ఆర్యా నేను మీకు మంచి పంఖాను. మీ పుణ్యమా అని రాష్ట్రం ఎప్పుడో 1969 లోనో, 1972 లోనో విడిపోవాల్సింది ఇప్పుడు విడిపోవటం ముదావహం. Better late than never అన్నట్లు.
తెలంగాణా నాయకుడి గా, ప్రతి విషయం లో ఆంధ్రప్రదేశ్ కంటే ముందు ఉండే తహ తహ (వాళ్లు రోజు కు టాయలెట్ కు 4 సార్లు పోతే, మనం 8 సార్లన్నా పోకపోతే గెట్లా)అంటే నాకు ఇంకా ఇష్టం అందుకే నేను మీకు వీర పంఖాను.
సివరాఖరుగా ఓ మనవి, పార్లమెంట్ లో మూజువాణి వోటు తో నిరసనల మధ్య పోలవరం బిల్లు ఆమోదం పొందటం అప్రజాస్వామికం, అన్యాయం కాబట్టి (మనదాకా వస్తే అన్న సామెత ప్రకారం), మనం hurt అయ్యం కాబట్టి, ఎటూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకంటే పైచేయిగా ఉండాలి కాబట్టి
దయచేసి,
ఇంత పెద్ద అన్యాయం కోసం కనీసం ఓ నెల దినాలన్న బంద్ పిలుపు ఇవ్వాలని నా చిన్న కోరిక. అప్పటి గాని మన శొకతప్త గుండెకాయలకు స్వాంతన చేకూరదు.
అలాగే మనకి గిరిజనులంటే ఆరు(అందరు అయిదంటే, కనీసం ఆరు అన్నా మనం అనాలి) ప్రాణాలు కాబట్టి, ఎటూ ఎప్పిటిలాగే అన్ని ప్రబుత్వాలలో లాగే, వాళ్ళకి న్యాయం జరగదు కాబట్టి, మన ప్రాణం అయిన గిరిజన కుటుంబాలకు పునరావాసం మనమే కల్పించాలని, వాళ్ళ మీద ప్రేమతో ఒక్కొక కుటుంబానికి కనీసం కోటి రూపాయల (ఎటూ మనది మిగులు బడ్జెటే కాబట్టి) ఎక్స్ గ్రేషియా ప్రకటించండి, ఆ సెంద్రబాబును తలదన్నినట్లు ఉంటుంది.
ఆ అహంకారులయిన ఆంధ్రోళ్ల తిక్క కుదిర్చినట్లు అవుద్ది!!
illu alakagane panduga kadu
ReplyDelete