Friday, May 29, 2020

అయ్యయ్యొ ఇంత అన్యాయమా బ్లు జఫ్ఫా లకు!

ఏమిటి, హైకోర్ట్ ఎలెక్షన్ కమీష్నర్ పదవీకాలాన్ని తన ఇష్టమొచ్చినట్లు మార్చుకొనే వెసులుబాటు లేదందా? ఇలా అయితే ఎట్లా ఏడుపుముక్కలా? అర్జెంట్ గా నువ్వు శతకోటి సలహాదారులలో ఒకడిగా చేరిపోవాల్సిందే, లాభం లేదు.

ఇక పచ్చ తమ్ముళ్ళు ఇదేదో తమ గొప్ప విజయమని కాలర్లు ఎగరేయక్కర్లలేదు. ఎందుకంటే ముందుగా దానిమీద కోర్ట్ కు వెళ్ళింది బి.జె.పి. నాయకులు. తె.దె. వాళ్ళు కాదు. 
ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎప్పుడూ తె.దె. కు సప్పోర్టర్ ఏమీ కాదు. తాను గవర్నర్ సిఫారుసు తో నియమితుడు అయ్యి వచ్చి రాగానే "ఛీప్ సెక్రటరీ" ని అలాగే "ఇంటిలిజెన్స్ DIG" ని మార్చినది మర్చిపోకండి, అంతే కాదు మొన్నటికి మొన్న నామినేషన్లు వేయనీయకుండా కేండిడేట్ లను అడ్డుకొని, కొన్ని చోట్ల రక్తం వచ్చే లాగా కొట్టి మరీ, ఏకగ్రీవాలు చేసుకొంటే, వాటి క్లిప్పింగ్స్ కొన్ని విడియో లలో వచ్చినప్పటికి, ఆ ఏకగ్రీవాలను కేన్సెల్ చేయాలని ప్రతిపక్షాలు మొత్తుకొన్నా, అవి అలానే ఉంటాయి అన్న మాట మర్చిపోకండి. ఇప్పుడు ఉంచుతాడో లేదో తెలియదు.  

రాజకీయాలలో పేరడీ ఏమిటి అంటే, తాము ఎంతో సప్పోర్ట్ చేసిన రాజకీయ పక్షం చేతిలో, LV సుబ్రహ్మణ్యం గారు, నిమ్మగడ్డ రమేష్ లు అవమానింపబడితే, వారిని తీవ్రం గా విమర్శించిన తె.దె. పార్టీ వారికి సానుభూతి తెలపాల్సి రావటం. 

చూద్దాం మన జలగన్నాయ్ దీనిమీద కూడా సుప్రీం కోర్ట్ కు వెళ్తాడేమో!  వెళ్ళాలనే ఆశిస్తున్నా? ఇంతకీ ఎన్నికలు పెడతానికి రేడీ గా ఉండండి అని లాక్డౌన్ లో కూడా ఆఘమేఘాల మెద క్వారెంటీన్ లాంటివి పాటించకుండా వచ్చిన  మాజీ న్యాయమూర్తి  కనగరాజ్ గారు ఎక్కడ?  అంత పెద్ద న్యాయమూర్తి ఆయనకు తెలియదా, ఈ నిర్ణయం కోర్ట్ లలో నిలబడుతుందో లేదో అని? ఇంతకీ ఆయన ఆ రోజు నుండి ఎందుకు కనబడకుండా పోయాడు? ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా సుప్రీం కోర్ట్ కు వెళ్ళొచ్చా? 

చివరాఖరు గా, Dr.సుధాకర్ తరుపున వాదించినందుకు లాయర్,  మాజీ న్యాయమూర్తి కూడా అయిన శ్రావణ కుమార్ మీద పెట్టినట్లు ఇప్పుడు జంధ్యాల శంకర్ మీద కూడా కేసులు కట్టిస్తాడా లేదా మా జలగన్న?  ఇంతకీ బ్లాగులలో వై.చి. పి.  రెసిడెంట్ లాయర్ శ్రీ ఏడుపుముక్కల గారి కామెంట్ ఏమిటో దీనిమీద? ఏమిటో జలగన్న దెబ్బకు బోలెడు క్వొచ్చన్లు బుర్రకు 🤣🤣

Wednesday, May 27, 2020

64 మొట్టికాయలు


👉మొట్టికాయ 1: ఎందుకీ తొందర- పీపీఏల సమీక్ష అధికారం మీకెక్కడిది? ధరలు నిర్ణయించేది ఈఆర్‌సీ - తగ్గించుకోవాలని బెదిరింపులా?: 26.07.19
👉మొట్టికాయ 2: మేం చెప్పినా ఇంతేనా? - విద్యుత్‌ కొనుగోలు చేయరా? - ఇది మా ఆదేశాల ఉల్లంఘనగా భావించాలి: 31.07.19
👉మొట్టికాయ 3: చంద్రబాబుకు భద్రత తగ్గించవద్దు - కాన్వాయ్‌లో జామర్‌ ఉండాల్సిందే : 15.08.19
👉మొట్టికాయ 4: పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు విషయంలో రివర్స్‌ చెల్లదు - కాంట్రాక్టు రద్దు కుదరదు - ఇది జెన్కో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు - రద్దు నిబంధనలు అనుసరించలేదు. : 23.08.19
👉మొట్టికాయ 5: స్విస్‌ ఛాలెంజ్‌పై మీ వైఖరింటి?: 04.09.19
👉మొట్టికాయ 6: బందరు పోర్టుకు భూముల్ని అప్పగించడంలో సర్కారు విఫలం - జీవో నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వండి- మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దన్న ఏజీ: 13.09.19
👉మొట్టికాయ 7: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలి: 14.09.19
👉మొట్టికాయ 8: మీ పద్దతి బాగోలేదు - ధరలు ఖరారు పిటీషన్లను త్వరగా తేల్చాలని ఏపీఈఆర్‌సీకి ఆదేశం : 17.09.19
👉మొట్టికాయ 9: పాలక మండలి ఇదేం పద్దతి?- విశ్వవిద్యాలయాల చట్టంకు విరుద్దంగా నిర్ణయాలు : 29.10.19
👉మొట్టికాయ 10: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ విక్రయిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? : 02.11.19
👉మొట్టికాయ 11: ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆక్షేపణ - ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు కేయించేందుకు ఓ విధానం అంటూ లేదా? : 14.11.19
👉మొట్టికాయ 12: రాజధాని కమిటీపై మీ వైఖరేంటి? బొత్సా, బుగ్గన్నలకు నోటీసులు: 15.11.19
👉మొట్టికాయ 13: కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా? - పంచాయితీ ఎన్నికలు జరపరా?: 15.11.19
👉మొట్టికాయ 14: పాస్టర్లు, ఇమాం, మౌజన్‌లకు ఏ నిబంధన ప్రకారం పారితోషకం: 28.11.19
👉మొట్టికాయ 15: ఆలయ బోర్డుల రద్దు మీ ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు : 30.11.19
👉మొట్టికాయ 16: మద్య నిషేదమే లక్ష్యమైతే రిటైల్‌ను తగ్గించరేం? - బార్లను తగ్గించడంలో మతులబేంటి? : 04.12.19
👉మొట్టికాయ 17: ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులా? - ప్రజాస్వామ్య దేశంలో ఇదేం పద్దతి? - ఎవరి అనుమతులతో చేస్తున్నారో నిలదీత - : 14.12.19
👉మొట్టికాయ 18: సౌర, పవన, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు: 20.12.19
👉మొట్టికాయ 19: బార్ల సంఖ్యను తగ్గించాలనుకున్నప్పుడు ముందుగా గుర్తించి యజమానులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సింది: 20.12.19
👉మొట్టికాయ 20: విద్యుత్‌ బకాయిలు తక్షణం చెల్లించండి - సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ఇంత జాప్యమా: 21.12.19
👉మొట్టికాయ 21: అంతా ఆంగ్లం కుదరదు - విద్యా హక్కు చ్టానికి అది విరుద్దమే - ఇంగ్లీష్‌ జీవోకు బ్రేక్‌: 21.12.19
👉మొట్టికాయ 22: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉండగా ఇంచార్జ్‌ ఛైర్మన్‌ ఎలా నియమిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు : 22.12.19
👉మొట్టికాయ 23: బార్‌ లైసెన్సుల ఉపసంహరణపై స్టే - కొత్త లైసెన్సుల మంజూరు ప్రక్రియ నిలిపివేత : 24.12.19
👉మొట్టికాయ 24: వీసీగా దామోదర్‌ నాయుడికి అర్హత ఉంది - నియమకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాఖ్యలు కొట్టివేత : 24.12.19
👉మొట్టికాయ 25: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ విధుల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు : 25.12.19
👉మొట్టికాయ 26: ఐపీఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెషన్‌పై ఘాటు వ్యాఖ్యలు - పాలించే పద్ధతి ఇది కాదు - హోదా మార్చి బదిలీ చేస్తారా.. ఎంత ధైర్యం?- ప్రభుత్వాన్ని తప్పుడు శక్తులు నడిపిస్తున్నాయి - రాజకీయ కక్షతో ఎంత వెంటాడారో అందరికి తెలుసు : 25.12.19
👉మొట్టికాయ 27: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిమిత్తం జనవరి 7వ తేదీ మధ్యాహ్నం 2గంటల లోపు రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని ఆదేశం : 03.01.2020
👉మొట్టికాయ 28: ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద 2019-20 సంవత్సరానికి సంబంధించి మొది విడత చెల్లింపుల్లో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,845 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు జమ చేయకపోవడంపై హైకోర్టు సీరియస్‌. నెల రోజుల్లో వాటిని జమ చేయాలని ఆదేశం. : 08.01.2020
👉మొట్టికాయ 29: రాజధాని గ్రామాలలో శాంతియుత నిరసనలపై 144 సెక్షన్‌ విధించడంపై హైకోర్టు సీరియస్‌. : 13.01.2020
👉మొట్టికాయ 30: రాజధాని గ్రామాలలో 144 సెక్షన్‌ విధింపుపై మరోసారి హైకోర్టు ఆగ్రహం. రాజధాని ప్రాంతంలో పోలీసుల భారీ కవాతు, ఆందోళనలో పాల్గొన్న మహిళలను బూటు కాలుతో తన్నడం, మగ పోలీసులు మహిళలను అరెస్ట్‌ చేయడంపై సీరియస్‌. : 17.01.2020
👉మొట్టికాయ 31: రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాల విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసిన హైకోర్టు. ఈలోపు కార్యాలయాల తరలింపునకు చర్యలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు బాధ్యులవుతారు. ఖర్చుచేసిన సొమ్మును అధికారుల జేబు నుంచి రాబడతాం. : 23.01.2020
👉మొట్టికాయ 32: విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామివారి దేవస్థానం ఈవో నియామక జీవోను తప్పబట్టిన హైకోర్టు. ఆ జీవోను రద్దు చేయాలని ఆదేశం. : 25.01.2020
👉మొట్టికాయ 33: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చే చర్యల్లో భాగంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు తదితర చర్యలు చేపడితే ఖర్చును బాధ్యులైన అధికారుల నుంచి రాబడతాం. : 27.01.2020
👉మొట్టికాయ 34: ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులు వేయడానికి వీల్లేదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులేస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోంది..? రెండు వారాల్లోగా రంగులు తొలగించాలి. : 27.01.2020
👉మొట్టికాయ 35: వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు అభ్యంతరమేమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. జగన్మోహన్‌రెడ్డి విపక్షనేతగా ఉండగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ అభ్యర్థనపై వైఖరి ఏమిటో చెప్పాలి. : 28.01.2020
👉మొట్టికాయ 36: జీవీఎంసీ (గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌) ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు..? : 29.01.2020
👉మొట్టికాయ 37: పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. రాజధాని వ్యవహారంపై పిషన్లు కోర్టు విచారణలో ఉండగా కార్యాలయాల తరలింపుకు ఎందుకంత తొందర..? : 04.02.2020
👉మొట్టికాయ 38: పార్లమెంట్లో పీఎం ఫో లేదు. హైకోర్టులపై సీజే ఫోలూ లేవు. కానీ ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలపై ముఖ్యమంత్రి బొమ్మ ఎందుకు..? : 05.02.2020
👉మొట్టికాయ 39: సౌర, పవన విద్యుదుత్పత్తి సంస్థల బకాయిలు 4 వారాల్లోగా చెల్లిస్తామని హామీనిచ్చి.. ఇప్పివరకు ఎందుకు చెల్లించలేదు..? ఏపీఎస్పీడీసీఎల్‌ను ప్రశ్నించిన హైకోర్టు. : 05.02.2020
👉మొట్టికాయ 40: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ కార్యాలయాలపై పార్టీ రంగులా..? దీనిపై కేంద్ర వైఖరి తెలపాలి. : 06.02.2020
👉మొట్టికాయ 41: ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదు. డిప్యుటేషన్‌ పై ఉన్న అధికారిని సస్పెండ్‌ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబ్టింది. కృష్ణ కిశోర్‌ ను వెంటనే ఐటీ శాఖలో చేర్చుకోవాలని ఆదేశించింది. 25.02.2020
👉మొట్టికాయ 42: ఎమర్జెన్సీని తలపిస్తున్న పోలీసులు – బీహార్ కన్నా ఏపీలోనే అక్రమ నిబంధనలు ఎక్కువయ్యాయి : 26.02.2020
👉మొట్టికాయ 43: జీఎన్ రావు బోస్టన్ కమిటీల ఫైళ్లన్నీ అప్పగించండి. 27.02.2020
👉మొట్టికాయ 44: వన్ సైడ్ గేమ్ కుదరదు, రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్ని ఇళ్ల స్థలాలకు ఎలా ఇస్తారు? 28.02.2020
👉మొట్టికాయ 45: -19 ఉపాధి పథకం కింద కేంద్ర పభుత్వం విడుదల చేసిన రూ 1134 కోట్లను ఎందుకు పంపిణీ చేయమని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది – 03.03.2020
👉మొట్టికాయ 46: ఫిబ్రవరి 27న విశాఖలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి , సెక్షన్ 151 కింద నోటీసులు ఎలా ఇస్తారు?– 03.03.2020
👉మొట్టికాయ 47: పేదల భూములు గుంజుకుంటారా? అసైన్డ్ భూముల్లో ఇళ్ల పట్టాలా? ఒకరి వద్ద తీసుకొని మరొకరికిస్తారా? – కెవిపిఎస్ రిట్ పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు : 05.03.2020
👉మొట్టికాయ 48: రాజకీయ రంగులొద్దు, పంచాయితీ భవనాలకు వైకాపా జెండాను పోలిన రంగుల్ని తీసేయంది, పార్టీలతో సంబంధం లేని రంగు 10 రోజుల్లో వేయండి, ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. 11.03.2020
👉మొట్టికాయ 49: విశాఖలో చంద్రబాబు గారికి 151 సీఆర్పీసీ నోటీసు ఇవ్వడంపై హైకోర్టు సీరియస్. ఏ నిబంధన కింద సీఆర్పీసీ 151 అమలు చేశారో చెప్పాలని డీజీపీని ప్రశ్నించిన ధర్మాసనం. నోటీసు ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన హైకోర్టు. 12.03.2020
👉మొట్టికాయ 50: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ వైకాపా నేతలు వ్యవహరించాని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినా.. వార్డు కార్యదర్శులు, వాలంటీర్లను వైకాపా ప్రచారం కోసం వినియోగిస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) పట్టించుకోకపోవడంపై హైకోర్టు సీరియస్. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై తక్షణం స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం. 13.03.2020
👉మొట్టికాయ 51: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వవద్దని హైకోర్టు ఆదేశం. సీఎస్‌ సహా పలువురికి నోటీసులు. – 17.03.2020
👉మొట్టికాయ 52: కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను నిలుపుదల చేసిన హైకోర్టు - విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు జారీ చేసిన జీవో సస్పెన్షన్ - ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు – 20.03.2020
👉మొట్టికాయ 53: సుప్రీంకోర్టులోజగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ - పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్దించిన సుప్రీంకోర్టు - రంగులు తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం – 23.03.2020
👉మొట్టికాయ 54: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి జీవో కొట్టివేత - జీవో81, 85ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు – 15.04.2020
👉మొట్టికాయ 55: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు పంచాయతీ కార్యాలయాలకు రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశం - వైసీపీ రంగులను తొలగించడానికి మూడు వారాలు గడువు కోరిన ప్రభుత్వం - 20.04.2020
👉మొట్టికాయ 56: వలస కూలీల సమస్యపై సీపీఐ నేత రామకృష్ణ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ - విజయవాడ, గుంటూరు నగరాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను వెంటనే వారి స్వస్థలాలకు పంపేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - ఏపీలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు ఈ సౌకర్యం కల్పించాలని హైకోర్టు ఆదేశం - వలస కార్మికులకు తగిన వసతి, ఆహారంతోపాటు రూ.10 వేలు ఆర్థిక సహాయం చేయాలన్న హైకోర్టు – 23.04.2020
👉మొట్టికాయ 57: ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు నోటీసులు - ఎమ్మెల్యేలు మధుసూదన్‍రెడ్డి, రోజా, సంజీవయ్య, వెంకటగౌడ, విడదల రజినికి నోటీసులు - కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలు కారణమంటూ దాఖలైన పిటిషన్‍పై విచారణ - నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ, ప్రభుత్వానికి ఆదేశం – 05.05.2020
👉మొట్టికాయ 58: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ - పంచాయతీ భవనాలకు కొత్తరంగులు వేయాలని జీవో నెం.623 ఇచ్చిన ప్రభుత్వం - వైసీపీ రంగులతోపాటు మరో రంగును వేయాలని జీవో తెచ్చిన ప్రభుత్వం - జీవో నెం.623ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు – 05.05.2020
👉మొట్టికాయ 59: ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.15 ను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు – 07.05.2020
👉మొట్టికాయ 60: వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం – విచారణకు ఎందుకు ఆదేశించకూడదన్న హైకోర్టు – ప్రజాప్రతినిధులే నిబంధనలు పట్టించుకోకపోతే ఎలా..? – 20.05.2020
👉మొట్టికాయ 61: పంచాయతీ కార్యాలయాల రంగుల వ్యవహారంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 623ను సస్పెండ్ చేసిన హైకోర్టు - వైసీపీ జెండా రంగులే కనిపిస్తున్నాయన్న వాదనతో ఏకీభవించిన హైకోర్టు – 22.05.2020
👉మొట్టికాయ 62: డా.సుధాకర్ పై జరిగిన దౌర్జన్యంపై హైకోర్టు ఆగ్రహం – కేసును సీబీఐ విచారణకు ఆదేశం - విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐకి ఆదేశం - 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలి – 22.05.2020
👉మొట్టికాయ 63: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత - ఆయనను సస్పెండ్‌ చేస్తూ జారీ చేసిన జీవోను రద్దుచేసి, మొత్తం ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కోర్టు ఆదేశం – 22.05.2020
👉మొట్టికాయ 64: ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్‌ చేసి ఉంచాలి. కంపెనీ లోనికి ఎవరినీ అనుమతించొద్దు. తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లకూడదు, పాస్‌పోర్ట్‌లు అప్పగించాలి. 24.05.2020

పై లిస్ట్  క్రేయేట్ చేసింది నేను కాదు కానీ నాకు ఫార్వర్డ్ అయ్యి వచ్చిన దాన్ని యధాతధమ్ గా ఇక్కడ. 

ఇప్పుడు దీనిని పబ్లిష్/ఫార్వర్డ్ చేస్తున్న సమస్త జనం మీద ఏడుపుముక్కల/బ్లుబ్యాచ్ అందరూ వాళ్ళ జలగన్నాయ్ తో చెప్పి, నానా రకాల సెక్షన్స్ తో కేసులు పెట్టిస్తారా ఏంటి ఖర్మ.  

సరే చివరాఖరుగా, ఏడుపుముక్కలా ఓ చిన్న డౌట్, ఎటూ బ్లాగులలో  వై.చి.పి. కి రెసిడెంట్  "లా" కన్సల్టెంట్ వి గందా, ఇన్ని మొట్టికాయలు కోర్టులు వేస్తుంటే నువ్వూరుకొంటే ఎలా మరి?
మీ జలగన్నాయ్ దగ్గర దొర తెలంగాణా కోటా లో ఓ సలహాదారు పదవి తెచ్చుకోలేకపోయావా ? నిరంతర పక్రియ లో భాగం గా, సలహాదారులు, వారికి ఉపసలహాదారులు పదవీ పందేరాలు with full benefits ఇంకా జరుగుతునే ఉన్నాయి గందా. 

Sunday, May 24, 2020

టీటీడీ భూముల అమ్మకం!!


టీటీడీ భూముల అమ్మకం గురించి ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అప్పట్లో




ఈ మాటలు విన్న తరువాత కూడా, ఇదే పెద్దమనిషి అవే టీటీడీ భూముల అమ్మకానికి  పెట్టేయటాన్ని జఫ్ఫాలు  లు, సాక్షి మాత్రమే చదివే అఖిలాండ జగన్ భక్తులు 🙏ఎలా సమర్థిస్తారో మరి 🤭🤭🤭



ఇక దీనిమీద Bharat Today  లో పరిపూర్ణానంద గారి అద్భుతమయిన స్పీచ్.   ఇందులో కవర్ చేసినవి భూముల గురించి, కనకదుర్గ అమ్మవారి గుడిలో క్షుద్ర పూజలు జరిగాయని చేసిన గొడవ గురించి, ఏడాది గా దానిగురించి కనీసం విచారణ చేపట్టలేకపోవటం గురించి, పింక్ డైమండ్ అని నానా యాగీ చేసి, ఇప్పుడు గమ్మున ఉండటం గురించి,  రమణ దీక్షితుల అభ్యంతరం  లడ్డులు అమ్ముకోవటం గురించి, గత ప్రభుత్వం చేసిందే మేము చేస్తున్నామనే పనికిమాలిన ఆర్గుమెంట్ గురించి.

శేఖర్ రెడ్డి  అప్పోయింట్మెంట్ గురించి అప్పుడు ఆయన CBN  బినామీ అని చేసిన యాగీ, మళ్ళి  అతన్నే అప్పోయింట్ చేసుకొన్న వైనం గురించి కూడా కవర్ చేసుంటే పోయేది స్వామి.



చివరాఖరుగా, వీర జగన్ భక్తుడే అయినప్పటికీ,  నా మిత్రుడు Gopi  Ch  అన్న మాట ముఖ పుస్తకం లో:

"చిన్న చిన్న ఆస్తులే కదా అమ్మితే పోలా అనుకొంటే రాజకీయ నాయకులు మొత్తం వెంకన్న ఆస్తిని కూడా నాకేస్తారు రా అయ్యా ...! కొంచెం మేల్కోండి ... తీవ్రంగా .. ఖండించండి ..!!!" 

ఆ ముక్కే నేను కూడా చెప్పేది. 

అయ్య పెట్టుకొని పావురాళ్ళ గుట్ట కు అంకితం అయ్యాడు, అయినా కొడుకు ఎందుకు పెట్టుకొంటున్నాడో  ఆ పై వాడికే తెలియాలి. 

Wednesday, May 20, 2020

ఎందుకు ఇంత పిరికితనం!!

ఎందుకు ఇంత పిరికితనం ఈ ఎరుకలసందు వైరస్ మోహన్  రెడ్డి కి, వాడు పోషించే జఫ్ఫాగాళ్లకు!!!

65 సంవత్సరాల పైబడిన  పూంతోట  రంగనాయకమ్మ   అనే పెద్దావిడ మీద ఈ క్రింది ప్రశ్నలు  అవీ ఎవరో రఘునాధ్ మల్లాది అనే తన ముఖపుస్తక మిత్రుడు  వ్రాసిన వాటిని షేర్ చేశారు అని  నానా రకాల సెక్షన్ ల కింద CID  పోలీసులు ఇంటికి వఛ్చి మరీ కేసులు పెట్టారు.  అవే ఈ ప్రశ్నలు.

1: ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారు
2: కంపెనీ సీజ్ చేయలేదు.
3: చాలా తెలివిగా కంపెనీ లిక్విడ్ ఎస్సెట్ అయిన స్టెరీన్ ను వెనక్కు తరలించారు
4:పోలీసు బాస్ పర్యటన పేరుతో లోపల ఉద్యోగుల హాజరును ఏమార్చారు.
5:క్లూస్ టీం వచ్చి వేలి ముద్రలు సేకరించే అవకాశం లేకుండా చేశారు.
6: స్టెరీన్ ఎవరి పేరు మీద కొనుగోలు చేశారు అనేది చాలా ముఖ్యమైన అంశం. అందుకే దానిని వేగంగా దేశం దాటించారు.
7: స్టెరీన్ లో మిక్సింగ్ చేయటానికి తెచ్చిన కెమికల్ మాయం చేశారు
8: అసలు కంపెనీని యల్ జి. పాలిమర్ రన్ చేస్తుందా లేక వేరే కంపెనీకి ఉత్పత్తి చేసేందుకు కాంట్రాక్టు ఇచ్చారా?
9: ఇప్పుడు వెనక్కు పంపుతున్న వందల కోట్ల ఖరీదైన లిక్విడ్ స్టెరీన్ కొనుగోలుకు ఏ బాంకు ఋణం తీసుకున్నారు.
10: ఆ బాంకు ఇంత వరకు కంపెనీకి ఎందుకు షో కాజ్ నోటీసులు ఇవ్వలేదు. రేపు కంపెనీ తరలి పోయాక మాకు బాకీ ఉందని ప్రకటించినట్లయితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు.
11: కంపెనీ తరలి పోతుందని ప్రభుత్వం ప్రకటించటం వెనక రహస్యం ఏమిటి?అది చేయవలసినది కంపెనీ యాజమాన్యం కదా?
12:ఒక మల్టీనేషనల్ కంపెనీ తన సంస్ధను ఎత్తి వేస్తున్నట్లు ముందుగా కేంద్రానికి కదా తెలియ చెయ వలసినది. రాష్ట్రానికెందుకు అంత తొందర.
13: ఇప్పుడు ఈ స్ధాయిలో ఆధారాలు ధ్వంసం చేశాక యు. యన్ ఓ . కానీ సు. కో. గానీ హై. కో. గానీ ఏమి పరిశోధించి నిజాలు నిగ్గు తేల్చగలరు.
14:హై. కో. నిజంగా విచారణ చేయాలనుకుంటే వెంటనే సి. బి. ఐ. విచారణ కు ఆదేశించి ఉంఈ డేది. అలా చేయకుండా తాత్సారం జరిగింది అంటే ఏమిటి అర్ధం.
15: గతంలో ఎప్పుడూ బాధితులను గుర్తించి ఇంత వేగంగా పరిహారం చెక్కులు ఇవ్వలేదు.
16:ఇంత వ్యూహాత్మకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలకు పాల్పడుతుంటే ఏ రాజ్యాంగ బద్ద సంస్ధలూ కోర్టు లూ ఏమీ చేయలేవు.
17: గంటల వ్యవధిలో కేంద్రం స్టెరీన్ ను తరలించేందుకు నౌకలను సమకూర్చటము కూడా ఈ కుట్రలో భాగమే. ఎందుకంటే ఈ కరోనా పరిస్థితులలో ఒక దేశం నుంచి మరో దేశానికి అసలు సరకు రవాణా యే లేదు. మరి వీళ్ళకెలా అనుమతి లభించింది.
18: వారం రోజులు కావస్తున్నా కనీసం కంపెనీ ప్రతినిధులు బయట నిర్భయంగా తిరగ గలగటమూ బాధితులు అరెస్టు కాబడటమూ ఈ దేశంలో ఇదే మొదటిసారి.
19: సంఘటనానంతరం కంపెనీ ని సందర్శించిన పోలీసు అధికారి అరెస్టు లు మా పని కాదు అని ప్రకటించటం దేనిని సూచిస్తుంది
20: ఆ అయిదు గ్రామాలప్రజలు ఇక ఆశ ఒదిలేసుకోవటమే మిగిలింది.
ఇక ఈ రాష్ట్రంలో బాధితులకు న్యాయం జరగటం అనేది ఎక్కడా ఏ సందర్భంలో నూ సాధ్యం కాదు.

ఇదే ప్రశ్నలు నేనే కాదు,  సోషల్ మీడియాలో ఏంతో మంది అడుగుతున్నారు, ఎంతమంది మీద కేసు పెడతారు?  ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆ ప్రశ్నలను తన ఆఫీషియల్ ఫెస్బుక్  లోనే పెట్టింది.  ఏమి పీకుతారు.  Telugu Desam Party లింకు ఇది

పిరకతనానికి కూడా ఓ హద్దు అనేది ఉంటుంది.  ఆడవాళ్ళ  మీదా వీళ్ళ ప్రతాపం.

ఇంతా చేస్తే, జీవితము లో ఎన్నో చూసినదానిని ఇదో లెక్కా, అని తన సహజమయిన చిరునవ్వుతో నెమ్మదితనం తో మాట్లాడుతున్న ఆ తల్లి ని చూస్తే ఎందుకో, నాకు నా చిన్నతనం లో మా నాయనమ్మను చూసినట్లనిపించింది.

ఇక జాతీయ మీడియా లో కూడా  దీనిమీద వచ్చిన  కథనాలు
Mumbai Mirror  లింకు ఇది


ఓ ప్రక్కన ఈ బ్లు జఫ్ఫా గాళ్ళు , నోటికొచ్చ్చిన బూతులన్నీ ఆడవాళ్ల మీద, రాజధాని ప్రాంత స్త్రీ లమీద, వారికి నచ్చని పోస్ట్ లు పెట్టె పరాయి స్త్రీల మీద వయసు తో నిమిత్తం లేకుండా తిడుతూ సోషల్ మీడియాలో రెచ్చిపోతూనే   ఉంటారు, వారిమీద ఎన్ని పిర్యాదులు ఇచ్చినా వాటికి దిక్కు ఉండదు కానీ, ఇలాంటి వాటిమీద మాత్రం అతి హడావిడి  చేస్తారు.

కానీయండి మరో పావురాళ్ళ గుట్ట పిలవకపోతుందా ఆ 100 తప్పులు పూర్తి అవగానే.

ధర్మో రక్షతి రక్షితాః 

PS :  పెద్దగా తెలియని ఓ పెద్దావిడ ఎవరో పెట్టిన ప్రశ్నలను షేర్ చేస్తే ఇంత హడావుడి చేయటం ఏమిటి? ఇదే ప్రశ్నలు ఆమె కంటే ముందే ఎంతో మంది షేర్ చేశారు కదా, ఆవిడని ఎందుకు టార్గెట్ చేసి, ఇలా ప్రతికూల ప్రచారం  కొని తెచ్ఛు కొంటున్నారు అని  ప్రస్తుత ప్రభుత్వం లో ఓ పదవి "కొని" తెచ్చుకొన్న గుంటూరు జిల్లాకే చెందిన  NRI మిత్రుడుని అడిగితె, ఏమి చెప్పమంటావ్ ,  గుంటూరు లోనే ఉండే "స్త్రీ"ధర్  రెడ్డి ఆ?తు  అనే ఓ బ్రోకర్ గాడు తనకు  ఏదో ఒక పదవి పొందటం కోసం ఆమెను టార్గెట్ చేసి హీరో అవుదామనుకొని చేసిన పెంట ఇది, గుంటూరు లో వారి కుటుంబం గురించి తెలిసిన వాళ్లెవరు ఈ పని చేయరు  అని అన్నాడు, నిజా నిజాలు దేవుడికి ఎరుక. 
ఇక అసలు ఆమె షేర్ చేసిన కంటెంట్ వ్రాసిన రఘునాధ్ మల్లాది గారు ఎవరో ఈ జఫ్ఫా `CID' పోలీసు వారికి తెలియలేదంట, వెతుకుతున్నార"ట",  ఇప్పటికీఅదే కంటెంట్ కనీసం కొన్ని లక్షల సారులు షేర్ చేయబడి ఉంటుంది వేర్వేరు సోషల్ మీడియా ప్లాటుఫారమ్స్ మీద , వాళ్లందరికీ సరిపోయే జైళ్లు 16 నెలలు చిప్ప కూడు తినివచ్చిన ఈ జైలన్న provide చేయగలడా? 


ఇదిగో ఏడుపుముక్కలా, ఇప్పటివరకూ నిన్ను మించిన జఫ్ఫా ఇంకెవరూ  ఉండరనుకొన్న, ఇప్పుడు నా నమ్మకం వమ్ము అయ్యింది,  ఇంకొచమ్ ఏడుపు కామెంట్ లు పెంచబ్బా.  అవునూ నాకో చిన్న సందేహం, మీ తెలంగాణా దొర ఏరికోరి పెంచుకున్న పులివెందుల పులి కి ఇంత పిరికితనం ఏందబ్బా  :) 

Sunday, April 19, 2020

మాతృభాష, మహిళలు, చట్టాలు, కోర్టులు, రాజ్యాంగం, రాజకీయాలు - కావేవీ కులజఫ్ఫాల కులపంచాయితీలకి అనర్హం

ఒక అడ్డగోలు ఉత్తర్వు తెచ్చేటప్పడు కొద్దిగ ఆలోచించండి, తల్లి తండ్రులు వాళ్లకు నచ్చినది ఎంచుకొనే అవకాశం ఇవ్వండి అంటే ఒక వర్గం అంటూ కమ్మల మీద దాడి చేసారు. ఆ ఉత్తర్వు చట్ట విరుద్దం అని కోర్టు కొట్టేస్తే కోర్టుకు వెళ్లింది ఇతను అనే నెపంతో ఇంకొక వర్గం అంటూ  బ్రాహ్మణుల  మీద దాడి చేసారు. అసలేంటి వీళ్ల కుల ఆధిపత్యపు ప్రకోపాలు?

మెుదటగా చెప్పుకోవలిసింది ఈ భూమి మీద ఏ సమూహం కూడా తమ భాషను పోగొట్టుకోవాలని కోరుకోదు, చివరికి లిపి లేని భాషల సమూహాలతో సహా. ఆ సమూహాల ఉనికి వాటి మాతృభాషతో అంతగా పెనవేసుకుని ఉంటుంది. దురదృష్టవశాత్తు తెలుగు నేల మీద ఆ సృహ తక్కువైతే దానికి పరాకాష్ట ఇప్పటి ప్రభుత్వ నిర్ణయం. అది దీర్ఘకాలంలో మన ఉనికికే ముప్పు అని నాలుగు మంచి మాటలు చెప్పిన వారందరినీ కులం పేరుతో తిట్టి వాళ్ల కుటుంబాలను వీదికి తెచ్చారు చట్టసభ సాక్షిగా. చివరికి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారిని సైతం వదలలేనంత కుల అసహనం చూపించారు.

దీనిలో మంచి, చెడు పక్కన పెడితే ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం, దానిని కొంతమంది వ్యక్తులు తమ పార్టీ తరపున, మరి కొంతమంది వ్యక్తిగతంగా ప్రశ్నిస్తూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. ఇక్కడ చెప్పుకోవలిసిన మరొక విషయం ఇదేమీ ఆస్తి తగాదాల సివిల్ కేసు కాదు, మన తాతల కాలం నుంచి చేయితిరిగిన హత్యల వంటి క్రిమినల్ కేసూ కాదు, కేవలం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ దాఖలు చేసిన ఒక ప్రజా  ప్రయోజన  వాజ్యం. దీనిలో అధికారులను బెదిరించో, ప్రలోభ పెట్టో సాక్ష్యాలు తారుమారు చేయలేరు, లేక దస్తావేజులు మార్చలేరు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వు చట్టానికి అనుగుణంగా ఉందా, రాజ్యాంగానికి లోబడి ఉందా అనేదాని మీద తీర్పు ఉంటుంది. కోర్టు ఆ ఉత్తర్వు రాజ్యాంగానికి విరుద్దం అని కొట్టి వేస్తే దానికి ఈ పార్టీ సోషల్ మీడియాలో న్యాయమూర్తుల శీల హననం.

కేసు దాఖలు చేసిన వ్యక్తి ఇంట్లో ఆడవారితో సహా ఫోటోలు పెట్టి అసభ్య రాతలు, ఆ వ్యక్తి కులాన్ని లాగి ఇదంతా ఆ కులం కుట్ర అని  దూషించడం. ఎందుకు ప్రతి దానిలో కులాన్ని మాత్రమే వెతికే  కుల తీట? కేసు వేసిన వ్యక్తి ఆ కులానికేమీ ప్రతినిధి కాదు, ఆ కులమంతా గూడుపుఠాణీ చేసి ఈయనతో కేసు వేయుంచలేదు. ఇది ఆ కులం కుట్ర అయితే మీ పార్టీలో ఉన్న ఆ కులానికి చెందిన బాపట్ల నాయకుడు, విశాఖ నాయకుడు, మీ నాయకుడి కోసం దేవుడిని కూడా వదిలేసి పూజలు చేసే విశాఖ స్వామిలోరు, మీ పార్టీ కోసం పనిచేసే తిరుమల స్వామిలోరు, మాజీ సివిల్ సర్వీస్ అయ్యోరు మెుదలైన వారంతా ఈ కుట్రలో భాగమేనా? మీ నాయకుడి అనుమతి లేకుండానే ఈ కుట్రలో భాగమయ్యారా?

ఒక వ్యక్తి ఒక నమ్మకంతో కేసు వేయడం అతని వ్యక్తిగతం, పార్టీ తరుపున చేయడం పార్టీ సిద్ధాంతం. దానికి ఆ వ్యక్తి కుటుంబం, కులం ఏవిధంగా బాద్యత వహిస్తాయ? అలా అయితే మీరు సోషల్ మీడియాలో రాసే రోత రాతలు, లేకి కూతలు మీ కుల సిద్దాంతంగా భావించాలా? మీనాయకుడి కులం చేస్తున్న కుట్ర అనుకోవాలా? నిజానికి అలా అనుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది మహిళలు మీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు, మీ పార్టీ నాయకుడి కులానికి చెందిన వారికి  ఇప్పటికి కనీసం 500 పైగా  పదవులూ కట్టబెట్టారు. మీ సోషల్ మీడియా ఫాక్షనిజం ఈ సరికే మీ పార్టీ, కుల పెద్దల దృష్టికి వచ్చి ఉంటుంది, కానీ ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు, మహిళల మీద, కులాల మీద సోషల్ మీడియా ఫాక్షనిజం ఆగలేదు అంటే ఇది తప్పక మీ పార్టీ లేక పార్టీ పెద్దల కుల కుట్రగానే భావించాల్సి ఉంటుంది.

స్వాతంత్రము  వచ్చిన  సమయంలో తెలుగు రాజకీయాలను నిర్ణయించిన  బ్రాహ్మణులను రాజకీయ పాలెగాళ్లు ఏవిధంగా అణగదొక్కి తమ కులజెండాలెగరేసారో కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ జరుగుతుంది మళ్లీ దాదాపు అదే. మా ఖాప్ లకు(కుల పంచాయతీలు) అడ్డొస్తే, వ్యవస్ధలు, చట్టాలు, కోర్టులు, రాజ్యాంగం ఏదీ వదలం అనే పాలెగాళ్ల కాలపు మనస్ధత్వం మాత్రమే!




NOTE: ఈ ప్రక్కన ఫోటో పెట్టి వై.చి.పి. సోషల్ మీడియా తిప్పుతున్న మెసేజ్, నేను వారి కుటుంబసభ్యుల ముఖాలను కవర్ చేయటానికి ప్రయత్నించాను,  సుధీష్ ఎటూ పబ్లిక్ ఫిగరే. 

Wednesday, April 15, 2020

హైకోర్ట్ చేతిలో ఇది ఎన్నో మొట్టికాయ? "ఇంగలపీసు మీడియం మాత్రమే G.O." రద్దు

మన బ్లాగులలో రెసిడెంట్ లాయర్ దీన్ని కూడా పచ్చ మీడియా కుట్ర అనే అంటాడేమో?

హెమిటో కొన్ని బతుకులు అంతే!! ఏడవటం తో నే మొదలయ్యి, ఏడవటంతోనే కాలం గడిపి, ఏడవటంతోనే ముగుస్తాయి. ఎవరికయినా ఏడుపుముక్కల అనే ఆయన గుర్తుకువస్తే అందులో నా తప్పేమి లేదు.

ఇక ఏడుపుముక్కలా మరీ ఏడవబాకు, I am "Just being an "equal opportunity offender"! " మీకు అర్ధమవుతుందా 😜


Monday, March 23, 2020

పచ్చ ఫోబియా ఉన్న ఏడుపుముక్కల లాంటి మిత్రుల కోసం!

బ్లాగులలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసే నచ్చని పనులను పాయంట్ చేసినా, లేక దగ్గినా తుమ్మినా, వాళ్లకు నచ్చని మాట ఎవరైనా చెప్పినా ఏడుపుముక్కల లాంటి అతి తెలివి జఫ్ఫాలు వాదన లేక, ఆవు వ్యాసం లగా చేసే కామెంట్లు,

"ఇది పచ్చ బ్యాచ్ పైచాచికత్వం"
"ఇది కమ్మ వాళ్ల కుట్ర"
"ఇది పచ్చ మీడియా"

వాళ్లది పచ్చ పైచాచికత్వం అయితే, మీది నీలి పైచాచికత్వం అవ్వదా? కనీసం ఆ సృహ అయినా మీకు ఉండదా?

మీరు ప్రతిపక్షం లో ఉన్నప్పుడు గెలవటం కోసం ఓ కులాన్నో, ఓ ప్రాంతాన్నో టార్గెట్ చేస్తే వర్కౌట్ అవుతుంది అని పార్టీ చెప్పి ఉండవచ్చు, మీరు ఆ పని మీదనే ఉండి ఉండవచ్చు కూడా,  గెలిసి, అధికార పక్షం అయిన తరువాత కూడా, ఈ ఏడుపులు, ఈ సెలెక్టివ్ టార్గెట్ లు, ఆవు వ్యాసాలు వర్కౌట్ అవ్వవు అన్న కనీస జ్ఞానం లేకపోతే ఎలా?

ఇక మాట్లాడితే పచ్చ పచ్చ మీడియా అని, నిజానికి ఇవ్వాళ పచ్చ మీడియా కంటే ఎక్కువ నీలి మీడియా హౌజ్ లు ఉన్నాయి అన్న సంగతి తెలియనంత అమాయకులా మీరు? లేక తెలిసీ తెలియనట్లు నటించే అతి తెలివితేటలా?
ETV, ABN, TV5 లు ఓ ప్రక్క అనుకొంటె, Sakshi, TV9, NTV, 10TV లు గట్రా ఇంకో ప్రక్క లేవా? మరి ఎందుకు ఈ పాడిందే పాట పాచిపళ్ల ... అన్నట్లు, ఈ ఏడ్చిందే ఏడుపులు?

పైన నేను చెప్పినట్లు పచ్చ పచ్చ అంటూ ఓ కులం మీదో, ఓ ప్రాంతం మీదో పడి ఏడ్చే ఏడుపుగాళ్ల కోసం ఎవరో అద్భుతం గా వేసిన కామెంట్.

ఓ కులాన్నో/ప్రాంతాన్నో టార్గెట్ చేస్తూ, సమస్యను ప్రక్క దారి పట్టించే కామెంట్ కో ఉదాహరణ:

"ఎందుకో గానీ కమ్మ వారు ఎంతో entrepreneurship leadership లక్షణాలు ఉండి ఇలా కులాధిపత్య చట్రం లో ఇరుక్కుపోయారు అర్థం కాదు.

The sad fact is that they aren't realising that they are alienating themselves with their exclusivity and one-upmanship.

కమ్మ రెడ్డి కులాధిపత్య పోరు ఆంధ్ర ప్రజలకు మంచిది కాదు. నేను ఒకప్పుడు సమైక్య వాదిని కానీ తెలంగాణా ఈ కులపిచ్చి నుంచి విడిపోయి బాగుపడి మంచి పని చేసింది.

Just thinking aloud and not intended to hurt anyone."



దానికి ఎవరో పెట్టిన సమాధానం, మొట్టికాయలు 😉😉 లేకుండా, సుతిమెత్తంగా :

మీరు రాసిన ఈ కామెంట్లో మీరు కమ్మవారిని అసమంజసమైన కారణాలతో ఏలియనేట్ చేస్తున్నట్టుంది కాని, వాళ్ళని సమంజసమైన కారణాలతో కలుపుకునే ప్రయత్నం కనబడలేదు.

హిందువులైన చంద్రబాబు కానీ, లోకేష్ గానీ బ్రాహ్మణులని ఎలా అగౌరవ పరచారో చెప్తారా? మొదటిసారి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి ప్రభుత్వం ద్వారా ఎంతో మంది పేద బ్రాహ్మణులకి సాయం అందించారు కదా? 
ఎలెక్షన్లప్పుడు పండితుల చుట్టూ తిరిగి నదుల్లో మునిగి, అధికారంలోకి వచ్చాక ఏంచేసాడు జగన్? గౌరవంగా కార్పోరేషన్ని పక్కన పెట్టేసాడు అంతే కదా? అదే సమయంలో చర్చిల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాకపోయనా పాస్టర్లకి జీతాలిచ్చి మొత్తం సమాజాన్నే పీడిస్తున్నవాడు బ్రాహ్మణులని ఎలా గౌరవిస్తున్నట్టు? ఇంటిలో ఎవాంజెలిస్ట్ని పెట్టుకుని క్రిస్టియన్ల జనాభా గత దశబ్ధంలో విపరీతంగా పెరగడానికి కారణమయి అర్చకుల కి హిందూ సమాజంలో కొంత భాగాన్ని శాశ్వతంగా దూరం చేస్తున్న కుటుంబం. ఇప్పుడు బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా ఏమీ చేయకపోయినా వారి పట్ల గౌరవాన్ని ప్రకటించడం, నాలాంటి వాళ్ళకి తలగోక్కున్నా అర్ధం కాదు. కొన్ని ప్రభుత్వ బడుల్లో చంద్రబాబు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినప్పుడు గోల చేసిన సమాజం, ఇప్పుడు జగన్ అన్ని బడుల్లో సదుపాయాలు లేకుండా ప్రవేశపెడుతుంటే ఆ స్థాయిలో విమర్శేది? అసలు తెలుగు మీడియమే లేకపోతే మొదట నష్టపోయేది ఎవరు?


సినెమాల్లో కామెడీని టోకుగా కులానికి పూసుకోవడం, దాన్ని ఆధారంగా ఇంకో కులాన్ని ద్వేషించడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. తెలుగు సినెమా పుట్టినప్పటి నుండి రచయితలు, కవుల్లో 80 శాతం బ్రాహ్మణులే కదా? 50 శాతం సినెమాలు కమ్మవాళ్ళు నిర్మించి ఉంటారేమో. పనిగట్టుకుని బ్రాహ్మణుల మీద కామెడీ రాయమని ఆ నిర్మాతలు, హీరోలు కంకణంకట్టుకున్నట్టు చెప్తారేమి? మీఉద్దేశంలో ఆ రచయితలు నరం లేని, స్వాభిమానంలేని స్వామి భక్తి పరాయణులనా? ఈ తరంలో కోన వెంకట్, హరీష్ శంకర్ లాంటి వాళ్ళు ఎవరడిగితే కామెడీ చేస్తున్నారు? వాళ్ళు విపరీతంగా వాళ్ళ సినెమాలకి కామెడి చేసి మైకు ముందుకొచ్చి ప్రవర చెప్తే ఫరవాలేదా?

ఇక ఆధిపత్యం చూపే వాళ్ళూ అభిజాత్యం చూపే వాళ్ళు అన్ని అగ్రకులాల్లో ఉంటారు కదా? బెజవాడలో జరిగే విషయాలకి చేసే హడావుడి కర్నూలు జరిగే విషయాలకి జరగదు. అలానే అమలాపురానికీ అంతే హడావుడి చెయ్యరు. రెండు వందలేళ్ళుగా బెజవాడ అనేక రంగాలకి మార్పులకి కేంద్రంగా ఉండటం వల్ల ఇప్పటికీ మీడియా అక్కడ ఫోకస్ చేసినట్టు కర్నూలు మీద తూగో మీద పెట్టదు.

విచిత్రం ఏంటంటే సగటు తెలంగాణ వ్యక్తికి రాయలసీమ వ్యక్తికి ఉత్తారంధ్ర వ్యక్తికి దైనందిన జీవితంలో తారసపడని కోస్తా కమ్మ వారిని బూచిగా చూపి అక్కడ పారంపరిక ఆధిపత్య కులాలు అక్కడ ఇతర వర్గాలని రెచ్చగొట్టి అధికారం నిలుపుకునే క్రతవు నిరంతరం జరుగుతూనే ఉంది గత ౩ దశాబ్ధాలుగా.. తెలంగాణ విడిపోయింది, ఆ విషబీజాలు ఇంకా విజయవంతంగా సీమలోనూ ఇప్పుడు కొత్తగా ఉత్తరాంధ్రలోనూ నాటుతూనే ఉన్నారు. మీలాంటి వారు అగ్నికి ఆజ్యంపోస్తూ సమిధలవుతూనే ఉంటారు. జనాన్ని ఎంతగా రెచ్చగొడుతున్నారంటే వారి వెనకబాటుకు వారు ఎన్నుకున్న నాయకులు కారణం కాదు ఇంకెవరో అని నమ్మేంత. ఇక్కడ రెడ్లని ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నాను. కమ్మ వారు ఎక్కువగా ఉన్న తూగో నుండి ప్రకాశం వరకూ జిల్లాల్లో ఉన్న సామాజిక సమతుల్యత, అధికారంలో భాగస్వామ్యం రెడ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఎందుకు కనపడదు? ధర్మ ప్రభువులు అనకండి. కరడుగట్టిన (one-upmanship) ఆధిపత్యాన్ని చూపుతున్నది ఎవరు?



పైన ఆయన అడిగిన దానికి ప్రొద్దున లేస్తే, పచ్చ పచ్చ అంటూ శాశ్వతంగా కళ్లకు పచ్చ కళ్లాద్దాలు తగిలెంచుకొని, ప్రతిదీ కుల కోణం లోనో, ప్రాంత్ కోణం లోనో చూస్తూ, కామెంట్లు పెట్టే ఏడుపుముక్కలా నీ దగ్గర సమాధానం ఏమయినా ఉందా?  

ఏప్పటిలాగే, మీ ఆవిడ ఏ రంగు చీర కట్టుకొన్నా, అది పచ్చ చీర, ఇంకోటి కట్టుకొని రా అనే అంత పచ్చ ఫోబియా తో  బాధపడుతూ, ఆవు వ్యాసం లాగా కామెంట్స్ వ్రాయటమేనా? 

అలాగే, standard disclaimar ఇది ఎక్కడొ చదివినట్లు ఉంటే కొంచం సర్ధుకుపొండే 😉

"Just thinking aloud and not intended to hurt anyone"


పై పాక్షిక కామెంట్, దానికి ప్రతిస్పందన పల్లెప్రపంచం బ్లాగు నుండి, దాని లింక్:

https://blog.palleprapancham.in/2020/03/blog-post_54.html?showComment=1584986852838#c2185228938310993415