Thursday, April 14, 2011

తెలంగాణా రాష్ట్రం రావాలంటే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావాల్సిందే - క.చ.రా. దొర

ఆయన నిరాకారుడు, నిర్గుణుడు. నీళ్ళ లాంటివాడు. ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారం పొందగలవాడు. ఆవిరయిపోతుంటాడు. అలలా ఎగసిపడుతుంటాడు. భూమిలో దాక్కుంటుంటాడు. అకస్మాత్తుగా ఆకాశంలో ప్రత్యక్షమవుతాడు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు. ఎందెందు సందు దొరికిన అందందే దూరిపోగలడు ! నీ లీలలు ఎన్న మా తరమా ? పాహిమాం చంద్రశేఖరా ! పాహిమాం !!
మందు బాబు గారి వేషాలు

"తెలంగాణా రాష్ట్రం రావాలంటే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావాల్సిందే"  అని మరో సారి దొర గారు తన కాంగీ భక్తి చాటుకొన్నారు.
కాని తెలంగాణా రాష్ట్రం కావాలనుకొనే మేతావులు (బ్లాగులలోనూ, బయటా) ,
ఒరే ముక్కు దొరా, రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, దానికి ప్రధాన ప్రతిపక్షమయిన భా.జా.పా. కూడా అండ ఇస్తాను అని కోడై కుస్తుంటే, బిల్లు పెట్టని కాంగీ ని, నువ్వు యాగం చేస్తున్న చండీ రాణి aka బంగారమ్మ ను అనక పట్టుమని పదిమంది కూడా పార్లమెంట్ లో లేని తెలుగు దేశాన్ని ఎందుకు ఆడిపోసుకొంటావురా?  అని ఒక్కరంటే ఒక్కరు అడగకపోవటం ఆశ్చర్యం!!!
అంతకంటే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయితే గాని తెలంగాణా రాదన్న తెలివితేటలు 2009  లో పొత్తు పెట్టుకొన్నప్పుడు ఏమైందిరా అని, విగ్రహాలు విద్వంసం చేసినప్పుడు ఎగేసుకొచ్చి సమర్ధించిన స్మశాన బాబా లాంటి తెలబాను వీరులు  ఒక్కరంటే ఒక్కరు అడగకపోవటం గురించి ఏమంటారు?
కోస్తా సీమ తెలుగుదేశం నాయకులకంటే, గట్టిగా నిలబడుతున్న లగడపాటి తోనేమో దోస్తానా, వ్యాపార లావాదేవీలు, ఏడుపు ఏమో తెలుగు దేశం మీదా!! ఎంతైనా క.చ.రా. దొర,  నువ్వు మాత్రం తెలబానులకు సరి అయిన నాయకుడవే సుమా :)
ముందు తెలంగాణా ప్రాంతం,  తద్వారా మొత్తం ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే, నువ్వు నీ కుటుంబం  బూస్థాపితం కావాలిరా దొర!!!

                          

తెలబాను క.చ.రా. దొర సోనియా యాగం

http://analysis-seenu.blogspot.com/2011/04/blog-post_9919.html

4 comments:

  1. ఈ పోస్టుకి ఇంకా కామెంట్లు రాలేదా ? భలే విచిత్రం గా ఉంది :)

    ReplyDelete
  2. ఆయన నిరాకారుడు, నిర్గుణుడు. నీళ్ళ లాంటివాడు. ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారం పొందగలవాడు.
    ఏవిటి, అహా ఏవిటీ ఈ వైపరీత్యం. మా కేసీఅర్ నే ఆడిపోస్కుంటారా? అన్నా! హెంత ధైర్యం?

    ReplyDelete
  3. యాగం షేయరా ముక్కుఢింబకా, బంగారమ్మని ప్రషన్నం షేషుకోరా... గవర్నర్‌గిరి సిద్ధిస్తుందిరా ...

    ReplyDelete
  4. ఇన్ని రోజులు ఈబ్లాగ్ ఎలా మిస్సయ్యానబ్బా....??? ఆయన నిరాకారుడు, నిర్గుణుడు. నీళ్ళ లాంటివాడు. ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారం పొందగలవాడు. -ROFL
    -ముక్కు వంకరవాడు.. వంకరబుద్దివాడు...భావ దరిదృడు..!! ఇవి కూడా చేరిస్తే సూపరనుకుంటా....!!!

    ReplyDelete