Wednesday, June 25, 2014

కవితక్కా ఏందిది?


అక్కోయ్,

మరిసే పోయావేమో ఇదిగొ నీకు ఓ లింక్ ముందు, గప్పుడు నువ్వు చేసిన సందడి.

https://www.youtube.com/watch?v=LPLLgeBQAIc

మరిప్ప్పుడేమయినాది అక్కో?

గప్పుడు గదె బిల్డింగ్స్, గిప్పుడు గయే బిల్డింగ్స్,
గప్పుడు గయే బుల్డోజెర్స్, గిప్పుడు గయే బుల్డోజెర్స్,
గప్పుడు గదే కూలకొట్టుడు, గిపుడు గదే కూలకొట్టుడు,
కానీ గప్పుడొచ్చినోళ్ళు, గిపుడు రాకపోయనే.
(from Krishna P FB)

Should I expect any real explanation from TRS representatives and KCR family చెంచాలు (in blogs)?


Saturday, June 14, 2014

దెయ్యాలు వేదాలు వల్లించటం !!

క.చ.రా. దొరా, నీకొక్కటి చెప్పనా, మీడియా అతే చేస్తుంది, దరిద్రం గానే చాలా ప్రోగ్రాములు ఉంటున్నాయి, అందులో అనుమానం లేదు, కాకపోతే రోత గురించి, నోటి దూల గురించి నువ్వు, నీ కుటుంబం మాట్లాడటమే అన్నిటికంటే అత్యంత దరిద్రం!!

 తమరు ప్రధాన మంత్రిని ని 'చప్రాసీ' అనొచ్చు, 
కాంగీ మంత్రులను 'బూట్ పాలిష్ గాళ్లూ' అని అనవచ్చు, TDP, MLA లను 'చవటలు, సన్నాసులు, దద్దమలు, లంగాలు, లుచ్హాలూ లాంటి హుందా పదాలతో సంబోధించి, మళ్ళీ వాటికి నానార్ధాలు తాత్పర్యాలు చెప్పి సమర్ధించుకోవచ్చు, 

మిమ్ములను మించిన మీ కొడుకు, అల్లుడు పొలీసు  లను, వాళ్ల మొకాన  'లం... కొడాక, మా కి ల...' లాంటి గౌరువ  పదజాలం ఉచ్చరిచవచ్చు!!

 కానీ మీడియా మాత్రం బుద్ది గా ఉండాలా!! లేకపోతే supress చేస్తావా?

నోటి దూల నీ కుటుంబం ఒక్కరి హక్కే అని మరి ఓ #G.O.#  కూడా పాస్ చేసేయ్ దొరా!! 

పనిలో పని ఎటూ మీడియా నియంత్రణ అంటున్నావు కాబట్ట, ఈ బ్లాగులు, ముఖ పుస్తకాలు లాంటి వాటి నియంత్రణ మీద కూడా ఓ పాలి కన్నేసెయ్ దొరా!! ఓ పని అయిపోతుంది :-)

సివరాఖరుగా, ఎంతయినా, నీ పంఖా గా నీకో ముక్క దొర, ఆంధ్రోళ్లను "ఆంధ్రా అహంకారం ,ఆంధ్రా పార్టీలు ,ఆంధ్రా కతలు ఆంధ్ర వాళ్ళు " అంటూ తిట్లు, ఏడుపులు   నువ్వో, నీ కుటుంబం మో ఏడవాలి దొరా, నీకంటే ఎక్కువ తిట్టేసి నీ image కి దెబ్బకొట్టేస్తున్న నిత్య దుఖిత బ్లాగులను  బ్యాన్ చెసే పని కాస్త చూడు దొర,

అలాగే ఈనాడు నో, ఆంధ్రజ్యోతి నో తిడితే నువ్వే తిట్టాలి గాని, అక్కడ కూడా నీకు పెద్ద కాంపిటీసన్ అయిపోతున్న ఈనాడు, జ్యోతి మాజీ మీడియా గాళ్ల ఏడుపు బ్లాగులను కూడా బ్యాన్ చేసేయ్ దొరా, ఓ పని అయిపోద్ది  :-)

Friday, June 6, 2014

క.చ.రా గారి దిష్టి బొమ్మలు రైతులు దహనం- ఇది కూడా ఆంద్రోళ్ళ కుట్రే!!


తెలంగాణా రాష్ట్రం లో రుణ మాఫీకి కాలపరిమితి విధించటం తో, క. చ. రా. గారి దిష్టి బొమ్మలు తగలెట్టటం తో పాటు, దిష్టి బొమ్మల ముందు మందు సీసాలు కూడా పెట్టి మరీ నిరసన తెలిపిన రైతులు.

http://www.andhrajyothy.com/node/101939

ఇది కూడా ఆంధ్రోళ్ల "కుట్రే" అంటూ బోడిగుండు మందుసూదనుడు ఇంకా టపా పెట్టక ఇలా "మోసం" చేయటం ఏమీ బా లేదు, ఆయన రోజూ పెట్టే నిరంతర ఘోష "కుట్ర, దోపిడీ" టపాల  తో పాటు, ఇదీ కుట్రే అంటూ ఓ టపా పెట్టి నాలాంటి ఆయన వీర ఫంఖాలను కోరిక నెరవేర్చగలరని ఆశిస్తూ :)


గుడ్డిలో మెల్ల, మందు సూదనం గారి అన్నలుంగారయిన ఈటెల గారు మాత్రం ఆయన పంఖాలను తృప్తి పరుస్తూ నిఖార్సయిన స్టెట్మెంట్స్ ఇచ్చారు :)


దీనిపై ఓ ముఖ పుస్తక మితృడు గోపిరెడ్డి గారి post.

"--------
ఆంధ్రా పార్టీలు కుట్రలు మానలేదు: ఈటెల
రాష్టం విడిపోయినా ఆంధ్రా పార్టీల కుట్రలు మానలేదని ఆరోపించారు. తెలంగాణలో ప్రశాంతత వారికిష్టం లేదని దుయ్యబట్టారు. రుణమాఫీని అడ్డం పెట్టుకుని తెలంగాణ రైతుల్లో ఆందోళనకు తెరదీస్తున్నారని మండిపడ్డారు. వారి కుట్రలకు మోసపోవద్దని, తాము చెప్పిందే నమ్మాలని సూచించారు. 

-------------------------ఫైనాన్సు మినిస్టర్ అయిన కూడా బుద్ది మారలేదు రాజేందర్ గారు !


రుణమాఫీ పై గొడవ చేసింది రైతులు ,స్టేట్ మెంట్లు ఇచ్చింది కాంగ్రెస్ ,BJP 


చేసిన హామీలు తీర్చలేక ఇది ఆంధ్ర పార్టీ ల కుట్రలు లంటూ మాటలా !
---------"


చివరగా కొందరు బ్రతుకులంతే మారవని మనం మాత్రం సరిపెట్టుకోవాలంటారా? లేక 1970 లలో ప్రతి దానికి ఇందిరమ్మ విదేశీశక్తుల కుట్ర అంటూ ఎలా బండి నడిపేదో, అలాగే రాబోయే అయిదేళ్లలో
తెలంగాణా లో వర్షాలు పడ్డా, పడకఫొయినా,
దొర గారు మందు తాగినా, పొరబాటున మానేసినా,
దొరగారి మేనకోడలి మరిది తోడల్లుడు కి జలుబు చేసినా .....

ఇది ఆంద్ర పార్టీల కుట్ర" అనెది official statement అవుతుందేమో తె.రా.సా. కు. 


Monday, May 19, 2014

నే చెప్పినానంటే తలనరుక్కుంటా గాని మాట తప్పను - క. చ. రా. , ఇది కూడా ఆంధ్రోళ్ల కుట్రే!!




పై వీడియో లింకు చూడండి ముందు, "తెలంగాణాకు కచ్చితంగా దళితుడినే తొలి ముఖ్యమంత్రి ని చేస్తా, నే చెపితే తల నరుక్కుంటా గాని మాట తప్పను etc.. "


బ్లాగులలలో రోజూ, ఎదో ఒక ఏడుపు ఏడవనిదే నిద్రపోని బోడిగుండుమందుసూదనుడు తన కోటి ఏడుపుల వీణ లో,  క.చ. రా. మాట తప్పటం, తల నరుక్కోవపోవటం కూడా ఆంధ్రోళ్ల కుట్రే అని ఓ ఏడుపుగొట్టు టపా వదులుతాడెమో చూడాలని ఉంది.

మంధుసూదనా pls. make our day

ఇక, తెలంగాణ కు, ఎవరు ముఖ్యమంత్రి అయితే మీకేమిటి అని అడిగే అతి తెలివి తెలబానులకు,  తమ తోటి వాడు, కోటి ఏడుపుల వీణ లో వ్రాసిన సమాధానమే నా సమాధానం కూడా :)

-----
"" పక్కదేశాల్లో జరుగుతున్న విషయాలను మాట్లాడుకోగా లేనిది పక్క రాష్ట్రం విషయం రాస్తే మీకెందుకు ఉలుకు? మీఅంత సంకుచిత బుద్ధి మాకు లేదు, రాష్ట్రం విడిపోయినా అందరూ భారతీయులే, మనవారే అని మేము నమ్ముతాం.
-ఇస్వరూపం"

http://kotiratanalu.blogspot.in/2014/05/blog-post_18.html?showComment=1400512241793చ్3081815126309293307
------

క.చ.రా. మాట తప్పకుండా, మా తెలంగాణా మిత్రుడొక్కడు, ఓ ఉపాయం తెలంగాణా భవన్ కు పంపించాడంట, అర్జెంట్ గా, క.చ.రా. ను ఓ దళితుడికి దత్తత పొమ్మని, మరి క.చ.రా. ఫాలో అవుతాడో, లేక తల నరుక్కొని అమరవీరుడు అవుతాడో చూద్దాం!

Monday, September 5, 2011

Teachers Day ఉపాధ్యాయ దినోత్సవము


అందరూ తమ తమ పేరుపొందిన ఉపాధ్యాయుల గురించి వ్రాస్తూఉంటే, ఎప్పుడో నాకు చదువు చెప్పిన (అమ్మిన కాదు) గురువులను తలుచుకొంటూ ఉంటే, ఆనాటి రోజులు, ఆ గురువులు తమ తమ బిడ్డలకంటే కూడా తాము ఫాఠాలు చెప్పే పిల్లలను ఎక్కువగా ప్రేమించటం, డబ్బులు కోసం చూడకుండా అవసరమయితే పాఠాలతో పాటు, కాస్త తిండి పెట్టటమేకాక, తమ తమ ప్రవర్తన ద్వారా మంచి వ్యక్తిత్వం అంటె ఏమిటో చూపటం గుర్తుకు వచ్చాయి.

వార్రెవ్వరూ ఏ గూటాల క్రిష్ణమూర్తి గారి లాగానో, బూదరాజు గారి లాగానో అందరికీ తెలిసిన వారు కాకపోవచ్చు, ప్రస్తుతం డబ్బులు బాగా గడిస్తున్న ఏ నారాయణా నో, రత్తయ్య గారి లాగానో చదువు అనే వ్యాపారం లో డబ్బులు సంపాదించిన వారు కాకపోవచ్చు,  ప్రస్తుతం ప్రభుత్వ బడులలో పెరిగిన జీతాలు లాగా వేలు వేలు జీతాలు అందుకొన్న వారు కూడా కాదు, బ్రతకలేక బడిపంతులు అన్న నానుడి ఉన్న రోజులలో సాధారణ జీవితాలు గడిపిన వారు, చదువు చెప్పటం మీద ఉన్న ఇష్టం తో అంతకంటే ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాలు వదులుకొని మరీ వచ్చిన వారు కొందరయితే, అంతకంటే మంచి ఉద్యోగాలు వచ్చినా ఉపాధ్యాయ వృత్తినే ఇష్టపడి ఎంచుకొన్న వారు మరికొందరు.

తమ తమ జీవితాలలో తాము చదువు చెప్పే శిష్యుల విజయాలే తమవి గా భావించిన మహోన్నత వ్యక్తులు వారు.
అలాంటి ఉపాధ్యాయులు లేనిదే, ముఖ్యంగా గ్రామీణ వాతావరణం లో పెరిగిన నా బోటి వాళ్ళు చాలా మంది, ఇప్పుడున్న స్థితికి వచ్చి ఉండే వారము కాదన్నది మాత్రం నిజం. అలాగే ఆ రోజులలో జీతాలు పెద్దగా లేకపోయినా, ఉధ్యోగరీత్యా ఆ ఉపాధ్యాయులు తమ తమ ఊరులు విడిచి, పరాయి ఊళ్లలో వచ్చి స్థిరపడినా, మనసు పెట్టి పాఠాలు చెప్పే పంతులు / పంతులమ్మలను ఏ VIP లాగా చూసుకొన్న ఆయా గ్రామాల ప్రజలు, వారి మంచి మనసులు కూడా గుర్తుకు చేసుకోవాల్సిన సంధర్భం ఇది.

ఈ సారి మీ మీ ఊర్లు వెళ్లినప్పుడు ఒక్క సారి, మీ మీ జీవితాలలో అలాంటి ఉపాధ్యాయులు ఎవరయినా ఉంటే, బాగున్నారా అంటూ పలకరించి రండి. ఆ మాస్టార్లకు ఆ రెండు ముక్కలే లక్షల డబ్బుతో సమానం. ఇది మాత్రం ఓ ఉపాధ్యాయుడి కొడుకుగా మాత్రం చెప్పగలను.

ఈ సంధర్భం గా "The Emperor's Club" సినేమా లో నాకు విపరీతం గా నచ్చిన డయలాగులు ఉపాధ్యాయుల గురించి.

"A great teacher has little external history to record.
His life goes over into other lives.
These men are pillars in the intimate structures of our schools,
they are more essential than its stones or beams.
They will continue to be kindling force and revealing power in our lives"


కొసమెరుపు: పై డయలాగులు ఓ Indian American కేరెక్టర్ చేత చెప్పించటం.

Saturday, April 23, 2011

మహానేత యొక్క మహాకొడుకు కు, మహామేక సాయం - మహాసాక్షి వార్త


మహానేత యొక్క మహాకొడుకు మహామేక సాయంతో మహాజనాల్ని మహాగొర్రెలుగా మార్చేందుకు చేస్తున్న మహాప్రచారానికి మహాసాక్ష్యమే ఈ మహాసాక్షి మహావార్త. @!$ జీవితం..ఎందుకులే..మహా బూతులు వచ్చేస్తన్నాయి..lol.

from KC Chekuri's FB

Thursday, April 21, 2011

పిచ్చ పిచ్చ కామెడీ :)))


ఈనాటి కవిత ఇదిగోండి ! నిన్న వాన - ఇవాళ పాట ! రేపటి కవిత దేనిమీదనో ? సాక్షికి ఒక జ్ఞానపీఠ్ ఇచ్చేయండి బాబోయ్ !!

ఎవరన్నారు మిగతా పేపర్లే బెట్టెర్ అని, బస్తీమే, కాదు కాదు, ఎ. పి. మే సవాల్, సాక్షిని కొట్టిన పేపర్ ఉందంటారా?
Credti should go to KC Chekuri's FB except Title.