అందరూ తమ తమ పేరుపొందిన ఉపాధ్యాయుల గురించి వ్రాస్తూఉంటే, ఎప్పుడో నాకు చదువు చెప్పిన (అమ్మిన కాదు) గురువులను తలుచుకొంటూ ఉంటే, ఆనాటి రోజులు, ఆ గురువులు తమ తమ బిడ్డలకంటే కూడా తాము ఫాఠాలు చెప్పే పిల్లలను ఎక్కువగా ప్రేమించటం, డబ్బులు కోసం చూడకుండా అవసరమయితే పాఠాలతో పాటు, కాస్త తిండి పెట్టటమేకాక, తమ తమ ప్రవర్తన ద్వారా మంచి వ్యక్తిత్వం అంటె ఏమిటో చూపటం గుర్తుకు వచ్చాయి.
వార్రెవ్వరూ ఏ గూటాల క్రిష్ణమూర్తి గారి లాగానో, బూదరాజు గారి లాగానో అందరికీ తెలిసిన వారు కాకపోవచ్చు, ప్రస్తుతం డబ్బులు బాగా గడిస్తున్న ఏ నారాయణా నో, రత్తయ్య గారి లాగానో చదువు అనే వ్యాపారం లో డబ్బులు సంపాదించిన వారు కాకపోవచ్చు, ప్రస్తుతం ప్రభుత్వ బడులలో పెరిగిన జీతాలు లాగా వేలు వేలు జీతాలు అందుకొన్న వారు కూడా కాదు, బ్రతకలేక బడిపంతులు అన్న నానుడి ఉన్న రోజులలో సాధారణ జీవితాలు గడిపిన వారు, చదువు చెప్పటం మీద ఉన్న ఇష్టం తో అంతకంటే ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాలు వదులుకొని మరీ వచ్చిన వారు కొందరయితే, అంతకంటే మంచి ఉద్యోగాలు వచ్చినా ఉపాధ్యాయ వృత్తినే ఇష్టపడి ఎంచుకొన్న వారు మరికొందరు.
తమ తమ జీవితాలలో తాము చదువు చెప్పే శిష్యుల విజయాలే తమవి గా భావించిన మహోన్నత వ్యక్తులు వారు.
అలాంటి ఉపాధ్యాయులు లేనిదే, ముఖ్యంగా గ్రామీణ వాతావరణం లో పెరిగిన నా బోటి వాళ్ళు చాలా మంది, ఇప్పుడున్న స్థితికి వచ్చి ఉండే వారము కాదన్నది మాత్రం నిజం. అలాగే ఆ రోజులలో జీతాలు పెద్దగా లేకపోయినా, ఉధ్యోగరీత్యా ఆ ఉపాధ్యాయులు తమ తమ ఊరులు విడిచి, పరాయి ఊళ్లలో వచ్చి స్థిరపడినా, మనసు పెట్టి పాఠాలు చెప్పే పంతులు / పంతులమ్మలను ఏ VIP లాగా చూసుకొన్న ఆయా గ్రామాల ప్రజలు, వారి మంచి మనసులు కూడా గుర్తుకు చేసుకోవాల్సిన సంధర్భం ఇది.
ఈ సారి మీ మీ ఊర్లు వెళ్లినప్పుడు ఒక్క సారి, మీ మీ జీవితాలలో అలాంటి ఉపాధ్యాయులు ఎవరయినా ఉంటే, బాగున్నారా అంటూ పలకరించి రండి. ఆ మాస్టార్లకు ఆ రెండు ముక్కలే లక్షల డబ్బుతో సమానం. ఇది మాత్రం ఓ ఉపాధ్యాయుడి కొడుకుగా మాత్రం చెప్పగలను.
ఈ సంధర్భం గా "The Emperor's Club" సినేమా లో నాకు విపరీతం గా నచ్చిన డయలాగులు ఉపాధ్యాయుల గురించి.
"A great teacher has little external history to record.
His life goes over into other lives.
These men are pillars in the intimate structures of our schools,
they are more essential than its stones or beams.
They will continue to be kindling force and revealing power in our lives"
కొసమెరుపు: పై డయలాగులు ఓ Indian American కేరెక్టర్ చేత చెప్పించటం.
Nice one Krishna gaaru !
ReplyDelete