Thursday, October 30, 2014

ఏమి చెప్పావ్ దొరా!!, మర్చిపోయినట్లున్నావ్? ఇంతకీ నువ్వు ఎస్మా దొరవయినట్లేనా ఇప్పుడు?

ఇంతకముందు సమ్మె చెస్తున్న జుడా ల మీద ఎస్మా చట్టం ప్రయోగిస్తాం అన్న కిరణ్ కుమార్ ను, ఎస్మా రెడ్డి అంటూ ఎగతాళి చేస్తూ, జుడా ల తరుపున చొక్కాలు చించుకొంటూ మాట్లాడిన దొర మాటలు ఇవి,

మరి ఇప్పుడు వాళ్ల మీద ఎస్మా  ప్రయోగమిస్తాం అంటున్నారు, మరి ఇప్పుడు క.చ.రా. ను ఎస్మా దొర అని అనాలా?  ఏమంటారు దొర కు కాల్మొక్కే బ్లాగుల్లొని వీర విధేయులు? 

మందు సూదనా, దీనిమీద కూడా,  ఇది ఆంధ్రోళ్ల కుట్రే అంటూ ఓ టపా వదల రాదూ? కాస్త నా ఫేవరేట్ బ్లాగర్ అన్న పేరు నిలబెట్టుకొందువు కాని.




దొర గారు తాను కూసిన కూతలు తానే మరచిపోయినట్లున్నారు,

 ఈ కూతలు అప్పుడు మంచి కూతలే, ఇప్పుడు మంచివి కాదు అంటూ సమర్ధించుకుంటూ రావటాని బ్లాగులలో చచ్చి దెయ్యాలు గా తిరిగుతున్న అమరవీరులు ఎటూ ఉన్నారు అనుకోండి, దెయ్యాలు ఇగ పండగ చేసుకోండి కామెంట్స్ రూపం లో :)

గమనిక: టపా జూడా ల సమ్మె సహేతుకమా, కాదా అన్నదాని గురించి కాదు, అదే జుడాల సమ్మె గురించి, జుడా ల గురించి అప్పుడో కూతలు, ఇప్పుడో కూతలు కూస్తున్న దొర గురించి, దొరకు బ్లాగులలో కాల్మొక్కే గాళ్ల రియాక్షన్ గురించి మాత్రమే!!



Sunday, October 5, 2014

పెద్ద కొడుకు సొద


చంద్రబాబు వృద్థాప్యపు పెన్షన్ పెంచటం (ఎన్నికలలో హామీ ఇచ్చినట్లు గానే) ఆహ్వానించదగినదే!
కాకపోతే మన పెద్దకొడుకు ఇచ్చాడు అంటూ ఓ వెయ్యిరూపాయల నోటు పట్టుకొని ఓ పెద్దాయన చెప్పటం, ముసలి దంపతులు ఆయన ఫోటో గోడకు తలించుకొన్నట్లు గా పదే పదే ఆ TV యాడ్స్ మాత్రం భరించటం కష్టం గానూ, చాలా చిరాకుగా ఉంది. 

దానికి నా కారణాలు.
1. pension పెంచటం అనేది ఒక్క చంద్రబాబు నిర్ణయం అనే కంటే, చంద్రబాబు నేతృత్వము లోని ప్రభుత్వ నిర్ణయం అనటం సంప్రదాయం,
 ఆ సంప్రదాయాన్ని తుంగలోకి తొక్కిన చచ్చిన దేముడు ఇలానే మొత్తం తానే తన సొంత జేబులోనుండి ఇస్తున్నట్లు బిల్డప్పు ఇచ్చి, ఇలానే ప్రభుత్వ డబ్బుతో యాడ్స్ మీద యాడ్స్ ఇచ్చేవాడు, తాను తిన్న విషయాలు కోర్టు అడిగితే మాత్రం అది మంత్రివర్గ సమిష్టి నిర్ణయం మా నాయన ఒక్కడికే సంబంధం ఏమిటి అని ఇప్పుడాయన కొడుకు అంటున్నాడు,
వీళ్లు చేసే తప్పుడు నిర్ణయాలకు మాత్రం మంత్రివర్గం అంతా సమిష్టి గా భాద్యత వహించటం, చేసే ఉపాధి పథకాలు, పేరు వస్తాయనుకొంటున్న పథకాలకు మాత్రం కేవలం ఒక్కళ్లే చేస్తున్నట్లు ఈ బిల్డప్పులు అవసరమా!
2. ఆ యాడ్స్ అసలే డబ్బులు లేని పరిస్తితులలో అవసరమా? ఓ ప్రక్క రాజధానికి చందాలు అడుగుతూ ప్రభుత్వ పరంగా మరో ప్రక్క ఇలాంటి దుబారా ఖర్చులు చేస్తుంటే జనాలకు ఎలాంటి మెసేజి వెల్తుంది?
TV9 పెట్టాలంటే ఈ యాడ్స్ తో బహు చిరాకు గా ఉంది. 

Wednesday, September 17, 2014

మా మంచి దొర!!





ఇదీ ఓ సారి చూడండి.

ఎవరేమన్నా మా దొరే మంచోడు, మాట మీద నిలబడేటోడు, ఒకవేళ నిలబడకపోయినా అది ఆంధ్రోళ్ళ కుట్ర కదా తెలబాన్స్?

దీని మీద కట్టా శేఖర్ రెడ్డి, తన బ్లాగు లో అడిగిన మాటలు.

"హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ మరాట్వాడాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతున్నదని, ఇక్కడ సీమాంధ్ర ప్రభుత్వం సెప్టెంబరు 17ను గుర్తించకపోవడం అన్యాయమని నిన్నమొన్నటిదాకా మనమే నిందించాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ కారణాలు చెప్పి ఉత్సవాలకు దూరంగా ఉంటుంది? తెలంగాణ అస్తిత్వం ప్రతీకలను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్న ప్రభుత్వం రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును ఎలా విస్మరించగలదు. మనకు రాని స్వాతంత్య్ర దినం ఆగస్టు పదిహేనును ఘనంగా నిర్వహించే మనం, మనకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబరు 17ను ఎలా విస్మరించగలం? ఇప్పుడు సెప్టెంబరు 17ను జరుపుకోకపోవడం రాజకీయ అవకాశవాదం అవుతుంది. చరిత్రను అవమానించడం అవుతుంది. రాజకీయ పునరుజ్జీవనం గురించి మాట్లాడుతున్నవాళ్లం, మొన్నమొన్నటి వాస్తవాలను ఎలా దాచిపెట్టగలం? "

ఇంతకీ గత ప్రబుత్వం చేసినది మంచి పనా? కాదా?

ఆనాడు మహారాష్ట్ర, కర్నాటక ప్రబుత్వాలు లాగా అప్పటి ప్రబుత్వం ఎందుకు చేయటం లేదని చొక్కాలు చించుకొన్న దొరకు, ఇప్పటి సంది ఏమయినాదే? నిజాం రాణి ని చూడగానే, దొర గారి భక్తి పొంగిందా పాత ప్రభువు మీద?

ఇంతకీ అది నాలుకా, తాటి మట్టా? ఇది కూడా ఆంధ్రోళ్ల మీడియా కుట్రేనా మందు సూదనా & కంపెనీ?


Tuesday, September 16, 2014

మా మంచి ఆచార్యుడు!!



ఆచార్యులు అంటే ఒకే మాట మీద, కనీసం ఒకే అభిప్రాయం మీద ఉండే వాళ్లు, ఊసరవెల్లి లాగా ఆచార్యుల ముసుగులో ఉన్న రాజకీయనాయకులకంటే దరిద్రుడి నిజ రూపం.

అయ్యా కోదండరామా, నువ్వు మాత్రం మా తెలబానులకు సరి అయిన గురువు వే సుమా!

పైన U turn కు కూడా ఆంధ్రా మీడియా, ఆంధ్రోళ్ల కుట్ర లే కారణమా మందు సూదనా? దీనిమీద కూడా ఓ విద్వేషపు టపా వెయ్య రాదే?

క.చ.రా. దరిద్రపు భాష దగ్గరనుండి, వసూళ్ల వరకూ paid comments లాగా సమర్ధిస్తూ, కామెంట్ లు వేసే కామెంట్ వీరులేమయినా సమాధానం చెబుతారా దీనికి?

Thursday, September 11, 2014

తల తెగి పడ్డా మాట తప్పం.. హామీలు అన్నీ దశల వారీగా అమలు చేస్తాం-ఎన్ని తలలు దొరా నీకు?

తల తెగి పడ్డా మాట తప్పం.. హామీలు అన్నీ దశల వారీగా అమలు చేస్తాం. ~ కేసీఆర్.. 

గతంలో సరిగ్గ ఇదే ముక్క జెప్పినవ్ "తల నరుక్కుంట గాని మాట తప్పను - దళితుడే సిఎం" అని.. 
http://www.youtube.com/watch?v=Is3tkvhajVs    (మళ్లీ నీ చెంచాలు మా దొర ఎక్కడ చెప్పిండు, గిదంద్తా ఆంధ్రోళ్ల కుట్ర అనకుండా గిదిగో ప్రూఫ్ , బ్లాగులలో నీ పాలేరు గాళ్లకు కూడ !!)

గిప్పుడు చెప్పు దొరా, గింతకీ మనకు గెన్ని తలకాయలు? రావణాసురుడు కంటె గో పది, నువ్వు గిట్లా ప్రతిదానికి తల నరుక్కొంటా నని మాట్లాడితే  నీ కెన్ని తలకాయలు కావాలా?

నా లాంటోళ్లు గెన్ని టపాలు గట్టాలా,  నీ తలనరుకుడు మీద ( గిప్పటి సంది గిది రెండొ టపా)? నిన్ను గవరింగ్ చేయటానికి, గా బండితుడు,  నా ఫేవరేట్ బ్లాగరు మందు సూదనుడు గెన్ని విద్వేషల ఎత్తిపోతల టపాలు, సారీ యఙ్ఞాలు జెయ్యాల? గింకొందరు గెన్ని కామెంట్లు బెట్టాలా నిన్ను గవరింగ్ సేయుటకు?


గిందంతా గెందుకు గాని దొరా, ఒక్క మాలి, ఒకే ఒక్క మాలి, ఆ తలేందో నరుక్కో రాదే, నీకే కాక నీ కారు కూతలు వినే ఖర్మ మాకు, ఆ కారుకూతలుకు చప్పట్లు కొట్టే ఖర్మ నీ చెంచాలకు తప్పి పోతుంది!!

Wednesday, September 10, 2014

దురహంకారమా లేక దివాళాకోరుతనమా?


చానళ్లలో మీ గురించి తప్పు చెప్పారు అని బంద్ పెట్టినం అన్నావ్, అది నీ ఇష్టం.

 ప్రజాస్వామ్యంలో బంద్ పెట్టె హక్కు ప్రభుత్వానికి ఉందా, లేదా అనేది వాదించుకునే విషయం, వదిలేద్దాం.

ఆ రెండు చానళ్ళ అధిపతులకు ప్రభుత్వం తరుపున ఇలా ప్రచారం చేసారు, మా శాసనసభను అగౌరవ పరిచారు అని పరువు నష్టం దావా వెయ్యండి తప్పు లేదు. దానికి ఆ చానెళ్ళ వారు సమాధానం చెప్పుకుంటారు. ఇదే దేశ చట్టం మనకు నిర్దేశించిన మార్గం.

దానికి ఈ ఆంధ్రోల్లు అనే గొడవ ఎందుకు?

 దానిలో ఆ ప్రాంత ప్రజలు చేసిన తప్పు ఏంటి. ప్రజలను, అది దేశ ప్రజలను అనే హక్కు నీకు ఎవరు ఇచ్చారు దొర.
ఇది దొరగారి దురహంకారమా , లేక దివాళాకోరుతనమా?

బ్లాగు లోకంలో దొర గారి పాలేర్లు గా టపాలు, కామెంట్లు వేసే వీరులు ఎవరయినా సమాధానం ఇస్తారా?


From a friend (Kiran T) FB post.