Friday, November 21, 2014

తె. వాదులకు మఱియు దొర భక్తులకు సూటి ప్రశ్నలు!!!



మీరు మాటి మాటికి వెనుకేసుకోసుకొచ్చే మీ దొర నిన్న అసెంబ్లీ లో మాట్లాడిన లాజిక్కు ను ఎలా సమర్ధిస్తారు?



ఇది నా ఫేస్బుక్కు మిత్రుడు కిరణ్ అడిగిన ప్రశ్నలు. తెలంగాణా వాడే, మీలో ఎవరివద్దయినా  సమాధానాలు ఉన్నాయా?
ఉంటే ఇక్కడయినా, అలవాటు ప్రకారం పెసన బ్లాగులో అయినా  కాస్త సమాధానాలు ఇవ్వండి......

ఆయన తప్పించుకోటానికి పాత ప్రభుత్వాలను అడ్డం పెట్టుకోవటం ఎంత వరకు సబబు?

ఆలోచించాల్సిన విషయం ఒక్కటే, పాత ప్రభుత్వాలు సక్రమంగా చేస్తే కొత్త ప్రభుత్వాల అవసరం ఉండదు. వాళ్ళ పని తిరు నచ్చక, చేసిన నిర్ణయాలు నచ్చక, కొత్తగా వచ్చే వాళ్ళు ఏదో పొడిచేస్తారు, దానివల్ల మన జీవితాలు బాగుపడతాయి అనే కొత్త వాళ్ళను ఎన్నుకుంటారు.


ఇవ్వాళ మా దొరగారు MYHOME GROUP భూముల బాగోతం అంత GO కాపీలు ఇస్తాను అని చెప్తూ చదివారు. సంతోషం. నాకు అర్ధం కానిది ఒక్కటే,
పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరి అయిన నిర్ణయమేనా, ఒక వేల సరి అయిన నిర్ణయం అయితే పాత ప్రభుత్వం మిధ నెపం నేట్టాల్సిన అవసరం ఏంటి?
 ప్రభుత్వం ఇలా చెయ్యటం సబబు అనుకుంది కాబట్టి చేస్తున్నాము అని జవాబు చెప్పొచ్చు, ఒక వేల ఈ నిర్ణయం వల్ల ప్రజాధనం దోపిడీ అవుతుంది అనుకుంటే, పాత ప్రభుత్వ నిర్ణయం తప్పు అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, ప్రజల చేత, ప్రజల కొరకు, ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఈ నిర్ణయం పాత ప్రభుత్వం తీసుకుంది, దాని వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు నష్టం అని ప్రకటన చేసి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవచ్చు. అది ఎందుకు చేయటం లేదు?

ఇంతకి దొర గారు ఇవ్వాళ సభలో MYHOME GROUP వాళ్ళకు కట్టబెట్టిన భూముల నిర్ణయాలు సబబు అనుకుంటున్నారా, లేక పోయిన ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల్లో ఇది కుడా ఒక భాగం అనుకుంటున్నారా?

ఒక వేల బహిరంగవేలంలో పాడుకుని MYHOME GROUP తెచ్చుకుంది అనే భావం తెరాస ప్రభుత్వానికి ఉంటె, లగడపాటి రాజగోపాల్ కొనుక్కున్న లాంకో హిల్స్ భూమి కుడా అలాటి ప్రాపర్టీ కాదా? రామేశ్వర్ రావు గారు వేలంలో కొనుక్కుంటే కొనుక్కున్నట్టు, లాంకో వాళ్ళో, వేరే వాళ్ళో  కొనుక్కుంటే కొనుక్కున్నట్టు కాదా? 

అది తెలంగాణా ప్రాంతానికి నష్టం అయినా, పోయిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయినా, దానిని ఆపే శక్తీ ఉన్న ప్రభుత్వం ఆ భూములను కేటాయించటం ఎలా సబబు అవుతుంది?

ఉద్యమ సమయములో వక్ఫ్ భూములు అంటూ గోల చేసి సీమంధ్ర ప్రాంతం వాళ్ళు అంతా దోపిడిదారులు అని చెప్పటానికి, ధర్నాలు చేసి, నానా రభస చేసి, ప్రభుత్వంలోకి వచ్చాక కుడా, సాక్షాత్తు రాష్ట్ర హోం మినిస్టర్ నాయని నరసింహ రెడ్డి గారు, "ప్రభుత్వం లాంకో హిల్స్ మిధ చెర్యలు తీసుకుంటుంది, వాటిని పేదలకు పంచి పెడుతుంది" అని ప్రకటించాక, ఇప్పటి వరుకు నిర్ణయం ఎందుకు తీసుకోవటం లేదు?

మన రాష్ట్రములోనే కాదా దేశంలో ముస్లిం సోదరులు, దేవుని మిధ బక్తితో, ముస్లిం సోదరుల్లో పేద వాళ్ళకు ఉపయోగపడాలి అని తమ ఆస్తుల్లో విరాళాలుగా ఇచ్చే భూమి, నగదు లాంటివి పరిరక్షించటానికి, వక్ఫ్ చట్టం తెచ్చింది. ఈ చట్టం మీద  సుప్రీమ్ కోర్ట్ లో పలు కేసులు నమోదు అయినప్పుడు సుప్రీమ్ కోర్ట్ స్పష్టముగా తీర్పు చెప్పింది, ఒక సారి వక్ఫ్ ఆస్తులు అయితే అవి ఎప్పటికి వక్ఫ్ ఆస్తులే అని. ఆ చట్టాలకు లోబడి, మన ఉమ్మడి రాష్ట్రంలో 1960 కి ముందే చేసిన సర్వే వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి.
లాంకో ఆస్తులు వక్ఫ్ ఆస్తులు అయితే, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా లాంకో సంస్థకు కట్టబెడితే, లేదా తెరాస వాళ్ళు ఇప్పటి వరుకు చెప్తున్నదే నిజం అయితే 6 నెలలుగా ప్రభుత్వంలో ఉంటూ ఇంకా నిర్ణయం ఎందుకు తీసుకోలేదు?

ఒక వేల లాంకో ఆస్తులు, నిన్నటి సభలో కెసిఆర్ గారు చెప్పినట్టు న్యాయంగా చట్టపరంగా, ప్రభుత్వ వేలంలో పాల్గొని, ఎక్కువ మొత్తం చెల్లించి తీసుకున్నవే అయితే ఉద్యమ సమయములో చేసిన ఆరోపణలు అన్ని రాజకీయ ఆరోపణలు గానే చూడాలా?

 ఒక వేల రాజకీయంగా నిరూపించలేని ఆరోపణలు చేస్తే, మన దొర గారు నిన్న అసెంబ్లీలో చెప్పినట్టు రాజకీయ బహిష్కరణ, లేదా సస్పెండ్ లాంటివి చెయ్యల్సిందేనా.

ప్పుడు మన దొరగారు ప్రభుత్వంలో ఉంటూ చేసిన ఆరోపణలు నిరుపించలేకపోతే ఏమి శిక్ష వెయ్యాలి?



సివరాఖరగా, ఇంతకీ మీ దొర  పాలన మొదెలెట్టాడా? మొన్న దసరా కి అయితే మొదెలెట్టలా అన్నాడు, దానికి ఇంకో రెండున్నరేళ్ళు ఆగాలి అని ఎప్పటిలాగా మీ standard సమర్ధన ఉంటే అదీ సెప్పేయండి!!


Wednesday, November 12, 2014

రాజధానికి 30 వేల ఎకరాలు అవసరమా? నా సమాధానం.


ఎప్పటిలాగే ఏడుపుగొట్టు పిలగాళ్లు, ఇంగిలీసులో cry babies, నా భాషలో తెలబానులు, పెసన బ్లాగులో పెసనవేసారు, దానికి సమాధానం ఇద్దామనుకుని, అది ఎటూ పెద్దది అవుతుంది కాబట్టి, ఇక్కడ వ్రాస్తున్నాను.

మొట్టమొదట, ముందుగా ప్రశ్న మంచిదే, కాకపోతే అది అడిగిన వాళ్ల intention మాత్రం అనుమానం, ఎందుకంటే, ప్రశ్న అడుగుతూ, శ్వేత భవనం  18 ఎకరాలు, పార్లమెంటరీ భవనము 6 ఎకరాలు అంటూ మొదలెట్టటం తోనే చిరాకు, ఎందుకంటే ఓ రాష్ట్ర రాజధాని "నగరానికి", పార్లమెంట్ భవన్ కో, శ్వేత  భవనానికో సంబంధం ఏమిటి? హైదరాబాద్ లో MLA, క్వార్టర్లు, అసెంబ్లీ భవనాలు కేవలం 250 ఎకరాలు ఉంటే, అవే రాజధాని నగరమా? రాజధాని "నగరానికి", administration buildings కు తేడా తెలియకా, లేక ఎప్పటిలాగానే ఏడుపుతో అడిగారా అన్న అనుమానం రావటం లో తప్పు లేదు కదా?

ఇక, ఇలాంటి అనుమానం ఉన్న వాళ్లు నాకు తోచిన (నాకు real estate రంగం లో ఉన్న అనుభవం తో)  సమాధానాలు.

1. ఇప్పుడు మీకు ఏదయినా పెద్ద సిటీ  UDA (Urban Development Authority) లో, ఓ ఎకరమో, రెండు ఎకరాలో ఉన్నది, దానిని స్థలాలు క్రింద చేసి అమ్ముదాము అంటే ఎకరాకు 4800+ గజాలో, లేక 43000+ అడుగులో వస్తాయా? లేక అందులో సుమారు 30 శాతం పోయి వస్తాయా? ఇది అర్ధం అయితే సగం సమాధానం అర్ధం అయినట్లే. UDA నిబంధనల ప్రకారం 40 అడుగుల రోడ్లు వగైరాలకు, స్థలం పోగా సుమారు 70 శాతం స్థలమే నికరం గా వస్తుంది.
ఇది ఒకటో, రెండో ఎకరాల డెవెలప్మెంట్ అయితే, అదే మాస్టర్ డెవెలప్మెంట్ అయితే, ఓ పది శాతం కామన్ డెవెలప్మెంట్ ఏరియా కు వదలాల్సి వస్తుంది (పార్కులు, షాపులు, ఆసుపత్రి, స్కూలు గట్రా లకు). ఇలా వదిలిన 10 శాతాన్ని కూడా, స్థలాలు గా డెవెలపర్స్ అమ్మితే తెలియ కొని మోసపోయిన వాళ్లు మనకు హైదరాబాద్ లో బాగానే కనిపిస్తారు అనేది కూడా అక్కడ రియలెస్టేట్ రంగం లో ఉన్న వాళ్లకు తెలిసే ఉంటుంది. అందుకనే స్థలం కొనే ముందు, master layout చూసుకోవటం, దానిని registered layout తో పోల్చుకొని, మనం కొనే స్థలం ఆ layout లో ఎక్కడ ఉందో చూసుకొంటూ ఉంటాం అనేది చాలామందికి తెలిసిన విషయమే!

ఇప్పుడు ఓ సాధారణ మాస్టర్ లేఅవుట్ కు ఎకరానికి  పోయే స్థలం, 4800 గజాలకు గాను, 30 శాతం మౌలిక వసతులకు, ఓ పది శాతం కామన్ ఏరియాకు, అంటే, చివరాఖరకు వచ్చే నికర స్థలం 2720 గజాలు సూమారుగా.

2. ఓ రాజధాని లేఅవుటుకు ఇంకా ఎక్కువ స్థలం (30 శాతం UDA layouts కంటే) తీసివేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, దానికి 100 అడుగుల రోడ్లు, ఫ్లైఓవర్ ల కోసం, Express hiways వాటి ప్రక్కన ఉండే frontage roads (అనుబంధ రోడ్లు), రైలు మార్గాల కోసం కొంత ఇలాంటివి, ఇవి అన్నీ ఆల్రేడీ ఉన్న సిటీ లలో మాస్టర్ లేఅవుట్ వేసేటప్పుడు consideration లో కి తీసుకోము, ఎందుకంటే ఆ లేఅవుట్స్ ఓ సిటీ కోసం వేసేవి కాదు కాబట్టి. ఇలా క్రొత్త సిటీ కోసం 30 శాతానికి అదనం గా (సిటీ మౌలిక సదుపాయాల కోసం ) ఓ పది శాతం అన్నా తీయాల్సి ఉంటుంది, అంటే పైన లెక్క ప్రకారం ఎకరానికి 4800+ గజాలకు గాను, చివరాఖరకు వచ్చేది  సుమారు 2400 గజాలు (4800 - 40% - 10% ఉడా  లెక్కల ప్రకారం కామన్ ఏరియా).

ఈ 2400 గజాలలో ఇంకా కొంత తీసివేయాల్సి ఉంటుంది, ఎలా అంటే కామన్ ఏరియా 10 శాతం మనం UDA ప్రకారం తీస్తున్నాం, అది ఓ డెవెలప్ అయిన సిటీ లో డెవెలప్  కాబోతున్న లేఅవుట్ కోసం, అదే అసలు సిటీ నే లేని చోట, సిటీ లెవెల్లో కామన్ ఏరియా  ఇంకా చాలా తీయాల్సి ఉంటుంది, బస్ స్తాండ్ ల కోసం, కాలేజీల కోసం, స్కూల్ల కోసం, షొప్పింగ్ ఏరియా ల కోసం, ఆసుపత్రి ల కోసం, పోలీసు స్టేషన్లు,  ఫైర్ స్టేషన్లు ఇలా. ఆ కామన్ ఏరియా కు  అదనం గా, కనీసం ఇంకో పది, పదైదు శాతం అయినా తీసివేయాల్సి ఉంటుంది.
అంటే పైన చెప్పిన 2400 గజాలలో అది తీసివేయ గా వచ్చేది (ప్రస్తుతానికి పది శాతమే తీస్తే) వచ్చేది 2150 గజాలు సుమారు గా అయితే, పదైదు శాతం తీస్తే వచ్చేది సుమారు 2000 గజాలు.

3. రైతులు అందులో ఇవ్వాల్సిన లెక్కలు చూద్దాము, ప్రభుత్వం అందులో 1000 గజాలు + 200 గజాల కమర్షియల్ స్థలం ఇస్తాను అంటూ ఉంటే, రైతులు 1200 గజాలు, 400 గజాల కమర్షియల్ స్థలం అడుగుతున్నారు. మధ్యేమార్గం గా 1100 గజాలు + 300 గజాల దగ్గర సెట్టిల్మెంట్ అవుతుంది అనుకొందాము, అంటే, రైతులు కు వెళ్లేది 1400 గజాలు.

చివరగా ప్రబుత్వానికి వచ్చేది సుమారు ఎకరానికి 600 గజాల నుండి, 750 గజాల వరకే ఎకరానికి!!! దీని ప్రకారం ప్రభుత్వానికి డెవెలప్మెంట్ కోసం వచ్చేది 3000 ఎకరాల నుండి 4500 ఎకరాల రేంజి లో మాత్రమే (కామన్ ఏరియా లో వేటి వేటి ని కలపి ఎంత తీసారు అన్న దానిని బట్టి).

4. ఇక ఆ 3000+ ఎకరాలలో ప్రబుత్వం చేబట్టాల్సినవి


  • 1. అసెంబ్లీ, సెక్ట్రేటియట్, హైకోర్టు, MLA క్వార్టర్లు, గవర్నర్, రాష్ట్రపతి గట్రా బంగళాలు, officers quarters 
  • 2. క్రొత్త సిటీ కాబట్టి సెక్ట్రేటియట్ సిబ్బంది కూడా నివాస సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది, ఆ ప్రాంతం లో అంతమంది కి సరిపోయే నివాసాలు లేవు. 
  • 3. పార్కులు కట్టాల్సి ఉంటుంది 
  • 4. జలాశయాలు క్రొన్ని అయినా బూగర్భ జలాల కోసం, వర్షపు నీరు వ్రుధా పోకుండా కట్టాల్సి ఉంటుంది, ఆ ప్రాంతం గురించి తెలిసిన వాళ్లకు ఇది తెలిసే ఉంటుంది, క్రిష్ణా ప్రాకన తప్ప తుళ్ళూరు గట్రా ప్రాంతాలలో బూగర్భ జలాలు తక్కువ, ఉన్నా అవి సవ్వ నీళ్లు. (పది అడుగుల లోతులో నీళ్లు పడతాయి అని ఆ ప్రాంతం లో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా వెళ్లని వాళ్లు తెగ ఫీల్ అవుతుంటే నవ్వు వస్తుంది అనుకోండి, అది వేరే సంగతి)
  • 5. ఇక ఓ రాజధాని నగరం లో ఉండే సాధారణ visiting places, జూ పార్క్లు, బొటానికల్ పార్కులు, మ్యూజియం లు, లైబ్రరీలు,  శిల్పారామాలు గట్రా కట్టాలి
  • 6. స్పోర్ట్ కోసం స్టేడియంలు కట్టాల్సి ఉంటుంది
  • 7. Human development centers, Trade Development centers కట్టాల్సి ఉంటుంది
  • 8. చాలా డిపార్ట్మెంట్ లకు head quarters కట్టాల్సి ఉంటుంది, హస్త కళలు, leather industry, వ్యవసాయ శాఖ, Tourisim Dept,  ఇలా ప్రతి శాఖకు head quarters కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సంబంధిత శాఖ మంత్రి, సెగట్రీ రాజధానిలోనే ఉంటారు కాబట్టి. 
  • 9. flood zone కోసం కొంత, wild life area కోసం కొంత వదలాల్సి రావచ్చు. 
  • 10. చివర గా, ఎంత వానపిక్ , దొనకొండ ప్రాంతాలను industrial zones చేసినప్పటికీ, ఎంతో క్రొంత ఆ ప్రాంత ఉద్యోగాలు create చేసే సంస్థలకు (అవి ప్రైవేట్ అయినా), కొంత reserve చేసి ఉంచాల్సి వస్తుంది. ఉదాహరణ కు, BEL లాంటి సంస్థ దొనకొండ లాంటి ప్రాంతం లో పెట్టటం మాకు ఇష్టం లేదు, అక్కడ ఏమీ లేవు కాబట్టి మా ఉధ్యోగస్తులకు వసతులు, రాజధాని ప్రాంతం లో కేటాయిస్తే పెడతాము అంటే, ఇవ్వకుండా ఉండటం కుదురుతుందా?, BITS లాంటి సంస్థ (ప్రస్తుత హైదరాబాద్ కేంపసు ఇంచార్జి రావు గారిది తుళ్ళూరు మరి) మేము మీకో కేంపస్ అంటూ పెట్టాలి అంటే ఆ ప్రాంతంలో స్థలం కేటాయిస్తే పెడతాము అంటే, లేదు వెళ్లి నూజివీడు లోనో, ఇంకో చోటో పెట్టండి, లేకపోతే లేదు అని అనగలమా?


పైగా రాబోయే 20, 25 సంవత్సరాలలో పెరగబోయే అవసరాలకు ప్లాన్ చేసి స్థలాలు కేటాయించాల్సి వస్తుంది.

ఇప్పుడు చెప్పండి 3, 4 వేల ఎకరాలు పైన చెప్పిన అవసరాలు (అన్నీ నేను కవర్ కూడా చేసి ఉండకపోవచ్చు) సరిపోతాయా? ఒక వేళ సరిపోతాయి అనుకొన్నా అవి మరీ ఎక్కువ తీసుకొన్నట్లా?


నేను పైన చెప్పిన లెక్కలలో ఏమయినా holes (తేడాలు) ఉంటే, ఎవరయినా urban development లో అనుభవం ఉన్న వారు కాని, లేక కమర్షియల్ రియల్ ఎస్టెట్ డెవలప్మెంట్ లో అనుభం ఉన్నవారు కాని దయచేసి చెప్పండి, కరెక్ట్ చేస్తాను. 

ఏడుపుగొట్టు వీరులు (cry babies) ఎప్పటిలాగానే, మీ ఏడుపులు ప్రశ్న లోనో  లేక మీ మీ వివిధ ఏడుపుగొట్టు బ్లాగులలో ఏడ్చుకోండి.

Note:  వ్యవసాయ భూమి వృధా గురించి తదుపరి టపాలో, అదీ ఇంతకంటే అర్ధం పర్ధం లేని ప్రశ్న, 
వ్యవసాయ భూమి వేస్ట్ అవుతుంది అని ఫీల్ అయే వాళ్లు ఎవ్వరూ (ఆంధ్ర ప్రాతానికి చెందిన వాళ్ల తో సహా)  క్రిష్ణా, (పాత)గుంటూర్ జిల్లా తీర ప్రాంతం, అదీ దిగువ తీర ప్రాంతం వాళ్లు కాదు అని చెప్పగలను. దానిగురించి తదుపరి. 

Thursday, October 30, 2014

ఏమి చెప్పావ్ దొరా!!, మర్చిపోయినట్లున్నావ్? ఇంతకీ నువ్వు ఎస్మా దొరవయినట్లేనా ఇప్పుడు?

ఇంతకముందు సమ్మె చెస్తున్న జుడా ల మీద ఎస్మా చట్టం ప్రయోగిస్తాం అన్న కిరణ్ కుమార్ ను, ఎస్మా రెడ్డి అంటూ ఎగతాళి చేస్తూ, జుడా ల తరుపున చొక్కాలు చించుకొంటూ మాట్లాడిన దొర మాటలు ఇవి,

మరి ఇప్పుడు వాళ్ల మీద ఎస్మా  ప్రయోగమిస్తాం అంటున్నారు, మరి ఇప్పుడు క.చ.రా. ను ఎస్మా దొర అని అనాలా?  ఏమంటారు దొర కు కాల్మొక్కే బ్లాగుల్లొని వీర విధేయులు? 

మందు సూదనా, దీనిమీద కూడా,  ఇది ఆంధ్రోళ్ల కుట్రే అంటూ ఓ టపా వదల రాదూ? కాస్త నా ఫేవరేట్ బ్లాగర్ అన్న పేరు నిలబెట్టుకొందువు కాని.




దొర గారు తాను కూసిన కూతలు తానే మరచిపోయినట్లున్నారు,

 ఈ కూతలు అప్పుడు మంచి కూతలే, ఇప్పుడు మంచివి కాదు అంటూ సమర్ధించుకుంటూ రావటాని బ్లాగులలో చచ్చి దెయ్యాలు గా తిరిగుతున్న అమరవీరులు ఎటూ ఉన్నారు అనుకోండి, దెయ్యాలు ఇగ పండగ చేసుకోండి కామెంట్స్ రూపం లో :)

గమనిక: టపా జూడా ల సమ్మె సహేతుకమా, కాదా అన్నదాని గురించి కాదు, అదే జుడాల సమ్మె గురించి, జుడా ల గురించి అప్పుడో కూతలు, ఇప్పుడో కూతలు కూస్తున్న దొర గురించి, దొరకు బ్లాగులలో కాల్మొక్కే గాళ్ల రియాక్షన్ గురించి మాత్రమే!!



Sunday, October 5, 2014

పెద్ద కొడుకు సొద


చంద్రబాబు వృద్థాప్యపు పెన్షన్ పెంచటం (ఎన్నికలలో హామీ ఇచ్చినట్లు గానే) ఆహ్వానించదగినదే!
కాకపోతే మన పెద్దకొడుకు ఇచ్చాడు అంటూ ఓ వెయ్యిరూపాయల నోటు పట్టుకొని ఓ పెద్దాయన చెప్పటం, ముసలి దంపతులు ఆయన ఫోటో గోడకు తలించుకొన్నట్లు గా పదే పదే ఆ TV యాడ్స్ మాత్రం భరించటం కష్టం గానూ, చాలా చిరాకుగా ఉంది. 

దానికి నా కారణాలు.
1. pension పెంచటం అనేది ఒక్క చంద్రబాబు నిర్ణయం అనే కంటే, చంద్రబాబు నేతృత్వము లోని ప్రభుత్వ నిర్ణయం అనటం సంప్రదాయం,
 ఆ సంప్రదాయాన్ని తుంగలోకి తొక్కిన చచ్చిన దేముడు ఇలానే మొత్తం తానే తన సొంత జేబులోనుండి ఇస్తున్నట్లు బిల్డప్పు ఇచ్చి, ఇలానే ప్రభుత్వ డబ్బుతో యాడ్స్ మీద యాడ్స్ ఇచ్చేవాడు, తాను తిన్న విషయాలు కోర్టు అడిగితే మాత్రం అది మంత్రివర్గ సమిష్టి నిర్ణయం మా నాయన ఒక్కడికే సంబంధం ఏమిటి అని ఇప్పుడాయన కొడుకు అంటున్నాడు,
వీళ్లు చేసే తప్పుడు నిర్ణయాలకు మాత్రం మంత్రివర్గం అంతా సమిష్టి గా భాద్యత వహించటం, చేసే ఉపాధి పథకాలు, పేరు వస్తాయనుకొంటున్న పథకాలకు మాత్రం కేవలం ఒక్కళ్లే చేస్తున్నట్లు ఈ బిల్డప్పులు అవసరమా!
2. ఆ యాడ్స్ అసలే డబ్బులు లేని పరిస్తితులలో అవసరమా? ఓ ప్రక్క రాజధానికి చందాలు అడుగుతూ ప్రభుత్వ పరంగా మరో ప్రక్క ఇలాంటి దుబారా ఖర్చులు చేస్తుంటే జనాలకు ఎలాంటి మెసేజి వెల్తుంది?
TV9 పెట్టాలంటే ఈ యాడ్స్ తో బహు చిరాకు గా ఉంది. 

Wednesday, September 17, 2014

మా మంచి దొర!!





ఇదీ ఓ సారి చూడండి.

ఎవరేమన్నా మా దొరే మంచోడు, మాట మీద నిలబడేటోడు, ఒకవేళ నిలబడకపోయినా అది ఆంధ్రోళ్ళ కుట్ర కదా తెలబాన్స్?

దీని మీద కట్టా శేఖర్ రెడ్డి, తన బ్లాగు లో అడిగిన మాటలు.

"హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ మరాట్వాడాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతున్నదని, ఇక్కడ సీమాంధ్ర ప్రభుత్వం సెప్టెంబరు 17ను గుర్తించకపోవడం అన్యాయమని నిన్నమొన్నటిదాకా మనమే నిందించాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ కారణాలు చెప్పి ఉత్సవాలకు దూరంగా ఉంటుంది? తెలంగాణ అస్తిత్వం ప్రతీకలను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్న ప్రభుత్వం రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును ఎలా విస్మరించగలదు. మనకు రాని స్వాతంత్య్ర దినం ఆగస్టు పదిహేనును ఘనంగా నిర్వహించే మనం, మనకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబరు 17ను ఎలా విస్మరించగలం? ఇప్పుడు సెప్టెంబరు 17ను జరుపుకోకపోవడం రాజకీయ అవకాశవాదం అవుతుంది. చరిత్రను అవమానించడం అవుతుంది. రాజకీయ పునరుజ్జీవనం గురించి మాట్లాడుతున్నవాళ్లం, మొన్నమొన్నటి వాస్తవాలను ఎలా దాచిపెట్టగలం? "

ఇంతకీ గత ప్రబుత్వం చేసినది మంచి పనా? కాదా?

ఆనాడు మహారాష్ట్ర, కర్నాటక ప్రబుత్వాలు లాగా అప్పటి ప్రబుత్వం ఎందుకు చేయటం లేదని చొక్కాలు చించుకొన్న దొరకు, ఇప్పటి సంది ఏమయినాదే? నిజాం రాణి ని చూడగానే, దొర గారి భక్తి పొంగిందా పాత ప్రభువు మీద?

ఇంతకీ అది నాలుకా, తాటి మట్టా? ఇది కూడా ఆంధ్రోళ్ల మీడియా కుట్రేనా మందు సూదనా & కంపెనీ?


Tuesday, September 16, 2014

మా మంచి ఆచార్యుడు!!



ఆచార్యులు అంటే ఒకే మాట మీద, కనీసం ఒకే అభిప్రాయం మీద ఉండే వాళ్లు, ఊసరవెల్లి లాగా ఆచార్యుల ముసుగులో ఉన్న రాజకీయనాయకులకంటే దరిద్రుడి నిజ రూపం.

అయ్యా కోదండరామా, నువ్వు మాత్రం మా తెలబానులకు సరి అయిన గురువు వే సుమా!

పైన U turn కు కూడా ఆంధ్రా మీడియా, ఆంధ్రోళ్ల కుట్ర లే కారణమా మందు సూదనా? దీనిమీద కూడా ఓ విద్వేషపు టపా వెయ్య రాదే?

క.చ.రా. దరిద్రపు భాష దగ్గరనుండి, వసూళ్ల వరకూ paid comments లాగా సమర్ధిస్తూ, కామెంట్ లు వేసే కామెంట్ వీరులేమయినా సమాధానం చెబుతారా దీనికి?