరీష్ శంకర్ లాంటి వాళ్ళు ఎవరడిగితే కామెడీ చేస్తున్నారు? వాళ్ళు విపరీతంగా వాళ్ళ సినెమాలకి కామెడి చేసి మైకు ముందుకొచ్చి ప్రవర చెప్తే ఫరవాలేదా?

ఇక ఆధిపత్యం చూపే వాళ్ళూ అభిజాత్యం చూపే వాళ్ళు అన్ని అగ్రకులాల్లో ఉంటారు కదా? బెజవాడలో జరిగే విషయాలకి చేసే హడావుడి కర్నూలు జరిగే విషయాలకి జరగదు. అలానే అమలాపురానికీ అంతే హడావుడి చెయ్యరు. రెండు వందలేళ్ళుగా బెజవాడ అనేక రంగాలకి మార్పులకి కేంద్రంగా ఉండటం వల్ల ఇప్పటికీ మీడియా అక్కడ ఫోకస్ చేసినట్టు కర్నూలు మీద తూగో మీద పెట్టదు.

విచిత్రం ఏంటంటే సగటు తెలంగాణ వ్యక్తికి రాయలసీమ వ్యక్తికి ఉత్తారంధ్ర వ్యక్తికి దైనందిన జీవితంలో తారసపడని కోస్తా కమ్మ వారిని బూచిగా చూపి అక్కడ పారంపరిక ఆధిపత్య కులాలు అక్కడ ఇతర వర్గాలని రెచ్చగొట్టి అధికారం నిలుపుకునే క్రతవు నిరంతరం జరుగుతూనే ఉంది గత ౩ దశాబ్ధాలుగా.. తెలంగాణ విడిపోయింది, ఆ విషబీజాలు ఇంకా విజయవంతంగా సీమలోనూ ఇప్పుడు కొత్తగా ఉత్తరాంధ్రలోనూ నాటుతూనే ఉన్నారు. మీలాంటి వారు అగ్నికి ఆజ్యంపోస్తూ సమిధలవుతూనే ఉంటారు. జనాన్ని ఎంతగా రెచ్చగొడుతున్నారంటే వారి వెనకబాటుకు వారు ఎన్నుకున్న నాయకులు కారణం కాదు ఇంకెవరో అని నమ్మేంత. ఇక్కడ రెడ్లని ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నాను. కమ్మ వారు ఎక్కువగా ఉన్న తూగో నుండి ప్రకాశం వరకూ జిల్లాల్లో ఉన్న సామాజిక సమతుల్యత, అధికారంలో భాగస్వామ్యం రెడ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఎందుకు కనపడదు? ధర్మ ప్రభువులు అనకండి. కరడుగట్టిన (one-upmanship) ఆధిపత్యాన్ని చూపుతున్నది ఎవరు?పైన ఆయన అడిగిన దానికి ప్రొద్దున లేస్తే, పచ్చ పచ్చ అంటూ శాశ్వతంగా కళ్లకు పచ్చ కళ్లాద్దాలు తగిలెంచుకొని, ప్రతిదీ కుల కోణం లోనో, ప్రాంత్ కోణం లోనో చూస్తూ, కామెంట్లు పెట్టే ఏడుపుముక్కలా నీ దగ్గర సమాధానం ఏమయినా ఉందా?  

ఏప్పటిలాగే, మీ ఆవిడ ఏ రంగు చీర కట్టుకొన్నా, అది పచ్చ చీర, ఇంకోటి కట్టుకొని రా అనే అంత పచ్చ ఫోబియా తో  బాధపడుతూ, ఆవు వ్యాసం లాగా కామెంట్స్ వ్రాయటమేనా? 

అలాగే, standard disclaimar ఇది ఎక్కడొ చదివినట్లు ఉంటే కొంచం సర్ధుకుపొండే 😉

"Just thinking aloud and not intended to hurt anyone"


పై పాక్షిక కామెంట్, దానికి ప్రతిస్పందన పల్లెప్రపంచం బ్లాగు నుండి, దాని లింక్:

https://blog.palleprapancham.in/2020/03/blog-post_54.html?showComment=1584986852838#c2185228938310993415


2 comments:

  1. ఇలాంటోళ్ళతో వాదించడం అనవసరం. వాదిస్తే ఇంకా రెచ్చిపోతారు.
    చచ్చినా మారరు, ఇగ్నోర్ చేస్తే నోర్మూసుకూర్చుంటారు.

    ReplyDelete
  2. రావు రమేశ్ సినెమాలలో చెప్పే డవిలాగ్, "వాడిని అలా వదిలేయకండిరా" అని, పాపం వీళ్లను అలా వదిలేస్తే, కరోనా లాంటి వైరస్ కంటే ముందు, ఈ పచ్చ ఫోబియా ముదిరి దాని తో పోయేటట్లు ఉంటే, అలా ఎలా వదిలేయమంటారు మీరు మరీను. ఎంతయినా ఒకే ఆంధ్ర జాతి వాళ్లం కదా, ఆ మాత్రం జాలి లేకపోతే ఎలా మానసిక రోగుల మీద.

    ReplyDelete