షిర్డీ సాయి ఎలెక్ట్రికల్స్ మీద ప్రతిపక్షం లో ఉండగా తెదేపా పార్టీ సంధించిన ప్రశ్నలు, లేవనెత్తిన అనుమానాలు ఇవి. సహేతుకమైనవే.
ఇప్పుడు అదే కంపెనీకి వేల ఎకరాలు కేటాయించారు, ఎలా? అంటే అప్పుడు చేసిన ఆరోపణలు తప్పా? లేక మూటలు అందాల్సినవారికి అందినాయా?
షిర్డీ సాయి ఎలెక్ట్రికల్స్ మీద ప్రతిపక్షం లో ఉండగా తెదేపా పార్టీ సంధించిన ప్రశ్నలు, లేవనెత్తిన అనుమానాలు ఇవి. సహేతుకమైనవే.
రాజకీయ పార్టీ మీటింగు లలో, జనాలుకు పూనకాలు రావటం సహజమే అయినా, సరదాకి వాటి మీద ఓ వైసిపి కి, టీడీపీ కి చెందిన వాట్సాప్ గ్రూప్ లలో కామెంట్స్!
పిఠాపురం లో పవన్కళ్యాణ్ గెలుపు కు కారణం ఎవరూ కాదు (indirect గా వర్మ మీద సెటైర్స్) - నాగబాబు
పవన్ గెలుపులో వర్మ ప్రమేయం లేదంటే... టీడీపీ గెలుపులో పవన్ ప్రమేయం లేనట్టే గా.. ఇంత సిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు
ఓట్లు వేయించుకొనే ముందు ఓడ మల్లన, వేయించుకొన్నాక బోడి మల్లన అంటూ ఈ వీడియో, ఈ స్నేక్ బాబు మారడు అంటూ సెటైర్లు
మనం నిలబడటమే కాకుండా, నాలుగు దశాబ్దాల తెదేపా ను నిలిబెట్టాం - పవన్కళ్యాణ్
స్నేక్ బాబు నోటి విరోచనాలు సంగతి తెలిసిందే, మీ నోటి దూల ఏమిటి? మీరు మీ నోటితో ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఓ పాలి ఆలకించండి. ముందు గట్టిగా ఓ అయిదు నిమిషాలు కుర్చీ పట్టుకోకుండా నించో లేరు కానీ....
నెల తక్కువ, బుర్ర తక్కువ బాలుడు ఒకడు ఉన్నాడు...వాడు బలం లేకపోయినా ప్రప నేత హోదా ఇవ్వాలని గోల. వీడు నెల తక్కువ, బుర్ర తక్కువ, సిగ్గు తక్కువ వెధవ. మొదటి సారి ఎమ్మెల్యే గా గెలవగానే, నెక్ట్ ప్రధాని నేనే అనుకుంటూ ఉంటాడు
పవన్ కళ్యాణ్ పుట్టేప్పుడు మా అమ్మకి నొప్పులే రాలేదు - నాగబాబు
వీడు పుటకే భారం అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టుంది ఆమె!
నెలలు నిండకుండా గా పుట్టాడేమో, అందుకేనా మొన్న అసెబ్లీలో నెలతక్కువ వెధవ అని ఎవరో అన్నారు?
పవన్ కళ్యాణ్ అంతే సినిమాల్లో వుంటే ఎన్నో ఆస్కార్ అవార్డ్స్ వచ్చేవి - కొణతాల
ఈ మొహానికి రెండు సుబ్బిరామి రెడ్డి అవార్డ్స్, ఒక సంతోషం అవార్డు ఉన్నాయి...నంది అవార్డే నే ఔట్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఆస్కార్ అంట..!
పవన్ కళ్యాణ్ .. దేశంలో మోడి తర్వాత అత్యంత ప్రజాదరణ వున్న నాయకుడు : పంతం నానాజి
ఇది వింటే మోడీ bathtub లో కాదు, washbasin లో పడి ఆత్మహత్య చేసుకొంటాడేమో, అయినా మనకెందుకులే అది పువ్వు భక్తులు చూసుకొంటారు.
జనాల కామెంట్స్:
రేపు అమరావతి రీ రీ లాంఛ్ సభకు మోడీనీ పిలిచి ఆ రోజు అబ్బా కొడుకులు పంబన్ కళ్యాణం భజన ఎలా చేస్తారా అని వెయిటింగ్.... - ఓ బులుగు తమ్ముడు
హా, ఏముంది ప్రమాణ స్వీకారం అప్పుడు... చిరుజీవి, పవన్కళ్యాణ్ లు మోడీ చేసిన రీల్స్ వీడియో కి ఇప్పుడు నాగబాబు కూడా కలుస్తాడు , ఎర్రి పువ్వు అబ్బా కొడుకులు... వాళ్ళని చూసి ముగ్గురు మొనగాళ్లు అంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు, మనం చూస్తూ ఆనందించటమే ! - ఇంకో బులుగు తమ్ముడు
సెంద్రబాబు గురించి:
మనం లేదంటాం, రేపు వీలు చూసుకుని పవన్ పెద్దమనసు చేసుకుని ఏమీ ఆశించకుండా మద్దతిచ్చి గెలిపించాడు అని వాళ్ళు చెబుతారు. మనం హౌలే గాళ్లం అవుతాం.
మనం గొప్పగా ఉండటం అంటే మనం ఒక్కళ్ళమే గొప్పగా ఉండటం కాదు మన చుట్టూ ఉన్నోళ్లని వాళ్ల వాళ్ల స్థాయిల్లో గొప్పగా ఉంచడం కూడా అని ఆయనకి(చంద్రబాబు కు) గుర్తు రాదు. మనకి గుర్తున్నా పెద్దగా తేడా రాదు! - పచ్చ తమ్ముళ్లు
చరిత్ర గురించి.
• 2009 లో చిరంజీవి రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట గెలిచాడు
• 2009 లో చిరంజీవి ఆత్మ గా చెప్పుకునే సొంత బావమరిది పోటీచేసి ఓటమి
• 2012 లో చిరంజీవి సొంత పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసి, తను 15 ఓట్లతో గెలిచిన తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి ప్రచారం చేస్తే 17 వేలతో ఓటమి
• 2019 పవన్ పోటీచేసిన రెండు చోట్లా ఓటమి
• 2019 నాగబాబు ఎంపీ గా ఓటమి
• 2024 లో టీడీపీ పొత్తుతో పవన్ ఎంఎల్ఏ.
— మనం టీడీపీని నిలబెట్టాం, పవన్ కళ్యాన్ 🙏 - ఓ స్టాటిస్టిక్స్ తమ్ముడు
నా ఆస్తిలో సగం, నా వియ్యంకుడు ఆస్తిలో సగం జగన్ మోహన్ రెడ్డి కాజేసాడు - బాలినేని
అంటే, ఇప్పుడు చంద్రబాబు గారే న్యాయం చెయ్యాలి. .. పోయిన నా డబ్బు దోచుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వాలి ... అంతేగా
అక్కడికి వీళ్ళ నాన్న ఏదో ఒంగోలు జమీందారు అన్నట్టు మా నాన్న ఇచ్చిన ఆస్తి అవజేసా అని ఊగిపోతూ చెబుతున్నాడు, రాజశేఖరెడ్డి, జగన్ రెడ్డి లేకపోతే వీడు ఇప్పటికీ ఒంగోలు లో కిళ్లీ బంకుల దగ్గర సిగరెట్లు కు అడుక్కొంటూ తిరిగేవాడు. - బులుగు తమ్ముళ్లు
ఒక రెడ్డితో , ఇంకో రెడ్డి ని తిట్టిస్తూ స్టేజి మీదా ముగ్గురు కాపులు కాళ్ళు ఊపుకుంటావెకిలిగా నవ్వడం అసలేమీ బాగోలేదు - బులుగు తమ్ముళ్లు
ఇలా ఒక కుటుంబంలో వాళ్ళని చీల్చి ఒకరితో ఒకరిని తిట్టిస్తూ, వెకిలిగా నవ్వుతూ కూర్చునే సంప్రదాయం వైఎస్ కుటుంబం చేసేది, ఇప్పుడు వీళ్ళు అందిపుచ్చుకున్నట్టున్నారు! - న్యూట్రల్ తమ్ముళ్లు
చివరాఖరగా నా కామెంట్: హనీమూన్ పీరియడ్ పూర్తిఅయినట్లేనా? లేక 2009 లో తెరాస పొత్తు తో తెదేపా బలమయిన స్థానాలు వాళ్లకు ధారపోసి, చివరకు తెలంగాణా లో నామరూపాలు లేకుండా పోవడానికి శంకుస్థాపన చేసుకొన్నట్లు , ఆంధ్రా లో కూడా తెదేపా తన ఆఖరి ప్రయాణానికి శంకుస్థాపన చేసుకున్నారే మో జనసేన పొత్తు తో, కాలమే చెప్పాలి.
ఏది ఏమయినా, స్నేక్ బాబు ఎంట్రీ తో, ఆయన నోటిదూలతో రాబోయే రోజులలో అంత సాఫీ గా మాత్రం జరగదు అని అనిపిస్తుంది. చూడాలి....
కొసమెరుపులు: ఎంత తేలికగా తండ్రి ని తీసుకొచ్చి అలవోకగా అబద్దాలు ఆడుతున్నాడో ఈ వీడియో చూడండి. రాజకీయాలు అన్న తరువాత ఎంతో కొంత క్యాడర్ కోసం B.S. కొడుతారు కానీ, సొంత నాన్న పేరుతొ ఇలా ఊసరవెల్లి విశ్వరూపం చూపనక్కర్లేదు అనుకొంటా....
ఇంకో ఊసరవెల్లి వీడియో compilation, ఈరోజు twitter lo ఓ ప్రక్క DMK, ఇంకో ప్రక్క తమ్ముళ్లు, ఇంకో ప్రక్క PayTm బ్యాచ్, ... ఆపకుండా ఒకటే వాయింపు... ఈయన్ని ట్రోల్ చేసే వీడియో కి వేలలో లైక్స్, ఇలానే వాగుతూ ఎదవ అవటం అవసరమా! ఆఖరికి పాత ట్వీట్స్ డిలీట్ చేసుకోవాల్సిన ఖర్మ పట్టింది.
హిందీ మీద ఊసరవెల్లి మాటలు!
మరికొన్ని videos& screenshots,
2022 లోనే ఈయన కరెక్ట్ అయినా quote చెప్పాడు.
మహా మేత జయంతి వస్తుంది, ఎదో ఒకటి చేయాలి/రాయాలి కాబట్టి ఆయన్ను స్తుతిస్తూ (క్రీస్తు సువార్త సభలలో కంటే ఎక్కువుగా) మన ఎర్నలిస్టులు, PayTm బ్యాచ్ లు ఎటూ హడావుడి చేస్తారు కాబట్టి, ఆ మహా మేత వ్యవస్థలను బ్రష్టు పట్టించటానికి ఎలా పునాదులు వేసాడో ఓ మచ్చు తునక!
Y.వెంకట్రామిరెడ్డి 1975 లో JNTU,Hyd లో లెక్చరర్ గా చేరాడు. 98లో సిబిన్ అతన్ని JNTU యంగెస్ట్ VC గా చేశారు.2005 వరకు రెండు సార్లు ఎక్టెన్షన్ ఇచ్చారు.కులం చూసి దూరం పెట్టడం ఆయనకు వైఎస్ఆర్ కి చేతయినంత గా చేతకాదు! తాను ఎన్నిక కాగానే అతన్ని తీసుకువచ్చి మహా మేత వైఎస్ఆర్ APPSC చైర్మన్ నీ చేశారు.2011,Aug వరకు అతనే చైర్మన్(62 ఏళ్లు వచ్చేవరకు).అతని సేవలు మెచ్చి కిరణ్ రెడ్డి UPSC కి రికమెండ్ చేసాడు.అతను ఇంకో మూడేళ్లు(65 వచ్చేవరకు) యూపీఎస్సీ మెంబర్ గా వర్క్ చేసాడు!!
..
బాధితుల క్షోభ కన్నా, బాధ కన్నా .. మోసం చేసి అడ్డదారి లో చేరిన వాళ్ళ హక్కులకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే న్యాయ వ్యవస్థ మనది..ఏటి సేత్తామ్!! 2011లో ఇదే వెంకట్రామిరెడ్డి UPSC లో మెంబర్ అయ్యాడు కిరణ్ రెడ్డీ సిఫార్సు తో!!ఇంకా అక్కడ ఎంతమంది రెడ్ల కి వాడున్న 3 ఏళ్లలో ఇంటర్వ్యూ లో మ్యానిపులేషన్ చేసి వ్యవస్థ లలోకి చొప్పించాడో!?
..
తర్వాత కిరణ్ రెడ్డీ హయాం లో జరిగిన గ్రూప్1పరీక్షల్లో వచ్చిన ప్రొడక్ట్స్ నే మొన్న EC ట్రాన్స్ఫర్ చేసిన ఒంగోలు ఎస్పీ పరమేశ్వర రెడ్డీ, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డీ,రైతుల మీద దాడి చేసిన డీఎస్పీ మాధవరెడ్డి లు.
వీళ్ళందరూ అడ్డదారి లో నియామకాలు పొందినప్పుడు, అడ్డదిడ్డ మైన పనులు,అడ్డగోలు గా చెయ్యక ఇంకేం చేస్తారు!?
..
అప్పుడు సరైన చర్యలు తీసుకోకుండా HC వదిలేయడంతో అదే సీన్స్ ఇప్పుడు రిపీట్ అయ్యాయి!!ఈసారి చైర్మన్ గా వున్న వ్యక్తి 2016 లో CBN అపాయింట్ చేసిన prof.ఉదయ భాస్కర్ వుండడంతో తమ పనులకి ఎక్కడ అడ్డం పడతారో అని ఆయన్ని సైడ్ చేసేసారు. ఆఫీస్ రూమ్ కూడా తీయకుండా తాళాలు వేసుకునే వాళ్ళు.
వెంకట్రామిరెడ్డి పని సెక్రటరీ సీతారామాంజనేయులు తీసుకున్నాడు! కావలసిన వారికి ఇంటర్వ్యూ లో 75 కి 74.5 మార్క్స్ వేశారు! టాప్ పోస్ట్స్స్ అన్నీ ఇలా కులకుష్టు రెడ్లతో నింపేసి తర్వాత వారిని అడ్డగోలు పనులకు వాడుకోవడం అలవాటై పోయింది!!
..
HC సింగిల్ జడ్జి రద్దు చేసిన పరీక్ష పై బెంచ్ stay ఇచ్చింది. ప్రతిపక్షం లో వున్నప్పుడు రద్దు చేయాలని PPP తో చెప్పిన CBN అధికారం లోకి వచ్చాక లోకేష్ నీ దీనిపై దృష్టి పెట్టమనకుండా పోలవరం,అమరావతి, పెట్టుబడులు అంటూ కలవరిస్తే ఎలా!? వ్యవస్థల విధ్వంసం చాప కింద నీరులా జరిగిపోతుంటే ఉపయోగం ఏముంది!?
పై మెసేజ్ వాట్సాప్ ఫార్వర్డ్ ద్వారా వచ్చినది.
"నీకు కాల్మొక్కుతా దొరా!" అనేది ఎంత సంపాదించుకున్నా, ఎంత చదువుకున్నా రక్తం లో జీర్ణించుకుపోయిన తెలంగాణా కవి గాయక కళాకారులు జ్ఞానవంతులకోసం ఒక్కసారి గుర్తు చేద్దాం అని.
కొసమెరుపు: కులాల కంపే లేని తెలంగాణా లో తెరాస 43 మంది (36%) రెడ్లకు, కాంగ్రెస్ 46 మంది(39%) రెడ్లకు ఇస్తే బిసిలను ముఖ్యమంత్రి చేసే బిజేపి 30 మంది (25%) రెడ్లకు ఇచ్చింది 😜😜
ఒకరు నరసారావుపేటో/గుంటూరో MP సీట్ కోసం ఆశావహులు, మరొకరు బెజవాడ MP సీట్ కోసం ఆశావహులు.
వీళ్లకు టికెట్ కావాలంటే ఏమి చేయాలి? వెళ్లి పార్టీ కి వాళ్ళ స్తోమతను బట్టి చదివించుకొని అక్కడ జనాలలో తిరగాలి. డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరగాలి అంటే టికెట్ అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అందుకని టికెట్ ఖచ్చితం గా వస్తుంది అంటేనే వెళ్ళాలన్న ఆలోచన.
మనకు ఎన్ని డబ్బులు ఉన్నా జేబులోనుండి పైసా తీయని కక్కుర్తి, దానిపైన వీళ్లు ఓ పైసా ఇచ్చి, ఊళ్ళో (పసుపు)పిచ్చిజనాల దగ్గర 99 పైసలు వసూలు చేసి, మొత్తం ఆ రూపాయి మేమె వసూలు చేసాము అని చెప్పుకొని టికెట్ సంపాదించాలి అన్న ఆర్ధికం గా ఎదిగినా, స్వతహాగా ఉన్న దరిద్రం తాలూకా ఆలోచనలు!
వీళ్లకు తోడుగా ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ లో ఊళ్ళో వాళ్ళ డబ్బులతో సంపాదించిన నాలుగు డాలర్లు కనిపించటం తో, వీళ్ళ ప్రక్కన తిరిగితే పెద్దమనుషులం అయిపోతాం, ఇంకొందమంది బకరాలు దొరుకుతారు అన్న ఆలోచనలతో ఉన్న కొంత మంది ముదిరిన బ్యాచ్!
పైన ఇద్దరు, ఈ బ్యాచి కలసి, పాపం ఎలాగయినా 2024 లో తె. దే. పా. ని గెలిపించాలి అన్న ఆశతో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు దగ్గర ఇప్పటినుండే ఫండ్ రైసింగ్ అంటూ $500 నుండి ఎంతైనా పర్లేదు అని వసూళ్లు మొదలెట్టారు.
ఇక ఇప్పుడు నా ప్రశ్న, డాలర్ డాలర్ కూడబెట్టుకొంటూ, నచ్చిన కంప్యూటరో, సెల్ ఫోనో కొనుకోవటం కూడా వాయిదా వేసుకొంటూ ఉండే మధ్యతరగతి NRI లు ఇచ్చే $500 నుండి $5000 వరకు డాలర్లు అన్నీ మూటకట్టి వీరికి ఇస్తే, వీరు (కొంత కొట్టేసి) వెళ్లి అక్కడి వాళ్లకు అంటూ ఇస్తే అందులో మీ ఊరు పేరు ఏమైనా ఉంటుందా? రేపు నిజం గా మీకు ఏమైనా పనులు కావాలంటే ఆ పార్టీ లో మీ మొఖం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? 2014-19 లో ఆ పార్టీ కార్యకర్తలు కు జరిగింది మరిచే పోయారా?
దాని బదులు మీకు అంత పిచ్చి ఉంటె, సుబ్బరమ్ గా ఆ డబ్బులు ఏవో మీ మీ నియోజకవర్గాలలో ఆ డబ్బు అవసరమయ్యే స్థానిక లీడర్స్ కు వ్యక్తిగతం గా ఇవ్వండి, వాళ్ళు సర్పంచులు కావచ్చు, కౌన్సెలర్స్ కావచ్చు, లేక స్థానిక MLA కాండిడేట్ కావచ్చు. ముఖ్యం గా డబ్బు విపరీతం గా లేని కాండిడేట్ లకు ఇవ్వండి, వాళ్ళు ఏ కులం వారయినా, గెలిచినా గెలవకపోయినా వాళ్ళు మిమ్మలను గుర్తు పెట్టుకోవటానికి, రేపు మీకు ఏమైనా అవసరమయితే మీ తరుపున మాట సాయం చేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అంతే గాని, ఈ బలిసిన ముదిరిన బ్యాచ్ కి అందరితో పాటు మీరు false prestige కి పోయి ఇస్తే అవి ఏ సోది లోకి రావు, రేపు మిమ్మల్ని పట్టించుకొనేవారు ఎవరూ ఉండరు.
ఇది ఎంతో మంది NRI మిత్రులకు అటు పచ్చ పార్టీ, బులుగు పార్టీ లలో గతం లో జరిగిన అనుభవాల రీత్యా చెబుతున్నది, ఆ పైన మీ డబ్బులు మీ ఇష్టం.
కొసమెరుపు: ఇదంతా మేము మాట్లాడుకొంటూ ఉంటె, నచ్చితే మీకే టికెట్ వచ్చి ప్రచారం చేసుకోండి అని చెప్పాలి, లేకపోతె కష్టం అని చెప్పాలి, రాయినయినా నానబెట్టాలి అనే తత్త్వం వలన కాదురా మావాడు మీమీద సూపర్ మెజారిటీ తో గెలుస్తుంది అని ఓ బులుగు ఫ్రెండ్ అనటం. 2024 లో అదీ చూద్దాం లే అని తిరిగి ఓ పచ్చ ఫ్రెండ్ అనటం!