Tuesday, January 19, 2016

కాల్ మనీ యవ్వారం లో ఓ తెలుగు సంఘం పాత పెసిడెంట్ పాత్ర/ NRI Telugu Association former president role in Call Money Scandal


రోల్ మోడల్ అని అడిగి మరీ వ్రాయించుకొంటున్న నా అభిమాన NRI కాల్ మనీ లో పెట్టుబడులు బాగానే పెట్టాడని, అందుకనే మొన్నా మద్దెన (ఈ యవ్వారం బయట పడకముందు 2014 లో)  MLA లకు  MP  కంటే  ఎక్కువ ఈయన గారికి బందరు రోడ్ అంతా బ్యానర్లు కట్టేసారని మా బెజవాడ వర్గాల భోగట్టా.
 ఓ మూడేళ్ళ క్రితం ఓ ఇండస్ట్రీ పర్మిషన్ కోసం DE సత్యానందాన్ని మిత్రులు కొందరు కలసినప్పుడు, మాటల మద్దెన అమెరికా మాట వస్తే,  ఆయన ఈ role model NRI పేరు తెగ కలవరిస్తే,  ఈయన గారికి, సత్యానందానికి లింక్ ఏడో కలిసింది అనుకొన్నాం కాని, అది కాల్ మనీ లింక్ అనుకోలేదు.

ఏదయితేనేమి, బెజవాడ బందర్ రోడ్ లో 'మా' తర్వాత 'మా' సంఘానికి పెసిడెంట్ అయినోడికి ఇన్ని బ్యానర్లు కట్టటం ఏమిటా అని తెగ మధన పడిపోయిన ఆ role model NRI సహచరులకు ఇప్పటి కి సమాధానం దొరికినట్లయ్యింది.

ఈ కాలమనీ రాకెట్ ఎంత పవర్ ఫుల్లో తెలియాలంటే, దీని మీద మొదటగా వార్త వ్రాసినోళ్లు మ్యాటర్ అర్జెంట్ గా  తొలిగించేటంత!! కావాలంటే గూగులమ్మను former NRI association president call money అని అడిగి ఆ లింక్ పనిచేస్తుందో లేదొ చూడండి తెలుస్తుంది, వీళ్లా రోల్ మోడల్స్, థూ :)
పని చేయని లింక్


కొస మెరుపు: అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు,  ఇంకో తెలుగు సంఘం  పెద్దాయన  కోకో కోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ అంటూ  తెలుగు భాషకు , బాలయ్య బాబుకు సేవ చేసుకొంటున్న వీడియో మీ అందరి కోసం, చూసి ఆనందించండి, ఈ వీడియో ని చూపిస్తూ, ఇందుకు కదా అమెరికా వోళ్లు విసాలు ఉన్నా మన తెలుగోళ్లను వెనక్కి పంపిస్తుంది అని సోసల్ మీడియా లో జనాలు ఒకటే జోకులు:)



Tuesday, June 2, 2015

ఎవరు మా ఫేవరేట్ బ్లాగర్ బోడిగుండు ను అనే ధైర్యం చేస్తున్నది?


మా బోడి గుండు కు ఫ్యాన్స్ లేరనుకున్నారా? లేక బోడి గుండు కు ట్యాలెంట్ లేదనుకున్నారా? హమ్మా జిలెబీలు, జాంగ్రీలను అడ్డుపెట్టుకొని ఎగతాళి చేస్తున్నారా? మీకు తెలియకపోతే, బోడి గుండు ఫంకా గా,  మా ఫేవరేట్ బ్లాగరు ట్యాలెంట్లు చెబుతాను వినుకోండి.

విధ్వేషపు రాతల మెగుళ్ళకు మొగుడు మా బోడి గుండు!

ఆంధ్రోళ్ళ కుట్ర, ఆంధ్రోళ్ళ కుట్ర అంటూ నిద్దరలో కూడా కలవరించే అంత గొప్ప అంధ్ర ఫంకా మా బోడి గుండు!

మార్కెట్లో వంకాయల రేట్లు పెరిగినా, ప్రక్కింటోళ్ల తో గొడవలు పెరిగినా, అంతెందుకు మొన్న వరంగల్ లో కళాకారులు నిరసన తెలీచేసినా, ఇందు కలదు అందు లేదు అన్నట్లు అన్నిట్లో ఆంధ్రోళ్ళ కుట్ర కోణం చూడగలిగిన మహా ఙ్ఞాని మా బోడి గుండు!

మా బోడి గుండు క.చ.రా. రామోజీని తిడితే రామోజిని తిడతాడు, క.చ.రా. రామోజిని పొగిడితే, రామోజి ఇంటిలో జీతగాడు అవగలిగినట్టి ,  క.చ.రా. భక్తాగ్రేసరుడు మా బోడిగుండు!

నమస్తే అన్న మాట వినిపిస్తే చాలు, ఉలిక్కిపడి లేచి తన నమస్తే ఎత్తిపోతల దీక్షకు ఆటకం కలుగుతుందో అని చింతించే, లక్ష విద్వేషపు ఎత్తిపోతల నోము పట్టిన వీరుడు మా బోడిగుండు!

పుట్టినప్పుడు ప్రతి ఒక్కడు ఏడుస్తూ పుడతాడు, కాని జీవితం జీవించేటప్పుడు మిగతా అనుభూతులు నవ్వటం, బాధపడటం గట్రా లు అందరూ చేస్తే, తాను మాత్రం పుట్టినప్పుడినుండి , గిట్టే వరకు ఏడుపులు మాత్రమే ఏడవాలని కంకణం గట్టుకున్న వేదాంతి మా బోడి గుండు!

అలాంటి బోడిగుండు ను పట్టుకొని, కోటి ఏడుపుల నోము ఆకుంటిత దీక్ష తో చేస్తున్న ఆ దీక్షాపరుడి తపస్సు భంగం చేయ తలపెడతారా?

ఇదేమయినా మీకు భావ్యమా అని మా బోడి గుండు ఫ్యాన్స్ అస్సొసియెషన్ తరుపున అడుగుతున్నాను  జిలేబి ఫంకాలను :))

గుండు ఙ్ఞాని, మీ కోటి ఏడుపుల వ్రతాన్ని ఎటువంటి చీకు చింతా లేకుండా చేసుకోండి,

మీ దొర ఆంధ్రోళ్ల కాళ్లలో ముళ్ళు గుచ్చుకొంటే తన పంటితో పీకటానికి ఎంత నిబద్దతతో ఉన్నాడో, అలానే మీ ఫ్యాన్స్ అందరమూ మీకు సప్పోర్ట్ చేయటానికి అంతే నిబద్దతతో ఉన్నాం అని బ్లాగ్ ముఖం గా బోడి గుండు గారికి తెలియచేస్తున్నాము.


 చివరాఖరుగా, యమ అర్జెంట్ గా, మా బోడి గుండు తరుపున "గుండు", "బోడిగుండు", "నమస్తే", "కోటి ఏడుపులు", "మందు" "మందు సూదనం" గట్రా పదాలను బ్లాగులలొ బోడి గుండు ఫ్యాన్స్ గా మేము ట్రేడ్ మార్క్ చేయుటకు నిర్ణయించాం అని తెలియ పరుస్తున్నాం.  ఎవరికేని అభ్యంతరం ఉన్న తెలియపరచగలరు :)

Friday, May 8, 2015

యువరాజు గారి అమెరికా పర్యటన!!

యువరాజు గారు అంటే KTR గారు అని భ్రమ పడకండి, మన లోకేష్ బాబు .
ఆయన అమెరికా పర్యటనకు ఎందుకొచ్చినట్టు, ఏ హోదాలో వచ్చినట్టు, అందులో smart villages అంటూ తెగ ప్రచారం ఎందుకు ఏ హోదా లో చెస్తున్నట్లో, కాస్త తెలిస్తే చెప్పండి తెలుగుదేశం తమ్ముళ్ళూ, feeling irrititated!!

ఆ smart village దత్తత అంటూ తెగ హడావుడి చేస్తున్నాడు ఈయన, ఏ గ్రామాన్ని అయినా ఎవరైనా దత్తత తీసుకోవచ్చు పైసా ఖర్చు లేకుందా, కేవలం బళ్ళొ హాజరు వేసుకొన్నట్లు, ఆన్లైన్ లో పేరు పెట్టుకోవటం, దానికి ఈ హడావుడి ఎందుకు? ఆయన మెహర్భాని కోసం తె.దేశం తమ్ముళ్ళు అందరూ అమెరికాలో ప్రతి ఊళ్ళొ పోటీలుపడి నానా హంగామా చేయటం ఏమిటి?  మా ఊళ్లొ వంద ఊళ్లు దత్తత చేసుకొన్నాం అని ఒక తమ్ముడు అంటే, మా ఊళ్లొ రెండొందలు అంటూ ఇంకో తమ్ముడు హడావుడి చేయటం ఎందుకు? వాటికి టివి లలో, సోసల్ మీడియా సైటు లలో అంతులేని హంగామా ఏమిటి?

అక్కడ కార్పోరేషన్ పదవులకు కర్చీఫులు, మున్ముందు MLA టికెట్స్ కో, వాళ్ల వాళ్ళ పనులు అవటం కోసమో యువరాజా వారిని ప్రసన్నం చేసుకోవటానికి కొద్ది మంది రాజకీయ ఆశావాహులు, వ్యాపారులు వాళ్ల వాళ్ల స్వార్ధం కోసం యువరాజా వారి కోసం ఈ మీటింగ్స్ పెడుతుంటే, వాటికోసం పచ్చ తమ్ముళ్ళు చొక్కాలు, జీన్స్ పేంట్లు  చించుకొని పనిచేయటం ఏమిటి? వీళ్లకు కాని, తె.దే.పా. పార్టీ కి గాని ఈ హడావుడి వలన ఒరిగేది, ఉపయోగపడేది ఏమయినా ఉందా? దీని బదులు యువ రాజా ఈ పనికిమాలిన కర్చులు జనాల చేత పెట్టించే బదులు, కేపిటల్ నగరానికి కాస్తో కూస్తో నిధుల సేకరణ చేసి ఉంటే బాగుండెది కదా?

చదివేస్తే ఉన్నమతి పోవటం అంటే ఇదేనేమో! దేవుడా......

p.s. మందు సూదనా,  రాజులయినా, యువ రాజులయినా మా పెద్ద దొర, చిన్న దొరలే ఇందులో కూడా ఆంధ్రోళ్ల కుట్ర అంటూ ఫీల్ అవ్వబాకు :)


Friday, May 1, 2015

మందు సూదనా, పాలకులు, దోపిడీదారులూ, దుర్మాగవర్తనలు కు ప్రాంతమో, మతమో, కులమో అన్న విభేదాలు నీలాగా ఉండవు స్వామీ,!

కోటి ఉమెన్స్ కాలేజీ ఎదుట సెల్ టవర్ హోర్డింగ్ ఎక్కిన తెలంగాణా జాక్ విద్యార్ధులు, నాచారం ఇండస్ట్రియల్ ఏరియా లో సుప్రబాత్ అనే కాలేజీ+స్కూల్ ఏర్పాటు పైన నిరసన, అధికారి పైన చెర్యలు తీసుకోవాలి అని డిమాండ్.
ఈ వార్త వినగానే నాకు 3 ప్రశ్నలు
1. ఈ ల్యాండ్ సుప్రబాత్ సంస్థకు ఎప్పుడు కేటాయించారు. ఆంధ్ర పాలకుల సమయములోనా, తెలంగాణా పాలకుల సమయములోనా?
2. ఈ సంస్థకు ల్యాండ్ కేటాయించిన అధికారి ఎవరు, ఆంధ్ర అతనా, తెలంగాణా అతనా?
3. సుప్రబాత్ సంస్థ ఎవరిది, ఆంధ్ర పెట్టుబడి దారులదా, తెలంగాణా దొరలదా.

విద్యార్ధులు దిగి వస్తారా, విద్యార్ధుల డిమాండ్ లో సహేతుక ఎంత అని ఆలోచించే ముందు ఈ ప్రశ్నలు రావటం నాకు సిగ్గుగా అనిపించినా, ఈ వార్తను చుసిన చాలా మంది మిత్రులు ఇరు వైపులా కుడా ఇలాంటి ప్రశ్నలే అలోచించి ఉంటారు. నా లాగా చెప్పుకోటానికి మొహమాట పడి ఉంటారు.
బాధ్యతగా మెదలల్సిన నాయకులూ, బాద్యత మరిచి నోటి కోచ్చినది వాగి, ప్రజల్లో విషం నింపితే, ప్రజల ఆలోచన ఇలాగే మారుతుంది, అనే దానికి ఇదో ఉదాహరణ.

మన ఆలోచనని ప్రభావితం చేసే నాయకత్వ బాద్యత లేకపోవటం, వాళ్ళను నాయకులూ అని మనం భుజాన మొయ్యటం మన దరిద్రం.

----------------------
అన్నిటికంటే వాళ్లకు కాల్మొక్కే సంస్క్రుతి ని వీడలేని మందు సూదన లాంటి ఏడుపుగొట్టు గాళ్ల మెంటాలిటీ మరింత దరిద్రం. 

మందు సూదనా, పాలకులు, దోపిడీదారులూ, దుర్మాగవర్తనలు కు ప్రాంతమో, మతమో, కులమో అన్న విభేదాలు నీలాగా ఉండవు స్వామీ,!  అది తెలుసుకోలేకపోయి, సొల్లు కబుర్లు చెప్పే నీ అజ్ఞానపు ఏడుపులకు నా సానుభూతి!



p.s. చివరాఖరి ముక్క తప్పితే అంతా మిత్రుడు కిరణ్ ముఖ పుస్తకం నుండి ఎత్తిపోత. 

Sunday, December 14, 2014

భగవద్గీత గురించి తెగ చర్చలు, సవాళ్ళు విసురుతున్న మేతావుల కోసం!!


ఒరేయ్ పూల్స్, భగవత్ గీత తత్త్వం మీ చర్చలు, వాదోపవాదాలు,సవాళ్ళకు ,దాని పై మీ అనవసర చర్చకు అందేది కాదురా !!

అది ప్రాక్టికల్ గీత అనుసరించాల్సిన ,ఆచరించాల్చిన మార్గ దర్శకం ! 
గీత లో సుఖం,సంతోషం ,ఆనందం,ఆహ్లదాలకు ఎలా నిర్వచనము చెప్పారో గమనిచండి .

1. జీవిత సమరము నుండి ,సమస్యలనుండి పారిపోవడానికి ప్రయత్నిస్తావు ఎందుకు ?మనం వాటిని తప్పిచుకోలేము నిజం గా జీవితం అంటే అవే !.వాటిని ఎదుర్కోవడమే సుఖం .వాటిని పరిష్కరించడమే సంతోషం .

2. ప్రేక్షకుడిలా జరిగే సంఘటనల తో బంధం ఏర్పరుచుకోకుండా . ఏ మాత్రం సంభందము లేని నూతన వ్యక్తి వో అన్నట్లు చూడడమే ఆనందం.

3) జీవితములోని ఒడి దుడుకులను క్రీడ లాగా (అట లాగా ) ఆస్వాదించడమే జీవితానికి ఆహ్లాదానిస్తుంది.

3) సంతోషం అంటే కష్ట పడి సాధించేది కానీ ,సంపాదించేది కానీ కాదు అది నీ సహజ స్వభావమే అని వేదాంతం  చెపుతుంది

4) యోగ సిద్ధి అనేది ఎక్కువ తినేవాడికి ,అతి కొద్దిగా తినే వాడికి ,ఎక్కువ నిద్ర పోయేవాడికి,ఎల్లపుడు మేల్కొనే వుండే వానికి ప్రాప్తించదు. ఎవరైతే ఆహార విహరాదుల యందు ,కార్యసాధనలు, నిద్ర మెలకువల యందు మితాన్ని పాటిస్తారో వారికీ యీ సాధన వల్ల దుఖ నివారణ కలుగుతుంది అని చెపుతుంది

Disclaimer: నా ముఖపుస్తక మితృడు, మా డాలాస్ వాసి (అప్పుడప్పుడు) అయిన గోపి రెడ్డి గోడ నుండి ఎత్తిపోత. Complete credit should goes to him only.

Monday, December 8, 2014

అయ్యో జాన్ గారు ఎందుకు ఇలా ..

విధి విచిత్రమైనది, అయిదేళ్ల క్రితం, జాన్ గారు తన చేయి రేఖలు బ్లాగు లో పెట్టి, analyze చేయమన్నారు. ఎవరికయినా గుర్తు ఉందో లేదో? ఇది లింక్

http://johnhaidekanumuri.blogspot.in/search/label/%E0%B0%B8%E0%B0%B0%E0%B0%A6%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE

http://johnhaidekanumuri.blogspot.in/search/label/%E0%B0%B8%E0%B0%B0%E0%B0%A6%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE

అందులో ఓ కామెంట్ చేసినాయన ఎవరన్నది ప్రస్తుతం అప్రస్తుతం.


1. మీకు ఆరొగ్యసమస్యలు మాత్రం తప్పకుండా ఉంటాయి. (కొందరు నాకే సమస్యలు లేవు, దాక్టర్ దగ్గరకు వెళ్లింది లేదు అంటారు, మీరు మాత్రం కాదు) అని అంటే, జాన్ గారు ఇచ్చిన సమాధానం.
42వ సంవస్తరంవరకు డాక్టరు దగ్గరకు వెళ్ళలేదు అన్నది నిజం. తర్వాత బి.పి. బటపడటం తప్ప పెద్దగా ఆరోగ్యసమస్యలు లేవు.

దానికి అతను ఇచ్చిన సమాధానం

1. మీరు కొద్ది b.p బయటపడింది అని మాత్రమే అనుకోకుండా, దయచేసి సంవస్తరానికి ఒక్కసారి అన్నా complete blood test, including lipids, a1c and creatin గట్రా) చేయించుకోండి. అది మిమ్మలను ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. మిమ్ములను భయపెట్టే ఉద్దేశ్యం తో కాకుండా, మీ శ్రెయోభిలాషి గా అంటున్నాను

అతనికి ఎందుకు అలా చెప్పాలని అనిపించిందో, అయిదు ఏళ్ల క్రితం నాకు ఒక్క బి.పి. తప్ప వేరే ప్రాబ్లంస్ లేవు అన్న జాన్ గారు ఆ తరువాత బైపాస్ అవ్వటం ఏమిటి, హార్ట్ ఏటాక్ తో పోవటం ఏమిటి?

సెప్పినాయన మాత్రం ఎందుకు ఆనాడు అలా అన్నానా అని బాధ పడుతున్నాడు.
కొన్నిటికి లాజిక్ లు మన చేతి లో ఉండవేమో,
anyway R.I.P. John గారు.

Thursday, December 4, 2014

విభజన వలన వస్తున్న రాజధాని వలన పోయే ఆయకట్టు ఎంత, వచ్చే ఆయకట్టు ఎంత?

 ముచ్చటగా మూడు పంటలు పండే కమ్మని మాగాణి భూమి ఆ 30 వేల ఎకరాలు, 10 అడుగులలో నీళ్లు పడి, ఎకరాకు లచ్చలు లచ్చలు ఆదాయం వచ్చే భూములు అవి అంటూ బ్లాగులలో, బయట cry babies, నా భాషలో తెలబానులు అలవాటయిన వాళ్ల ఏడుపు రాగాలు వినిపిస్తుంటే, ఇక తప్పక ఈ టపా.

మొదటగా అయ్యలూ, అమ్మలూ మీలో ఎందరు ఆ ప్రాంతాన్ని తాడికొండ, తుళ్ళూరు, క్రిష్ణాపురం గట్రా జీవితం లో ఒక్కసారి అయినా వెళ్లారు? మీలో ఎవరికయినా ఆ ప్రాంతం లో ఒక్కసెంటు భూమి అయినా ఉందా? పోనీ మీకు,  బంధువులు కాని, మితృలు కాని ఆ ప్రాంతానికి చెందిన వాళ్లు ఉన్నారా? ఉంటే, గింటే వాళ్ళను ఒక్కసారి అయినా నిజ పరిస్థితి అడిగారా? మఱి పైవి ఏమీ లేకుండా ఎందుకు ఈ పనికిమాలిన ఏడుపులు చెప్పండి, మీకు!!!

నిజానికి ఆ ప్రాంతం లో అత్యధిక భాగం కేవలం ఒక్క పంటే, అదీ (కొండవీటి వాగు పొంగక పోతే, వర్షాలు బాగా పడితే) కచ్చితం గా గ్యారంటీ లేని పంట పండే పొలం. ఆ ప్రాంత మొగ పిల్లలకు (కొద్దో గొప్పో పొలం ఉన్నా) పిల్లలు దొరకని పరిస్థితి మొన్న మొన్నటి వరకు. ఇప్పుడు కూడా మహా అయితే 5 వేల ఎకరాల నుండి 10 వేల ఎకరాల వరకూ గ్యారంటీ గా కాస్త ఆదాయం వచ్చే పళ్ల తోటలు, కూరగాయ సాగు జరుగుతుంది. అది కూడా క్రిష్ణా నది మీద ఈ మధ్య కాలం లో ఎదో చెక్ డ్యాం లాంటిది కట్టటం వలన అని అన్నారు. ఆ పండే పొలాలు కూడా ఎంతో కొంత flod zone ప్రాంతం లో ఉన్నవి, assigned lands లో ఉన్నవి కూడాను.
మిగతా పొలం కౌలుకు,  బ్రతిమాలి ఇవ్వాల్సిన పరిస్థితి.
అది నిజ పరిస్థితి.

ఇక సరె, ఆ 5, పది వేల ఎకరాలు అయినా ఆయకట్టు ఉన్న ప్రాంతం ఎందుకు పోవాలి అన్న ప్రశ్న రావటం సహజం. ఆయకట్టు అంటే సాగర్ పడిన తరువాత 2,3 పంటలు నికరం గా పండే ఎంత ఆయకట్టు క్రిష్ణా, పాత గుంటూరు జిల్లాలు కోల్పోయాయో ఎవరికయినా తెలుసా?

అది తెలియకపోతే, అటు ఉయ్యూరు క్రింద నుండి గొల్లలమోద (క్రొత్త పేరు దీనదయాళపురం అనుకుంటా) వరకు, ఇటు తెనాలి క్రింద నుండి రేపల్లె తుమ్మల వరకు, ఇంకో  ప్రక్కన పొన్నూరు దిగువనుండి చినగంజాం వరకు ఎంత ప్రాంతం చక్కని ఆయకట్టు కోల్పోయిందో, ఆ విస్తీర్ణం ఎంతో తెలియకపోతే లెక్కలు వేసుకోండి.

సాగర్ వలన ఉపయోగం లేదన్నది నా అభిప్రాయం కాదు, ఒక లాభానికి ఇంకో నష్టం ఏర్పడుతుంది అన్నట్లు, ఒండ్రు మట్టితో చక్కగా కళ కళ లాడే ఆ దిగువ తీర ప్రాంతం అంతా ఒక్క పంట కు కనా కష్టం గా దిక్కులేనిది అయ్యింది అన్నది వాస్తవం. ఒకప్పుడు దివి సీమ ప్రాంతం వాళ్లు ఉత్తరాది క్రిష్ణ జిల్లా వాళ్లకు పోరంకి, పెనమలూరు లాంటి వాళ్లకు వాళ్లకు పంటలు పండవు, మెట్ట రైతులు అంటూ పిల్లలను కూడా ఇవ్వని పరిస్థితి నుండి, ఇవ్వాళ మొత్తం ఆ ప్రాంతం అంతా రైతు కుటుంబాలు వలస పోయిన పరిస్థితి నిజం. ఒక్క సారి అమెరికా నుండి, దిల్షుక్నగర్ వరకూ చూస్తే ఈ ఆయకట్టు కోల్పోయిన రైతు కుటుంబాల వారసులే కనిపిస్తారు ఎక్కువుగా!! అంతే కాదు తీపి నీరు పైనుండి రాక, క్రిష్ణా ప్రక్కన ఉన్న ఊళ్లళ్ళొ భూగర్భ జలాలు ఉప్పులు వేసి  వేసవి వచ్చిందంటే, తాగునీరు కూడా ఇబ్బంది అవుతున్న దిగువ తీర ప్రాంత ఊళ్ళు ఎన్నో!

 సరే, పైన చెప్పింది నిజమే, కనీసం ఓ లక్ష ఎకరాలు పైనే రెండో, మూడో పంట ఆయకట్టు సాగర్ వలన మంచి గడ్డ ఉన్న్ల క్రిష్ణ, పాత గుంటూర్ జిల్లాలు కోల్పోతే, వాటికి ప్రస్తుత విభజన వలన వచ్చిన రాజధానికి సంబంధం ఏమిటి అంటారా? అక్కడకే వస్తున్నా.

విభజన వలన జరిగిన మంచి ఏమిటి అంటే, పోలవరం నిజం అయ్యే అవకాశం వచ్చింది, విభజన అంటూ జరగకపోతే ఎవరికి వాళ్లు నాటకాలు వేసారు కాని, పోలవరమ్  పై  చిత్త శుద్ది చూపలేదు, చూపేవాళ్లు కూడా కాదు అన్నది వాస్తవం, ఎప్పుడో మొదలయిన పులిచింతల ప్రాజెక్ట్ ఇంతవరకూ పూర్తి కాలేకపోవటమే దానికి నిదర్శనం.

ఇక పోలవరం కాలువ వచ్చి ఎగువ ప్రకాశం బ్యారేజ్ లో కలుస్తుంది కాబట్టి, అది పులిచింతల కాంబినేషన్ల వలన అటు బందరు కాలువ, ఇటు కొమ్మమూరు కాలువ, బంకింగ్ హాం కాలువ ల వలన రెండో పంటకు వరకయినా గ్యారెంటీ గా నీళ్లు వచ్చే అవకాశాలు వచ్చాయి, దాని వలన కనీసం ఇప్పుడు రెండో పంట కోల్పోయిన ఆయకట్టు అంతా సాగు లోకి రాబోతుంది, అందు వలనే, రాజధానికి దూర ప్రాంతం అయినా పొలాల రేట్లు ఈ ఆయకట్టు ప్రాంతం లో ఈ మధ్య పెరగటానికి ఇది ఓ కారణం.

ఇప్పుడు విభజన వలన ఏర్పడుతున్న రాజధాని నగరం వలన కృష్ణా, గుంటూర్ జిల్లా ఆంధ్రులు కోల్పోతుంది సుమారు ఓ 10 వేల ఎకరాల నికర మాగాణి, పండ్ల తోటల ప్రాంతం అయితే, క్రొత్తగా, ఒకప్పుడు ఉండి  కోల్పోయిన ఆయకట్టు,  అంతకంటే ఎన్నో రెట్లు సాగులోకి  రాబోతుంది. కాబట్టి ఎదో కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్లు, తినడానికి తిండే దొరకదు అన్నట్లు ఎదవ ఏడ్పులు తెలబానులు ఏడవాల్సిన పనిలేదు .

పై లెక్కలు ఆ ప్రాంతాలలో పరిచయం ఉన్నందున, నే చెప్పింది, లెక్కలలో తేడాలు ఉంటె, ఆ ప్రాంతం వారయితే , లేక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుభవం ఆ ప్రాంతం లో ఉండి ఉంటే, చెప్పండి, టపా కరెక్ట్ చెస్తాను.

( నే చెప్పిన విషయం, సాగర్ వలన దిగువ తీరప్రాంత రైతాంగం ఎంత కోల్పోయిందో నమ్మకపోతే, మీ ఆ ప్రాంత మితృలను అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. వాళ్లు కాని, వారి కుటుంబాలు కాని 1960, 70 లలో ఆ ప్రాంతం లో వ్యవసాయం చేసి ఉండి ఉంటేనో, చూసి ఉండి ఉంటేనో బెట్టర్. ఈ మద్దెన పుట్టిన (1980 ల తరువాత తరానికి) వాళ్లకు అయితే తెలిసే అవకాశమ్  తక్కువ, వారి వారి పెద్ద వాళ్లు చెప్పి ఉండకపోతే. )