Tuesday, August 12, 2014

నా ఫేవరేట్ బ్లాగర్ వచ్చిన కష్టాలు, నా పరిష్కారం!!!

అందరకీ తెలిసిన విషయమే నాకు అంత్యత  ప్రియాతి ప్రియమయిన బ్లాగరు మందు సూదనం గారు, ప్రతి రోజూ క్రమం తప్పకుండా (సూర్యుడు ఉదయించనంత గ్యారెంటీ గా) కష్టపడి ఎంతో విలువయిన (నమస్తే తెలంగాణా పత్రిక ఎత్తిపోతుల) టపాలు వేస్తూ ఉంటారని :-))),

పాపం ఆయనకు వచ్చిన కుక్క కష్టాలను, ఆయన కుక్క గురించి కుక్క బాధ అప్పట్లో బాధపడ్డారు, ఇది దాని లింక్

http://kotiraathalu.blogspot.in/2011/03/blog-post_23.html

దానికి solution కొంచం లేటుగా ఇప్పుడు ఇస్తున్నాను.


---------------
నిజమే, దీనికంటే ఇంకొక మేలుజాతి (???) కుక్కొకటి నాకు తెలుసు. దానికి చీకటిపడితే మందు కొట్టందే నిద్రపట్టదు, దాని ఇంట్లో ఆడకుక్కలు కూడా మందు కొడతాయి అని అదే చెబుతుంది, అది మా జాతి లక్షణం, సంస్కృతి, అని కూడా చెబుతుంది, , మందు కొట్టటం, భౌ భౌ అంటూ బూతులు మాట్లాడటం మా(?) జాతి లక్షణం అంటూ ఉంటుంది.

ఆ జాతి కుక్క తో పోలిస్తే, మీ కుక్క ఆరోగ్యం, నికారుసతనం దేనికి పనికిరాదు :)

అందుకనే ఆ జాతికుక్కను పెంచుకొందాం, దాని కి కుటుంబానికి చెందిన అన్ని జాతి కుక్కలను నెత్తిన పెట్టుకొని పూజించుకొంటూ పెంచుకొందాం (బాంచెన్ నీ కాల్మొక్కుతా అందాం, ఏటూ మనకు తర తరాలు గా అలవాటయిన పని అదే కాబట్టి), మనకు మామూలు ఎర్ర కుక్కలతో పనేమిటి చెప్పండి, మన జాతికుక్కే అన్ని కుక్కలకంటే సూపర్:)

p.s.: Sorry for giving you solution little late but I am sure you will appreciate my concern about your problem.

ఏమి చేసుకొని బతకనమ్మా అంటే నోరు చేసుకొని బతుకు బిడ్డా అందిట!!

Friday, July 11, 2014

తెలంగాణా పితకు నా విఙ్నప్తి.......



ఆర్యా నేను మీకు మంచి  పంఖాను. మీ పుణ్యమా అని రాష్ట్రం ఎప్పుడో 1969 లోనో, 1972 లోనో విడిపోవాల్సింది ఇప్పుడు విడిపోవటం ముదావహం. Better late than never అన్నట్లు.

తెలంగాణా నాయకుడి గా, ప్రతి విషయం లో ఆంధ్రప్రదేశ్ కంటే ముందు ఉండే తహ తహ (వాళ్లు రోజు కు టాయలెట్ కు 4 సార్లు పోతే, మనం 8 సార్లన్నా పోకపోతే గెట్లా)అంటే నాకు ఇంకా ఇష్టం అందుకే నేను మీకు వీర పంఖాను.

సివరాఖరుగా ఓ మనవి, పార్లమెంట్ లో మూజువాణి వోటు తో నిరసనల మధ్య పోలవరం బిల్లు ఆమోదం పొందటం అప్రజాస్వామికం, అన్యాయం కాబట్టి (మనదాకా వస్తే అన్న సామెత ప్రకారం), మనం hurt అయ్యం కాబట్టి, ఎటూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకంటే పైచేయిగా ఉండాలి కాబట్టి 

దయచేసి,
ఇంత పెద్ద అన్యాయం కోసం కనీసం ఓ నెల దినాలన్న బంద్ పిలుపు ఇవ్వాలని నా చిన్న కోరిక. అప్పటి గాని మన శొకతప్త గుండెకాయలకు స్వాంతన చేకూరదు.

అలాగే మనకి గిరిజనులంటే ఆరు(అందరు అయిదంటే, కనీసం ఆరు అన్నా మనం అనాలి) ప్రాణాలు కాబట్టి, ఎటూ ఎప్పిటిలాగే అన్ని ప్రబుత్వాలలో లాగే, వాళ్ళకి న్యాయం జరగదు కాబట్టి, మన ప్రాణం అయిన గిరిజన కుటుంబాలకు పునరావాసం మనమే కల్పించాలని, వాళ్ళ మీద ప్రేమతో ఒక్కొక కుటుంబానికి కనీసం కోటి రూపాయల (ఎటూ మనది మిగులు బడ్జెటే కాబట్టి) ఎక్స్ గ్రేషియా ప్రకటించండి, ఆ సెంద్రబాబును తలదన్నినట్లు ఉంటుంది.
ఆ అహంకారులయిన ఆంధ్రోళ్ల తిక్క కుదిర్చినట్లు అవుద్ది!!

దెయ్యాలు వేదాలు వల్లించటం అంటే ఇదే!-2

Today in Andhrajyothy paper.

పోలవరం బిల్లు ఆమోదం తొందరపాటు చర్య : కోదండరాం

హైదరాబాద్, జులై 11 : పోలవరం బిల్లును శుక్రవారం పార్లమెంట్‌లో ఆమోదంపై తెలంగాణ పొలిటికల్ జేఏపీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. నిరసనల మధ్య బిల్లు ఆమోదం తొందరపాటు చర్యేనని అయన అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియతో మాట్లాడుతూ బిల్లు ఆమోదం అన్యాయమైన, ప్రజాస్వామికమైన నిర్ణయమిదని ఆయన అన్నారు. రాష్ట్రాల సరిహద్దులతో పాటు ఇతర సమస్యలు తప్పవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుపై చర్చ జరగాల్సి ఉందని కోదండరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

------------
అయ్యా కోదండరామా, మరి తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన విధానం మీద, నిరసనల మధ్య ఆమోదం పొందటం తొందరపాటు చర్య కాదా? ఈ బిల్లు ఆమోదం అన్యాం, అప్రజాస్వామికమయినది అయితే, మరి తెలంగాణా బిల్లు ఆమోదం ఏమిటి? తెలబానుల మెంటాలిటికి  ఆచార్యుడవనిపించుకొనావు ఫైనల్ గా!!

Wednesday, June 25, 2014

కవితక్కా ఏందిది?


అక్కోయ్,

మరిసే పోయావేమో ఇదిగొ నీకు ఓ లింక్ ముందు, గప్పుడు నువ్వు చేసిన సందడి.

https://www.youtube.com/watch?v=LPLLgeBQAIc

మరిప్ప్పుడేమయినాది అక్కో?

గప్పుడు గదె బిల్డింగ్స్, గిప్పుడు గయే బిల్డింగ్స్,
గప్పుడు గయే బుల్డోజెర్స్, గిప్పుడు గయే బుల్డోజెర్స్,
గప్పుడు గదే కూలకొట్టుడు, గిపుడు గదే కూలకొట్టుడు,
కానీ గప్పుడొచ్చినోళ్ళు, గిపుడు రాకపోయనే.
(from Krishna P FB)

Should I expect any real explanation from TRS representatives and KCR family చెంచాలు (in blogs)?


Saturday, June 14, 2014

దెయ్యాలు వేదాలు వల్లించటం !!

క.చ.రా. దొరా, నీకొక్కటి చెప్పనా, మీడియా అతే చేస్తుంది, దరిద్రం గానే చాలా ప్రోగ్రాములు ఉంటున్నాయి, అందులో అనుమానం లేదు, కాకపోతే రోత గురించి, నోటి దూల గురించి నువ్వు, నీ కుటుంబం మాట్లాడటమే అన్నిటికంటే అత్యంత దరిద్రం!!

 తమరు ప్రధాన మంత్రిని ని 'చప్రాసీ' అనొచ్చు, 
కాంగీ మంత్రులను 'బూట్ పాలిష్ గాళ్లూ' అని అనవచ్చు, TDP, MLA లను 'చవటలు, సన్నాసులు, దద్దమలు, లంగాలు, లుచ్హాలూ లాంటి హుందా పదాలతో సంబోధించి, మళ్ళీ వాటికి నానార్ధాలు తాత్పర్యాలు చెప్పి సమర్ధించుకోవచ్చు, 

మిమ్ములను మించిన మీ కొడుకు, అల్లుడు పొలీసు  లను, వాళ్ల మొకాన  'లం... కొడాక, మా కి ల...' లాంటి గౌరువ  పదజాలం ఉచ్చరిచవచ్చు!!

 కానీ మీడియా మాత్రం బుద్ది గా ఉండాలా!! లేకపోతే supress చేస్తావా?

నోటి దూల నీ కుటుంబం ఒక్కరి హక్కే అని మరి ఓ #G.O.#  కూడా పాస్ చేసేయ్ దొరా!! 

పనిలో పని ఎటూ మీడియా నియంత్రణ అంటున్నావు కాబట్ట, ఈ బ్లాగులు, ముఖ పుస్తకాలు లాంటి వాటి నియంత్రణ మీద కూడా ఓ పాలి కన్నేసెయ్ దొరా!! ఓ పని అయిపోతుంది :-)

సివరాఖరుగా, ఎంతయినా, నీ పంఖా గా నీకో ముక్క దొర, ఆంధ్రోళ్లను "ఆంధ్రా అహంకారం ,ఆంధ్రా పార్టీలు ,ఆంధ్రా కతలు ఆంధ్ర వాళ్ళు " అంటూ తిట్లు, ఏడుపులు   నువ్వో, నీ కుటుంబం మో ఏడవాలి దొరా, నీకంటే ఎక్కువ తిట్టేసి నీ image కి దెబ్బకొట్టేస్తున్న నిత్య దుఖిత బ్లాగులను  బ్యాన్ చెసే పని కాస్త చూడు దొర,

అలాగే ఈనాడు నో, ఆంధ్రజ్యోతి నో తిడితే నువ్వే తిట్టాలి గాని, అక్కడ కూడా నీకు పెద్ద కాంపిటీసన్ అయిపోతున్న ఈనాడు, జ్యోతి మాజీ మీడియా గాళ్ల ఏడుపు బ్లాగులను కూడా బ్యాన్ చేసేయ్ దొరా, ఓ పని అయిపోద్ది  :-)

Friday, June 6, 2014

క.చ.రా గారి దిష్టి బొమ్మలు రైతులు దహనం- ఇది కూడా ఆంద్రోళ్ళ కుట్రే!!


తెలంగాణా రాష్ట్రం లో రుణ మాఫీకి కాలపరిమితి విధించటం తో, క. చ. రా. గారి దిష్టి బొమ్మలు తగలెట్టటం తో పాటు, దిష్టి బొమ్మల ముందు మందు సీసాలు కూడా పెట్టి మరీ నిరసన తెలిపిన రైతులు.

http://www.andhrajyothy.com/node/101939

ఇది కూడా ఆంధ్రోళ్ల "కుట్రే" అంటూ బోడిగుండు మందుసూదనుడు ఇంకా టపా పెట్టక ఇలా "మోసం" చేయటం ఏమీ బా లేదు, ఆయన రోజూ పెట్టే నిరంతర ఘోష "కుట్ర, దోపిడీ" టపాల  తో పాటు, ఇదీ కుట్రే అంటూ ఓ టపా పెట్టి నాలాంటి ఆయన వీర ఫంఖాలను కోరిక నెరవేర్చగలరని ఆశిస్తూ :)


గుడ్డిలో మెల్ల, మందు సూదనం గారి అన్నలుంగారయిన ఈటెల గారు మాత్రం ఆయన పంఖాలను తృప్తి పరుస్తూ నిఖార్సయిన స్టెట్మెంట్స్ ఇచ్చారు :)


దీనిపై ఓ ముఖ పుస్తక మితృడు గోపిరెడ్డి గారి post.

"--------
ఆంధ్రా పార్టీలు కుట్రలు మానలేదు: ఈటెల
రాష్టం విడిపోయినా ఆంధ్రా పార్టీల కుట్రలు మానలేదని ఆరోపించారు. తెలంగాణలో ప్రశాంతత వారికిష్టం లేదని దుయ్యబట్టారు. రుణమాఫీని అడ్డం పెట్టుకుని తెలంగాణ రైతుల్లో ఆందోళనకు తెరదీస్తున్నారని మండిపడ్డారు. వారి కుట్రలకు మోసపోవద్దని, తాము చెప్పిందే నమ్మాలని సూచించారు. 

-------------------------ఫైనాన్సు మినిస్టర్ అయిన కూడా బుద్ది మారలేదు రాజేందర్ గారు !


రుణమాఫీ పై గొడవ చేసింది రైతులు ,స్టేట్ మెంట్లు ఇచ్చింది కాంగ్రెస్ ,BJP 


చేసిన హామీలు తీర్చలేక ఇది ఆంధ్ర పార్టీ ల కుట్రలు లంటూ మాటలా !
---------"


చివరగా కొందరు బ్రతుకులంతే మారవని మనం మాత్రం సరిపెట్టుకోవాలంటారా? లేక 1970 లలో ప్రతి దానికి ఇందిరమ్మ విదేశీశక్తుల కుట్ర అంటూ ఎలా బండి నడిపేదో, అలాగే రాబోయే అయిదేళ్లలో
తెలంగాణా లో వర్షాలు పడ్డా, పడకఫొయినా,
దొర గారు మందు తాగినా, పొరబాటున మానేసినా,
దొరగారి మేనకోడలి మరిది తోడల్లుడు కి జలుబు చేసినా .....

ఇది ఆంద్ర పార్టీల కుట్ర" అనెది official statement అవుతుందేమో తె.రా.సా. కు.